iDreamPost

యూజర్లకు షాకిచ్చిన నెట్ ఫ్లిక్స్.. పాస్ వర్డ్ షేరింగ్ పై కీలక నిర్ణయం!

  • Author Soma Sekhar Published - 01:35 PM, Thu - 20 July 23
  • Author Soma Sekhar Published - 01:35 PM, Thu - 20 July 23
యూజర్లకు షాకిచ్చిన నెట్ ఫ్లిక్స్.. పాస్ వర్డ్ షేరింగ్ పై కీలక నిర్ణయం!

ఓటీటీల రాకతో ఎంటర్టైన్ మెంట్ ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కింది. దానికి కరోనా తోడవ్వడంతో.. పుట్టగొడుగుల్లా ఓటీటీలు పుట్టుకొచ్చాయి. దాంతో వ్యాపారాల్లో తీవ్రమైన పోటీ నెలకొంది. ఈ క్రమంలోనే ప్రముఖ ఓటీటీలు యూజర్లను ఆకట్టుకునేందుకు రకరకాల ప్లాన్లను అందుబాటులోకి తీసుకొచ్చాయి. అయితే గత కొంతకాలంగా ప్రముఖ ఓటీటీ సంస్థలు నష్టాలను చవిచూస్తున్నాయి. దాంతో నష్టాలను పూడ్చుకునే చర్యలను చేపట్టాయి ఈ సంస్థలు. అందులో భాగంగానే ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ పాస్ వర్డ్ షేరింగ్ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

నెట్ ఫ్లిక్స్.. ఇండియాలో పాస్ వర్డ్ షేరింగ్ ను ముగిస్తున్నట్లు గతంలోనే ప్రకటించింది. కేవలం ఇంటి సభ్యులు మాత్రమే ఒక ఖాతాను యాక్సెస్ చేయగలరని గతంలోనే ప్రకటించింది. దానికి ప్రధాన కారణం కొంతకాలంగా నెట్ ఫ్లిక్స్ ఆదాయం తగ్గడమే. ఆదాయం పెంచుకునే మార్గాలను అన్వేషిస్తోంది ఈ సంస్థ. ఆదాయాన్ని పెంచుకునే మార్గాల్లో భాగంగానే యూజర్స్ వారి కుటుంబానికి చెందని వ్యక్తులతో పాస్ వర్డ్ పంచుకోవడంపై మే లోనే కీలక ప్రకటనను రిలీజ్ చేసింది. సంస్థ ఆదాయ వనరులను పెంచుకోవడానికి తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది నెట్ ఫ్లిక్స్. జనవరి నుంచి పాస్ వర్డ్ షేరింగ్ ను కట్టడి చేస్తామని ఆ సంస్థ సీఈవో రీడ్ హాస్టింగ్ ప్రకటించారు.

ఈ క్రమంలోనే ఇక నుంచి ఇంటి సభ్యులు కాకుండా ఇతరులకు పాస్ వర్డ్ షేర్ చేయాలంటే.. కొంత ఛార్జీని చెల్లించి షేర్ చేసుకోవచ్చని సంస్థ వెల్లడించింది. ఈ నిబంధనను త్వరలోనే భారత్ లో అమల్లోకి తీసుకొస్తామని పేర్కొంది. ఈ సంవత్సరం చివరి నాటికి నెట్ ఫ్లిక్స్ అకౌంట్ పాస్ వర్డ్ బదిలీ చేసినందుకు యూజర్లకు ఛార్జీ విధించనున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఈ సందర్భంగా.. భారతదేశంలో ‘Add a home’ అనే ఫీచర్ ను తీసుకురానుంది నెట్ ఫ్లిక్స్. నెట్ ఫ్లిక్స్ తీసుకున్న ఈ నిర్ణయంతో పాస్ వర్డ్ షేర్ చేసుకునే యూజర్లకు భారీ షాక్ తగలనుంది. మరి నెట్ ఫ్లిక్స్ తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: కూతురి బర్త్‌డేకు 4 క్వింటాళ్ల టమాటాలు పంచిన తండ్రి!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి