iDreamPost

నరకడం మొదలుపెడితే ఏ పార్టు ఎక్కడుందో మీ పెళ్లాలు కూడా గుర్తుపట్టలేరు – #NBK107 టీజర్

నరకడం మొదలుపెడితే ఏ పార్టు ఎక్కడుందో మీ పెళ్లాలు కూడా గుర్తుపట్టలేరు – #NBK107 టీజర్

నందమూరి నటసింహం.. నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు (జూన్ 10) సందర్భంగా అభిమానుల కోసం #NBK107 టీజర్ ను విడుదల చేసింది చిత్రబృందం. ఫ్యాక్షన్ నేపథ్య సినిమాలు చేయడం బాలకృష్ణకు కొట్టిన పిండి. ఫ్యాక్షన్ సినిమాలు చేయడంలో ఆయనకు ఆయనే సాటి. అఖండ తర్వాత బాలకృష్ణ దర్శకుడు గోపీచంద్ మలినేనితో #NBK107 సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు ఇంకా టైటిల్ ఖరారవ్వలేదు.

కానీ.. రేపు బాలయ్య పుట్టినరోజును పురస్కరించుకుని చిత్రబృందం కొద్దిసేపటి క్రితమే టీజర్ ను విడుదల చేసింది. యథావిధిగా బాలకృష్ణను సింహానికి సింబాలిక్ గా చూపిస్తూ.. టీజర్ ను వదిలారు. ఈ టీజర్ లో బాలయ్య పవర్ఫుల్ డైలాగ్స్ చెప్పారు. ‘మీ జీవో గవర్నమెంట్ ఆర్డర్ .. నా జీవో గాడ్స్ ఆర్డర్’ .. ‘భయం నా బయోడేటాలోనే లేదురా ..’ ‘నరకడం మొదలుపెడితే ఏ పార్టు ఎక్కడుందో మీ పెళ్లాలు కూడా గుర్తుపట్టలేరు’ అనే డైలాగ్ లు ఫ్యాన్స్ ను ఉర్రూతలూగిస్తున్నాయి. ఈ సినిమాకు కూడా తమనే సంగీతం అందిస్తున్నారు. #NBK107 లో బాలయ్యకు జోడీగా శృతిహాసన్ నటిస్తోంది. ఈ ఏడాది దసరాకు సినిమాను విడుదల చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి