iDreamPost

TDPలో పవన్ పెత్తనం! పార్టీకి దూరంగా నారా లోకేశ్!

Nara Lokesh: బుధవారం పశ్చిమగోదావరి జిల్లాలోని తాడేపల్లి గూడెంలో టీడీపీ, జనసేన ఉమ్మడి బహిరంగ సభ జరిగింది. ఈ సభకు ఇరు పార్టీల నేతలు ఆ హాజరయ్యారు. ఇదే సమయంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మాత్రం రాలేదు

Nara Lokesh: బుధవారం పశ్చిమగోదావరి జిల్లాలోని తాడేపల్లి గూడెంలో టీడీపీ, జనసేన ఉమ్మడి బహిరంగ సభ జరిగింది. ఈ సభకు ఇరు పార్టీల నేతలు ఆ హాజరయ్యారు. ఇదే సమయంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మాత్రం రాలేదు

TDPలో పవన్ పెత్తనం! పార్టీకి దూరంగా నారా లోకేశ్!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు చాలా వేడిగా ఉన్నాయి. ఎండాకాలం వేడి తన ప్రతాపం చూపించినట్లు.. ఎన్నికల వేళ ఏపీ రాజకీయ పార్టీలు తమ ప్రభావాన్ని చూపిస్తున్నాయి. అసలు కురుక్షేత్రం చూడని వారికి ఇక్కడి రాజకీయ పార్టీలు చూపిస్తున్నాయి. ఎప్పుడు ఎలాంటి పరిణామం ఏపీ రాజకీయాల్లో చోటుచేసుకుంటుందోని రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇదే సమయంలో కీలక నేతలకు సంబంధించిన ఏదో ఒక అంశం వార్తల్లో వినిపిస్తోంది. తాజాగా టీడీపీ, జనసేన నిర్వహించిన సభలో లోకేష్ కనిపించలేదు.

జనసేన, టీడీపీ మధ్య పొత్తు కుదరక ముందు వరకు చంద్రబాబు తర్వాత నారా లోకేష్ నెంబర్ టూ  ప్లేస్ లో ఉండేవాడు. అయితే ఎప్పుడైతే జనసేనతో టీడీపీ పొత్తు పెట్టుకుందో లోకేష్ ప్రాధాన్యత తగ్గిందని తెలుస్తోంది. చంద్రబాబు తన పుత్రుడి కంటే దత్తపుత్రుడికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాడని వైసీపీ నేతలు అంటున్నారు. అవే  మాటలను లోకేష్ కూడా  బలంగా నమ్మినట్లు ఉంది. అందుకే ఈ రెండు పార్టీలు నిర్వహిస్తున్న కీలక కార్యక్రమాలకు డుమ్మా కొట్టాడు. బుధవారం పశ్చిమగోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెంలో టీడీపీ, జనసేన ఉమ్మడి బహిరంగ సభ జరిగింది. ఈ సభకు ఇరు పార్టీల నేతలు ఆ హాజరయ్యారు.

ఈ కూటమి సభకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మాత్రం డుమ్మా కొట్టారు. ఇలా ఇటీవల జరిగిన రెండు కీలక రాజకీయ సమావేశాలకు లోకేష్ డుమ్మా కొట్టడం పార్టీలో చర్చకు దారి తీసింది. మొన్న జరిగిన సీట్ల పంపకం సమావేశంలో కూడా లోకేష్ కనిపించలేదు. తాడేపల్లిగూడెంలో జరిగిన కూటమి సభకు రాలేదు. గతంలో భోగాపురంలో జరిగిన లోకేష్ యువగళం పాదయాత్ర ముగింపు సభకు పవన్ కల్యాణ్ వచ్చారు. కానీ బుధవారం జరిగిన టీడీపీ, జనసేన కూటమి సభకు మాత్రం లోకేష్ ఎందుకు రాలేదనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఆయన అంత బీజీగా ఉన్నారా.. అంటే.. ఈ సభకు మించిన ముఖ్యమైన కార్యక్రమం లోకేష్ కి ఏముంది అని అంటున్నారు. అయినా లోకేశ్ రాకపోవడం మాత్రం ఆ సభలో చర్చకు దారి తీసింది.

ఈ క్రమంలోనే అనే వార్తలు పొలిటికల్ సర్కిల్ లో వినిపిస్తోన్నాయి. పవన్ కి చంద్రబాబు కాస్త ప్రాధాన్యం ఇవ్వడం లోకేష్ అంగీకరించలేదని, అసలు పవన్ తో పొత్తే లోకేష్ కి ఇష్టం లేదనే టాక్ వినిపిస్తోంది. పవన్ కోసం చంద్రబాబు వెళ్లి కలవడం తనకు అవమానంగా లోకేష్ భావించారని, అందుకే లోకేష్ సాధ్యమైనంతవరకు పవన్ తో దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారనే టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలోనే కొన్ని రోజుల క్రితం ఓ ఇంటర్వ్యులో కూడా లోకేష్ పవన్ ని తీసి పారేసినట్లు మాట్లాడారు. అధికారంలోకి వస్తే  పవర్ షేరింగ్ ఉంటుందా అని ప్రశ్నిస్తే.. మొత్తం ఐదేళ్లూ చంద్రబాబే సీఎంగా ఉంటారని చెబుతూ పవన్ చాలా లైట్ అన్నట్లుగా మాట్లాడారు.

ఆ సమయంలో లోకేష్ చేసిన వ్యాఖ్యలు జనసైనికుల్లో ఆగ్రహాన్ని తెప్పించాయి. అయినా లోకేష్  ఏ మాత్రం తగ్గలేదు.  ఇంకా చెప్పాలంటే.. తానొక పొలిటీషియన్ కాదని, కేవలం ఓ సినిమా హీరో అనే భావనలో పవన్ ఉన్నారనే లోకేష్ భావిస్తున్నట్లు పలువురు అభిప్రాయపడుతున్నారు. అసలు పవన్ తో పొత్తు లేకుండా ఒంటరిగా ఎన్నికలకు వెళ్లాలన్నది లోకేష్ ఆలోచనగా ఉందని టాక్. అయితే ప్రతిపాదనను చంద్రబాబు కాదని జనసేనలో పొత్తు పెట్టుకున్నారని, ఈ అంశం కుటుంబంలో గొడవకు దారితీసిందని కూడా టాక్ వినిపిస్తోంది. కారణం ఏదైనప్పటికీ లోకేష్ రెండు కీలక ఘట్టాల్లో కనిపించకపోవడం అనేక  అనుమానాలకు తావిచ్చింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి