iDreamPost

ఆ MLA గెలుపుని అడ్డుకునేందుకు అభ్యర్థి కోసం బాబు వేట!

Nara Chandrababu Naidu: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం అనేక ప్రయత్నాలు చేస్తున్నాడు. సర్వేలు అన్ని వైసీపీదే మరోసారి అధికారం అని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు బాబు మాత్రం కొన్ని నియోజకవర్గాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు.

Nara Chandrababu Naidu: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం అనేక ప్రయత్నాలు చేస్తున్నాడు. సర్వేలు అన్ని వైసీపీదే మరోసారి అధికారం అని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు బాబు మాత్రం కొన్ని నియోజకవర్గాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు.

ఆ MLA గెలుపుని అడ్డుకునేందుకు అభ్యర్థి కోసం బాబు వేట!

ఆంధ్రప్రదేశ్ లో మరికొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు వ్యూహాలు, ప్రతి వ్యూహాలు రచిస్తోన్నాయి. అధికార వైసీపీ మాత్రం 175 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇప్పటికే అభ్యర్థుల విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్న వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. మరిన్ని కీలక నిర్ణయాలకు సిద్ధంగా ఉన్నారు. ఇది ఇలా ఉంటే.. వచ్చే ఎన్నికల్లో  గెలుపు సంగతి పక్కన పెట్టి.. వైసీపీకి చెందిన కీలక ఎమ్మెల్యేలను ఓడించాలని టీడీపీ అధినేత చంద్రబాబు  భావిస్తున్నారంట. ముఖ్యంగా తన జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యేను ఓడించేందుకు సరైన అభ్యర్థి కోసం అన్వేషిస్తున్నాడని టాక్.

టీడీపీ అధినేత చంద్రబాబు చిత్తూరు జిల్లాకు చెందిన వ్యక్తి అని తెలుసు. ఆయన స్వగ్రామం నారావారిపల్లి చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి నియోజవర్గంలో ఉంది. ఇక బాబు రాజకీయ ప్రస్థానం మొదలైంది కూడా చంద్రగిరి నుంచే అనే విషయం విధితమే. ఆ తరువాత జరిగిన పరిణామాలతో కుప్పంకి చంద్రబాబు షిప్ట్ అయ్యారు. ఇక అక్కడి నుంచే నేటికి పోటీ చేస్తున్నారు. ఆయన స్వగ్రామం ఉన్న.. చంద్రగిరి నియోజకవర్గంపై  మాత్రం బాబు ప్రభావం ఏమాత్రం కనిపించడం లేదు. ఇక్కడ ఎక్కువ సార్లు టీడీపీ యేతర పార్టీలే విజయం సాధించాయి. ఇంతేకాక ఇటీవల వరుసగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విజయం సాధిస్తూ వస్తున్నారు.

2014,2019లో చంద్రగిరి నుంచి భాస్కర్ రెడ్డి విజయం సాధించారు. తన సొంత నియోజకవర్గం చంద్రగిరిలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఓడించడానికి చంద్రబాబు నాయుడు పట్టుదలతో ఉన్నారు.  ఇప్పటికే చాలా సార్లు భాస్కర్ రెడ్డిని ఓడించాలని ప్రయత్నించినా బాబుకి ఫలితం దక్కలేదు. అయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి చంద్రగిరి నియోజవర్గంలో గట్టి పట్టుంది. సామాన్య ప్రజలతో కలిసి పోవడం, వారి సమస్యలను సత్వరం పరిష్కరిస్తూ.. ఆ నియోజకవర్గంలో చెవిరెడ్డి బలమైన నేతగా ఎదిగారు. అంతేకాక అన్ని వర్గాల ప్రజల్లో ఆయనకు  మంచి గుర్తింపు ఉంది.  పార్టీ గుర్తుపై  కాకుండా సొంత ఇమేజ్ తో గెలవగల సత్తా ఉన్న అతి కొద్దిమంది నేతల్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒకరు. ఇలా అన్ని రకాలుగా నియోజవర్గంలో బలంగా ఉన్న చెవిరెడ్డి గెలుపును ఆపడం  అసాధ్యమనే ఆభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

చెవిరెడ్డి బలం తెలిసి కూడా ఇక 2024 ఎన్నికల్లో అయినా ఆయన గెలుపున ఆపాలని బాబు చూస్తున్నారంట. అయితే వచ్చే ఎన్నికల్లో చంద్రగిరి బరిలో చెవిరెడ్డి తనయుడు మోహిత్ రెడ్డి  ఉన్న సంగతి తెలిసిందే. అభ్యర్థి మోహిత్ రెడ్డే అయినప్పటికీ, కర్త,కర్మ, క్రియా.. అన్నీ మాత్రం ఆయన తండ్రి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనే విషయం తెలిసిందే.

CBN trying to stop MLA win

ఈ నేపథ్యంలోనే చెవిరెడ్డిని ఎదుర్కోడానికి చంద్రబాబుకు సరైన అభ్యర్థి దొరకడం లేదు. ఆ ప్రాంతంలో టీడీపీ చాలా బలహీనంగా ఉందని, దీంతో ఆ పార్టీ తరపును పోటీ చేసేందుకు ఎవరు పెద్ద ఆసక్తి చూపించడం లేదనే టాక్ వినిపిస్తోంది. అంతేకాక చంద్రగిరి చుట్టుపక్కల నియోజకవర్గాల్లో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన బలమైన  వ్యాపార వేత్తలను, కాంట్రాక్టర్లను బరిలో దింపాలని చంద్రబాబు ఉత్సాహం చూపినప్పటీకీ, అటువైపు నుంచి సరైన స్పందన రాలేదని తెలిసింది. ప్రస్తుతం చంద్రగిరి టీడీపీ ఇన్ ఛార్జీగా పులవర్తి నాని ఉన్నారు. ఆయన 2019లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు.

ప్రస్తుతం దొంగ ఓట్ల ఉన్నాయని ఆరోపిస్తూ ఆయన పోరాటం చేస్తున్నారు. 2019 ఎన్నికలతో పోలీస్తే ఇప్పుడు పెరిగిన ఓట్లు చాలా స్వల్పమే అని, అలాంటప్పుడు దొంగ ఓట్లకు చోటు ఎక్కడ ఉందని ఇటు రెవెన్యూ  అధికారులు, అటు వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. దొంగ ఓట్లపై టీడీపీ చేసే రాద్ధాంతం అంతా ప్రచారం కోసమే అని వైసీపీ నేతలు విమర్శిస్తున్నాయి. మొత్తంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గెలుపును అడ్డుకోవాలని బాబు విశ్వప్రయత్నాలు చేస్తున్నాడని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయా పడుతున్నారు. మరి.. చంద్రగిరిలో చెవిరెడ్డి గెలుపును ఆపడం చంద్రబాబు వల్ల అవుతుందా?. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి