iDreamPost

డాన్’ డైరెక్టర్ తో నాని.. ప్లాన్ బాగానే ఉంది! కానీ..

  • Author ajaykrishna Published - 02:20 PM, Fri - 28 July 23
  • Author ajaykrishna Published - 02:20 PM, Fri - 28 July 23
డాన్’ డైరెక్టర్ తో నాని.. ప్లాన్ బాగానే ఉంది! కానీ..

టాలీవుడ్ లో హిట్స్ ప్లాప్స్ లెక్కచేయకుండా వరుస ప్రాజెక్ట్ లతో దూసుకుపోతున్న హీరోలు కొందరు ఉన్నారు. వాళ్ల ఫామ్ ఎలా ఉన్నప్పటికీ.. చేతిలో సినిమాల సంఖ్య ఏమాత్రం తగ్గేదేలే అన్నట్లు మెయింటైన్ చేస్తుంటారు. అదేంటి.. ఫామ్ లో ఉన్నా లేకపోయినా కొత్త ప్రాజెక్ట్ లను ఇలా లైనప్ చేస్తున్నారని అనిపించవచ్చు. కానీ.. అదంతా వాళ్ళు ఆడియన్స్ లో క్రియేట్ చేసుకున్న ఇంపాక్ట్. సినిమాలు ఎలా ఉంటాయనే సంగతి పక్కన పెడితే.. ముందుగా హీరో సినిమాని థియేటర్స్ లో చూడాలని అనుకుంటారు. టాలీవుడ్ లో అలాంటి ఫామ్ కొనసాగిస్తున్నాడు నేచురల్ స్టార్ నాని. శ్యామ్ సింగరాయ్, అంటే సుందరానికి.. రీసెంట్ గా దసరా సినిమాలతో ఫామ్ కంటిన్యూ చేస్తున్నాడు.

ఈ క్రమంలో ప్రస్తుతం డెబ్యూ డైరెక్టర్ శౌర్యువ్ తో ‘హాయ్ నాన్న’ అనే ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాలో నటిస్తున్నాడు. ఆ సినిమా తర్వాత మరికొన్ని ఇంటరెస్టింగ్ ప్రాజెక్ట్ లను లైనప్ చేసే పనిలో ఉన్నాడు నాని. తాజా సమాచారం ప్రకారం.. నాని ప్రస్తుతం కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ సిబి చక్రవర్తి దర్శకత్వంలో ఓ సినిమా ఓకే చేసే ఆలోచనలో ఉన్నాడట. చక్రవర్తి గతేడాది శివకార్తికేయన్ హీరోగా డాన్ సినిమా తీసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ప్రస్తుతానికి నాని, చక్రవర్తిల ప్రాజెక్ట్ పై అధికారిక ప్రకటన అయితే రాలేదు. కానీ.. దాదాపు ఖరారు అయినట్లే అని సినీ వర్గాలు చెబుతున్నాయి.

ఇదిలా ఉండగా.. సినిమా సినిమాకు డిఫరెంట్ స్టోరీస్, డిఫరెంట్ క్యారెక్టర్స్ తో అలరించే నాని.. తన ప్రతీ సినిమాతో ఓ కొత్త అనుభూతిని కలిగించే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే.. టాలీవుడ్ లో కొత్త దర్శకులకు ఎక్కువ అవకాశాలు ఇవ్వడంలో నాని ఎల్లప్పుడూ ముందే ఉంటాడు. ఈ విషయాన్నీ ఆల్రెడీ చాలా సినిమాలతో ప్రూవ్ చేశాడు. రీసెంట్ గా దసరా మూవీతో శ్రీకాంత్ ఓదెల అనే కొత్త దర్శకుడిని పరిచయం చేశాడు. ఇప్పుడు హాయ్ నాన్న మూవీతో శౌర్యువ్ ని పరిచయం చేస్తున్నాడు. మరి ఇప్పుడు చక్రవర్తి డైరెక్షన్ లో యాక్షన్ కామెడీ మూవీ అని అంటున్నారు. ఈ సినిమాని తెలుగు, తమిళంలో ఒకేసారి ప్లాన్ చేయనున్నట్లు టాక్. మరి దీనిపై క్లారిటీ రావాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే. మరి నాని లైనప్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి