iDreamPost

ఘోస్ట్ టార్గెట్ చిన్నదే కానీ

ఘోస్ట్ టార్గెట్ చిన్నదే కానీ

రేపు జరగబోతున్న దసరా బాక్సాఫీస్ క్లాష్ లో అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా చిరంజీవి పైచేయి స్పష్టంగా కనిపిస్తోంది. ఏదో ఆర్ఆర్ఆర్ రేంజ్ లో అమ్మకాలు లేవు కానీ ఉన్నంతలో డీసెంట్ గానే సేల్స్ అవుతున్నాయి. ఎటొచ్చి నాగార్జున ది ఘోస్ట్ రేస్ లో కొంచెం వెనుకబడి ఉంది. కంటెంట్ ప్లస్ టాక్ మీద నమ్మకంతో ఉన్న దర్శక నిర్మాతలు రేపటికంతా పరిస్థితి మారిపోతుందనే ధీమాగా ఉన్నారు. బంగార్రాజు లాగా ఘోస్ట్ మాస్ కి కనెక్ట్ అయ్యే కాన్సెప్ట్ కాకపోవడం, టైటిల్ ఇంగ్లీష్ లో పెట్టడం లాంటివి కొంత వరకు కారణంగా చెప్పొచ్చు కానీ సోలో హీరోగా కింగ్ బ్లాక్ బస్టర్ కొట్టి చాలా కాలం కావడంతో ఆ ఎఫెక్ట్ నేరుగా ఇప్పుడీ ఓపెనింగ్స్ మీద పడుతోంది.

బిజినెస్ విషయానికి వస్తే ది ఘోస్ట్ ని చాలా రీజనబుల్ రేట్లకే థియేట్రికల్ బిజినెస్ చేశారు. బడ్జెట్ ఎంతైనప్పటికీ శాటిలైట్, డబ్బింగ్, ఓటిటిల ద్వారా ఎక్కువ రికవరీని టార్గెట్ గా పెట్టేసుకుని బయ్యర్లకు ఇబ్బంది లేకుండా ప్లాన్ చేసుకున్నారు. ట్రేడ్ టాక్ ప్రకారం ఇది 21 కోట్లకు పైగా జరిగినట్టు చెబుతున్నారు.ఈ సినిమాకు జరిగిన ఖర్చు కోణంలో చూస్తే ఇది తక్కువే. నైజాం 5 కోట్ల 50 లక్షలు, సీడెడ్ రెండున్నర కోట్లు, ఆంధ్రా 8 కోట్లు, కర్ణాటక 65 లక్షలు, హిందీ వెర్షన్ తో కలిపి రెస్ట్ అఫ్ ఇండియా 2 కోట్లు, ఓవర్సీస్ రెండున్నర కోట్లు వెరసి మొత్తం 22 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో ఘోస్ట్ రంగంలోకి దిగనున్నాడు. టాక్ బాగుంటే ఇదేమంత భయపడే భారీ మొత్తం కాదు.

రేపు మధ్యాన్నానికి గాడ్ ఫాదర్, ది ఘోస్ట్, స్వాతిముత్యంల తాలూకు పూర్తి టాక్ అండ్ రివ్యూస్ బయటికి వచ్చేస్తాయి. ఎవరిది పైచేయి అవుతుందో స్పష్టంగా తెలిసిపోతుంది. బెల్లంకొండ గణేష్ మీద మరీ భారీ అంచనాలేం లేవు కానీ దాని ప్రొడ్యూసర్స్ మాత్రం ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఇవాళ కొన్ని చోట్ల ప్రీమియర్లు కూడా వేస్తున్నారు. సో రాత్రికే దీని రిపోర్ట్ వచ్చేస్తుంది. ఇక కంప్లీట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ది ఘోస్ట్ ప్రమోషన్ ని తమిళనాడులో కూడా ప్రత్యేకంగా చేశారు. హిందీ డబ్బింగ్ రెండు రోజులు ఆలస్యంగా ఆగస్ట్ 7న రిలీజ్ కానుంది. విక్రమ్ వేదా, పొన్నియన్ సెల్వన్ 1 తాలూకు వన్ వీక్ అగ్రిమెంట్ల వల్ల ఇది తప్పలేదట

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి