iDreamPost

Naa Saami Ranga OTT: నా సామి రంగ OTT, శాటిలైట్ పార్ట్‌నర్స్ ఫిక్స్..

ఈ సంక్రాంతికి స్టార్ హీరోస్ మూవీస్ సందడి చేయబోతున్నాయి. అందులో ఒకటి అక్కినేని నాగార్జున నటించిన నా సామి రంగ. ఇందులో అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కూడా నటించారు. జనవరి 14న రిలీజ్ అవుతున్న ఈ మూవీ ఓటీటీ, శాటిలైట్ పార్ట్ నర్స్ ఫిక్సయ్యాయి.

ఈ సంక్రాంతికి స్టార్ హీరోస్ మూవీస్ సందడి చేయబోతున్నాయి. అందులో ఒకటి అక్కినేని నాగార్జున నటించిన నా సామి రంగ. ఇందులో అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కూడా నటించారు. జనవరి 14న రిలీజ్ అవుతున్న ఈ మూవీ ఓటీటీ, శాటిలైట్ పార్ట్ నర్స్ ఫిక్సయ్యాయి.

Naa Saami Ranga OTT: నా సామి రంగ OTT, శాటిలైట్ పార్ట్‌నర్స్ ఫిక్స్..

2023 సంవత్సరంలో కాస్త గ్యాప్ ఇచ్చిన ఈ ఏడాది సంక్రాంతికి నా సామి రంగ అంటూ దూసుకు వస్తున్నాడు అక్కినేని నాగార్జున. కొరియో గ్రాఫర్ విజయ్ బిన్ని ఈ చిత్రానికి దర్శకుడు. మలయాళంలో సూపర్ హిట్టైన పొరింజు మరియం జోస్ మూవీకి ఇది రీమేక్ అని ఓ వార్త హల్ చల్ చేస్తుంది. జనవరి 14న థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమైంది. ఈ మూవీలో అమిగోస్ బ్యూటీ ఆశికా రంగనాథ్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. అంజి పాత్రలో అల్లరి నరేష్ కనిపించబోతున్నాడు. రాజ్ తరుణ్, మీర్నా మీనన్, రుక్సర్ థిల్లాన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ ప్రమోషన్లను ఇప్పుడిప్పుడే షురూ చేస్తోంది. ఫస్ట్ లుక్, టైటిల్ గ్లింప్స్, టీజర్ విడుదలై.. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.

ఒక్కొక్కరి పాత్రను పరిచయం చేస్తూ వీడియోను విడుదల చేస్తున్నారు. నరేష్, రుక్సర్ థిల్లాన్ ఇంట్రో గ్లింప్స్, పాటలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. పక్కా పల్లెటూరి వాతావరణాన్ని ప్రజెంట్ చేస్తూ వస్తున్న ఈ మూవీ..సంక్రాంతికి బరిలోకి దిగుతుంది. ఇక నా సామి రంగ ట్రైలర్ ను జనవరి 9న విడుదల చేసేందుకు ప్లాన్ చేశారట చిత్ర యూనిట్. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై తెరకెక్కిస్తున్న ఈ మూవీకి శ్రీనివాస చిట్టూరి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ కంపోజర్ ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. పవన్ కుమార్ సమర్పణలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ప్రసన్నకుమార్ బెజవాడ కథ అందిస్తున్నారు.

నా సామి రంగ ఓటీటీ, శాటిలైట్ పార్ట్ నర్ కన్ఫమ్ అయిపోయాయి. ఈ మూవీని హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ కొనుగోలు చేసింది. ఇక శాటిలైట్ విషయానికి వస్తే.. స్టార్ మాలో ప్రసారం కానుంది. అయితే ఈ మూవీ ఓటీటీలో ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుందో తేదీలు వెల్లడి కాలేదు. సినిమా విడుదలయ్యాక దాని ఫలితాన్ని బట్టి.. నిర్ణయం తీసుకునే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెలలో ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. ఇండస్ట్రీలో మల్టీ స్టారర్ల హవా నడుస్తోంది. ఈ మూవీలో  కూడా నాగార్జునతో అల్లరి నరేష్, రాజ్ తరుణ్ స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. ఓ పండుగ లాంటి మూవీన ఈ పెద్ద పండుగకు కనువిందు చేసేందుకు వస్తుంది. ఆయ్.. ఇంకెందుకు ఆలస్యం సినిమాను చూసి ఎలా ఉందో.. కామెంట్లో చెప్పండే..

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి