iDreamPost

మరో యువతితో ప్రియుడు.. ఆ బాధ తట్టుకోలేక..

మరో యువతితో ప్రియుడు.. ఆ బాధ తట్టుకోలేక..

ఈ మధ్యకాలంలో ప్రేమ పేరుతో మోసాలు బాగా పెరిగిపోయాయి. ఆడ, మగ అన్న తేడా లేకుండా కొంతమంది వ్యక్తులు దారుణంగా ప్రవర్తిస్తున్నారు. ఒకరితో ప్రేమలో ఉండగానే.. మరొకరిని కూడా లైన్‌లో పెడుతున్నారు. తాజా ఘటనలో ఓ యువకుడు ప్రాణంగా ప్రేమించిన యువతిని దారుణంగా మోసం చేశాడు. ఆమెతో ప్రేమ నటిస్తూనే మరో యువతితో తిరుగుతూ ఉన్నాడు. ఈ విషయం తెలుసుకున్న మొదటి ప్రేయసి ప్రాణాలు తీసుకుంది. సూసైడ్‌ లెటర్‌ రాసి, విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మైసూర్‌ జిల్లాలోని కేఆర్‌ నగరకు చెందిన నిసర్గ అనే యువతి అక్కడి ఓ కాలేజీలో బీకాం ఫైనల్‌ ఇయర్‌ చదువుతోంది. ఈమెకు అదే ప్రాంతానికి చెందిన సుహాస్‌ రెడ్డితో కొద్ది నెలల క్రితం పరిచయం అయింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. గత కొన్ని నెలల నుంచి ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే నిసర్గకు ఓ షాకింగ్‌ విషయం తెలిసింది. సుహాస్‌ తనతో పాటు వేరే యువతితో కూడా తిరుగుతూ ఉన్నాడని తెలుసుకుంది. దీంతో ఆమె మనసు ముక్కలైంది. ప్రియుడు తనను మోసం చేయటం తట్టుకోలేకపోయింది. తన చెయ్యి కోసుకుని ఆ ఫొటోలను తన సోషల్‌ మీడియా ఖాతాల్లో షేర్‌ చేసింది.

ఇవి చూసిన సుహాస్‌.. నిసర్గను బాగా తిట్డాడు. చావమని కూడా అ‍న్నాడు. దీంతో నిసర్గ మరింత బాధకు గురైంది. తనకు చావటం కంటే మరో మార్గం లేదని భావించింది. తన చావుకు కారణం తన ప్రియుడే అంటూ ఓ సూసైడ్‌ నోట్‌ రాసింది. తర్వాత విషం తాగింది. ఇది గమనించిన కుటుంబసభ్యులు ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిసర్గ చనిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సుహాస్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరి, ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి