iDreamPost

ఇండస్ట్రీలో విషాదం.. సంగీత దిగ్గజం కన్నుమూత

తన గానంతో కోట్ల మంది హృదయాలను దోచుకున్న ప్రముఖ గాయకుడు ఇకలేడన్న వార్త బాలీవుడ్ ని తీవ్ర విషాదంలో నెట్టింది.

తన గానంతో కోట్ల మంది హృదయాలను దోచుకున్న ప్రముఖ గాయకుడు ఇకలేడన్న వార్త బాలీవుడ్ ని తీవ్ర విషాదంలో నెట్టింది.

ఇండస్ట్రీలో విషాదం.. సంగీత దిగ్గజం కన్నుమూత

ఇటీవల సినీ ఇండస్ట్రీలో తరుచూ సెలబ్రెటీల మరణ వార్తలు తీవ్ర విషాదాన్ని నింపుతున్నాయి. నటీనటులు, సంగీత దర్శకులు, నేపథ్య గాయకులు, దర్శక, నిర్మాతలు ఇతర రంగాలకు చెందిన వారు హఠాత్తుగా కన్నుమూసి వార్త తెలియగానే వారిని ఎంతగానో అభిమానించే అభిమానులు దుఖఃసాగరంలో మునిగిపోతున్నారు. రోడ్డు ప్రమాదాలు, అనారోగ్య సమస్యలు, హార్ట్ ఎటాక్, వయోభారంతో కొంతమంది చనిపోతే.. ఇండస్ట్రీలో తమ కెరీర్ సరిగా లేకపోవడంతో ఆర్ధికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొని డిప్రేషన్ లోకి వెళ్లి చనిపోతున్న వారు కొంతమంది ఉన్నారు. తాజాగా బాలీవుడ్ లో ప్రముక గాయకుడు, పద్మశ్రీ విజేత కన్నుమూశారు. వివరాల్లోకి వెళితే..

సంగీత దిగ్గజం, పద్మశ్రీ విజేత, గజల్ గాయకుడు పంకజ్ ఉధాస్ (72) ఫిబ్రవరి 26, సోమవారం తుది శ్వాస విడిచారు. చిట్టి అయి హై, చండీ జై రంగ్ వంటి గజల్స్‌తో కోట్ల మంది ప్రజల మనసు దోచారు పంకజ్ ఉధాస్. ఈ విషయాన్ని ఆయన కూతురు నయాబ్ ఉధాస్ ఇన్‌స్టాగ్రామ్‌లోకి తెలిపారు. ‘కొంతకాలంగా దీర్ఘకాలిక అనారోగ్యంతో పద్మశ్రీ పంకజ్ ఉధాస్ తుది శ్వాస విడిచారని తెలియజేయడానికి చింతిస్తున్నాం’ అంటూ పోస్ట్ పెట్టారు. ఈ వార్త తెలిసిన సినీ ప్రముఖులు, నెటిజన్లు ఇండస్ట్రీ ఓ గొప్ప గాయకుడిని కోల్పోయామని సోషల్ మీడియా ద్వారా పంకజ్ ఉధాస్ మృతికి సంతాపం తెలియజేస్తున్నారు.

పంకజ్ ఉధాస్ కెరీర్ విషయానికి వస్తే.. 1951, మే 17న సావర్‌కుండ్ల, గుజరాత్ లో జన్మించారు. 1980 లో ఆహత్ అనే గజల్ ఆల్బామ్ తో కెరీర్ ప్రారంభించారు. అలా వరుసగా ముకరర్, తర్రన్నమ్, మెహ్ ఫిల్, నయాబ్ వంటి గజల్ ఆల్బామ్స్ తో మంచరి పేరు సంపాదించారు. 2006 లో ఆయన సేవలకు గుర్తింపుగా భారత దేశపు అత్యున్నత పౌర పురస్కారమైన పద్మశ్రీ అందించారు. గజల్స్ ను ప్రపంచ వ్యాప్తంగా పాపులరైజ్ చేసినందుకు గాను న్యూయార్క్ లోని బాలీవుడ్ మ్యూజిక్ అవార్డ్స్ లో స్పెషల్ అచీవ్ మెంట్ అవార్డు గెల్చుకున్నారు. తన కెరీర్ లో ఎన్నో అవార్డులు, రివార్డులు గెల్చుకున్నారు సంగీత దిగ్గజం పంకజ్ ఉధాస్. బాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ ఉన్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Nayaab Udhas (@nayaabudhas)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి