iDreamPost

Konda movie కొండా రిపోర్ట్

Konda movie కొండా రిపోర్ట్

రేపు చాలా సినిమాలు విడుదలవుతున్న నేపథ్యంలో శుక్రవారం సాంప్రదాయానికి భిన్నంగా ఒక రోజు ముందే వచ్చిన సినిమా కొండా. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో త్రిగున్(మునుపటి పేరు అదిత్ అరుణ్)హీరోగా ప్రముఖ రాజకీయనేత కొండా మురళి జీవిత కథ ఆధారంగా దీన్ని రూపొందించారు. గత పది పదిహేను రోజులుగా ప్రమోషన్లు గట్టిగానే చేసుకుంటూ వచ్చారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా జరిగింది. ఒకప్పటి వర్మ టేకింగ్ ఇప్పుడు కనిపించడం లేదన్న కామెంట్ల నేపథ్యంలో కొండా మీద కూడా పెద్దగా అంచనాలేం లేవు. అందులోనూ ఓపెనింగ్స్ చాలా డల్ గా స్లోగా ఉన్నాయి. ఇంత తక్కువ బజ్ తో వచ్చిన ఈ మూవీ ఎలా ఉందో రిపోర్ట్ లో చూద్దాం

తెలంగాణకు చెందిన కొండా(త్రిగున్)ఆణువణువూ ఆవేశం అభ్యుదయం నింపుకున్న యువకుడు. తన చుట్టూ ఉన్న వాళ్లలో చైతన్యం రప్పించేందుకు ప్రయత్నిస్తూ ఉంటాడు. ఈ క్రమంలో నక్సల్ ఉద్యమం వైపు ఆకర్షితుడై అందులో పాలు పంచుకుంటాడు. కొండా దూకుడు తెగింపు చూసిన సుధాకర్(పృథ్వి)అతన్ని తన పార్టీలోకి చేర్చుకుంటాడు. తీరా చూస్తే తనో పావులా మారానని గుర్తించిన వెంటనే కొండా అతనితో దూరంగా ఉండటం మొదలుపెడతాడు. దీంతో హత్యాప్రయత్నాలు మొదలవుతాయి. మరి కొండా ఈ పద్మవ్యూహం నుంచి ఎలా బయటపడ్డాడు, రాజకీయ ప్రస్థానం వైపు ఎలా అడుగులు వేశాడనేదే కథలోని మెయిన్ పాయింట్.

ఇది వర్మ టిపికల్ స్టైల్ లో సాగే రెగ్యులర్ డ్రామానే. ఎలాంటి ప్రత్యేకత కనిపించదు. బడ్జెట్ పరిమితుల వల్ల కొందరు ఆర్టిస్టులు మినహా మిగిలిన సెలక్షన్, ప్రొడక్షన్ వేల్యూస్ తక్కువగా అనిపిస్తాయి. గతంలో ఇదే తరహా మేకింగ్ లో వంగవీటిలో చూడటం వల్ల ఇందులో చెప్పుకోవడానికి ఏమి మిగల్లేదు. సినిమాని కొండా మురళి వెర్షన్ లోనే చెప్పాల్సి రావడంతో ఆయన వ్యక్తిత్వంలో తప్పొప్పులని సమానంగా చూపించే రిస్క్ తీసుకోలేదు. త్రిగున్, ఇర్రా మోర్ లు పెర్ఫార్మన్స్ పరంగా పర్వాలేదనిపించారు. నెరేషన్ తో సహా అన్ని విభాగాలు తేలిపోయాయి. పబ్లిసిటీ చేసినంత ఘనంగా కొండాలో థియేటర్ మ్యాటర్ అయితే లేదన్నది వాస్తవం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి