iDreamPost

రచయిత్రిపై అత్యాచారం.. పోలీసులకు చెబితే అంతు చూస్తానంటూ దావూద్ పేరుతో బెదిరింపు

రచయిత్రిపై అత్యాచారం.. పోలీసులకు చెబితే అంతు చూస్తానంటూ దావూద్ పేరుతో బెదిరింపు

ఒక రచయిత్రిపై వృద్ధవ్యాపారి అత్యాచారం చేసిన ఘటన ఆర్థిక రాజధాని ముంబైలో వెలుగుచూసింది. బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు అతనిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. “75 ఏళ్ల వ్యాపారి జుహూలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో 35 ఏళ్ల రచయిత్రిపై అత్యాచారం చేశాడు. మహిళ ఫిర్యాదు ఆధారంగా నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశాం. తదుపరి విచారణ కొనసాగుతోంది.” అని పోలీసులు తెలిపారు. మహిళా రచయితపై అత్యాచారం చేయడమే కాకుండా.. ఈ ఘటన గురించి పోలీసులకు ఫిర్యాదు చేస్తే నీ అంతు చూస్తానంటూ.. అండర్ వరల్డ్ మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం పేరుతో ఆ వ్యాపారి బెదిరించినట్లు పోలీసులు తెలిపారు.

తనకు జరిగిన అన్యాయంపై బాధితురాలు అంబోలీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులకు ఫిర్యాదు చేస్తే అంతుచూస్తామంటూ తనకు డీ గ్యాంగ్ నుంచి కాల్ వచ్చినట్లు మహిళ చెప్పడం ఆశ్చర్యానికి గురిచేసింది. మహిళల ఫిర్యాదులను ప్రత్యేకంగా విచారించే ఎంఐడీసీ స్టేషన్ కు ఈ కేసును బదిలీ చేశారు. మహిళ చేసిన ఫిర్యాదులో నిజమెంతన్నది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. నిజంగానే ఆమెకు డీ గ్యాంగ్ నుంచి ఫోన్ వచ్చిందా ? లేక ఎవరైనా కావాలనే ఇలా ఫోన్ కాల్ చేశారా ? అన్నది తెలియాల్సి ఉంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి