iDreamPost

పవన్ సిగ్గు తీస్తూ.. ముద్రగడ ఘాటు లేఖ! కడిగి పారేశాడు!

Mudragada Padmanabham: టీడీపీ జనసేన పొత్తులో భాగంగా పవన్ కల్యాణ్ 24 అసెంబ్లీ సీట్లను తీసుకోవడంపై ఆయన పార్టీ కార్యకర్తలతో పాటు కాపు ఉద్యమనేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దీంతో పవన్ కి ఘాటుగా లేఖలు రాస్తూ తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. తాజాగా పవన్ కల్యాణ్ పరువు తీస్తూ.. ముద్రగడ ఘాటు లేఖ రాశారు.

Mudragada Padmanabham: టీడీపీ జనసేన పొత్తులో భాగంగా పవన్ కల్యాణ్ 24 అసెంబ్లీ సీట్లను తీసుకోవడంపై ఆయన పార్టీ కార్యకర్తలతో పాటు కాపు ఉద్యమనేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దీంతో పవన్ కి ఘాటుగా లేఖలు రాస్తూ తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. తాజాగా పవన్ కల్యాణ్ పరువు తీస్తూ.. ముద్రగడ ఘాటు లేఖ రాశారు.

పవన్ సిగ్గు తీస్తూ.. ముద్రగడ ఘాటు లేఖ! కడిగి పారేశాడు!

ఆంధ్రప్రదేశ్ లో మరికొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అన్ని ప్రధాన పార్టీలు అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే అధికార వైఎస్సాస్ సీపీ దాదాపు పూర్తి స్థాయిలో అభ్యర్థులను ప్రకటించింది. మరోవైపు టీడీపీ,జనసేన ఇటీవల 118 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. ఈ ఎన్నికల్లో జనసేన కేవలం 24 అసెంబ్లీ స్థానాల్లో మాత్రమే పోటీ చేస్తున్నారు. ఇది జనసేన కార్యకర్తలతో పాటు కాపు నేతలను తీవ్ర అసంతృప్తికి గురి చేసింది. ఇప్పటికే ఈ సీట్ల పంపకం కాపు సంక్షేమ అధ్యక్షుడు చేగొండి హరిరామజోగయ్య జనసేన అధినేత పవన్ కల్యాణ్ కి  లేఖ బహిరంగా లేఖ రాశారు. తాజాగా ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కూడా పవన్ కి ఘాటు లేఖ రాశారు. పలు రకాల అంశాలను ప్రస్తావిస్తూ. పవన సిగ్గు తీస్తూ ముద్రగడ సంచలన కామెంట్స్ చేశారు. మీ నిర్ణయాలు మీ చేతుల్లో లేవు అంటూ ఎద్దేవా చేశారు.

2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పొత్తులో భాగంగా జనసేన కేవలం 24 అసెంబ్లీ సీట్లలో మాత్రమే పోటీ చేస్తుంది. అయితే పొత్తు ప్రకటించిన ప్రారంభంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పిన మాటలకు, తాజాగా పోటీ చేస్తున్న సీట్లకు పొంతన లేకుండా పోయింది. ఎవరికీ ఊడిగం చేయడానికి మనం లేమని, గౌరవప్రదమైన విధంగానే పొత్తులో ముందుకెళ్తామని గతంలో పవన్ తెలిపారు. తమ ఆత్మగౌరవానికి ఏ మాత్రం భంగం కలిగిన ఊరుకోమని పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చారు.

పవన్ కల్యాణ్ చేసిన ఉపన్యాసలతో జనసేన నేతలు,కార్యకర్తలు, అలానే కాపు నేతలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే మాజీ ఎంపీ, చేగొండి హరిరామజోగయ్య కూడా పవన్ కు అనేక సార్లు బహిరంగ లేఖలు రాశారు. దాదాపు 40 నుంచి 50 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయలంటూ, ఏ స్థానాల్లో పోటీ చేయాల్లో కూడా వివరిస్తూ రామజోగయ్య పవన్ కల్యాణ్ కి లేఖలు రాశారు. జనసేన ఎక్కువ స్థానాల్లో పోటీ చేస్తుందని హరిరామజోగయ్యతో సహా అందరు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే ఆశలు అడియాశలు చేస్తూ కేవలం 24 స్థానాల్లో మాత్రమే పోటీ చేస్తున్నట్లు పవన్ ప్రకటించారు.

దీంతో జనసేన శ్రేణులతో సహా అందరూ పవన్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవలే హరిరామజోగయ్య తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ లేఖ రాశారు. తాజాగా ముద్రగడ పద్మనాభం ఘాటుగా పవన్ కల్యాణ్ కి లేఖ రాశారు. ఈ లేఖలో ముద్రగడ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘రెండు పర్యాయాలు కిర్లంపూడి వస్తానని మీరు నాకు కబురు పంపారు. మీతో ఉన్న విబేధాలను పక్కన పెట్టి, ఎలాంటి కోరికలు లేకుండా మీతో కలుస్తానని చెప్పడం జరిగింది. అన్ని వర్గాలకు న్యాయం చేయాలని ఆశించి మీతో కలిసి సేవ చేయాలని భావించాను. కానీ మీరు నన్ను కలవడానికి మీకు ఎన్నో చోట్ల  పర్మిషన్లు తీసుకోవాలి. మీ నిర్ణయాలు మీ చేతుల్లో లేవు. పవర్ షేరింగ్ అనేది లేదని అర్ధమైంది” అంటూ పవన్ పై ముద్రగడ సెటైర్లు వేశారు.

ఇంకా ముద్రగడ లేఖలో మరికొన్ని అంశాలను ప్రస్తావించారు. ” మీరు పోటీ చేస్తున్న 24 సీట్ల కోసం నా అవసరం రాదని భావిస్తున్నాను. అలానే నా అవసరం రాకూదనే దేవుడిని కోరుకుంటున్నాను. నేను మీలా  గ్లామర్ ఉన్నవాన్ని కాకపోచ్చు. ప్రజల్లో పరపతి లేకపోవడం వల్ల మీ దృష్టిలో లాస్ట్ గ్రేడ్ వ్యక్తిగా ఉన్నాను. నన్ను మీరు తుప్పు పట్టిన ఇనుములా గుర్తించారు. నా 40 ఏళ్ల​ రాజకీయ జీవితంలో డబ్బు కోరడం, పదవులు కోసం పెద్ద నాయకుల ఇళ్ల వద్ద పడిగాపులు కాయడం చేయలేదు’ అంటూ ముద్రగడ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. మరి..పవన్ కల్యాణ్ కి ముద్రగడ పద్మనాభం లేఖలో ప్రస్తావించిన అంశాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి