iDreamPost

APలో ఉన్న క్రీడా సౌకర్యాలపై BCCI మాజీ సెలక్టర్ MSK ప్రసాద్ ప్రశంసలు!

APలో ఉన్న క్రీడా సౌకర్యాలపై BCCI మాజీ సెలక్టర్ MSK ప్రసాద్ ప్రశంసలు!

క్రీడల్లో ఏపీ స్వర్ణాంధ్రప్రదేశ్ అంటూ బీసీసీఐ మాజీ చీఫ్ సెలక్టర్ ఎంఎస్కే ప్రసాద్ ప్రశంసలు కురిపించారు. ఇటీవల ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎంఎస్కే ఏపీని పొగడ్తలతో ముంచెత్తడమే కాకుండా.. పలు కీలక వ్యాఖ్యలు చేశారు. “క్రీడల్లో ఏపీ స్వర్ణాంధ్రప్రదేశ్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. పైగా అలా చెప్పడం గర్వంగా కూడా ఉంది. క్రికెట్ లో అయితే కేఎస్ భరత్ లాంటి యంగ్ వికెట్ కీపర్ బ్యాటర్ టీమిండియాలో తన స్థానాన్ని సుస్థిరం చేసకునే పనిలో ఉన్నాడు.

బ్యాడ్మింటన్ లో పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్, టేబుల్ టెన్నిస్ లో ఆకుల శ్రీజ వంటి ప్లేయర్స్ రాష్ట్రం తరఫున అద్భుతాలు సృష్టిస్తున్నారు. అంతేకాకుండా ఇంటర్నేషనల్ లెవల్లో ఏపీ పేరుని మారు మ్రోగిస్తున్నారు. క్రీడల్లో ఏపీ దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉంది” అంటూ ఎమ్మెస్కే ప్రసాద్ చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ కి ఐపీఎల్ టీమ్ ఎందుకు లేదు అనే ప్రశ్న అడగ్గా.. “ఐపీఎల్ జట్టు అనేది ఫ్రాంచైజీ నుంచి ఉంటుంది కానీ.. ప్రాంతం నుంచి కాదు. సౌత్ లో చెన్నైకి సీఎస్కే, కర్ణాటకకు ఆర్సీబీ జట్లు ఉన్నాయి. ఈశాన్య రాష్ట్రాలకు కోల్ కతా మాత్రమే ఉంది.

రెండు కొత్త జట్లు ప్రవేశపెట్టినప్పుడు ఏపీ తరఫున ప్రముఖ వ్యాపారవేత్త శరత్ చంద్రారెడ్డి కూడా రూ.3,500 కోట్లకు బిడ్ వేశారు. కానీ, ఎక్కువ కోట్ చేసినవారికి జట్లు వెళ్లాయి. ఇది పక్కా కమర్షియల్ టోర్నమెంట్. దేశం తరఫున మ్యాచ్ కు ఒక్క రూపాయి ఇస్తే.. ఈ లీగ్స్ లో వంద రూపాయాలు వస్తాయి. అందుకే ఆటగాళ్లు కమర్షియల్ లీగ్స్ లో ఆడేందుకే ఇష్ట పడతారు. ఏపీకి ఐపీఎల్ టీమ్ లేకపోవడమే మంచిది. మరోవైపు ఈ కమర్షియల్ లీగ్స్ నిర్వహణ వల్ల బీసీసీఐకే నష్టం వాటిల్లుతుంది” అంటూ ఎమ్మెస్కే ప్రసాద్ తన అభిప్రాయాలను పంచుకున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి