iDreamPost

చెన్నై సూపర్ కింగ్స్ తదుపరి కెప్టెన్ ఎవరో చెప్పేసిన అంబటి రాయుడు!

  • Author singhj Published - 04:38 PM, Tue - 25 July 23
  • Author singhj Published - 04:38 PM, Tue - 25 July 23
చెన్నై సూపర్ కింగ్స్ తదుపరి కెప్టెన్ ఎవరో చెప్పేసిన అంబటి రాయుడు!

క్రికెట్​లో ఇండియన్ ప్రీమియర్ లీగ్​ సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్నీ కాదు. టీ20 క్రికెట్​కు ఇంతగా క్రేజ్ పెరగడానికి కారణం ఐపీఎల్ అని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ లీగ్ నిర్వహణతో అటు బీసీసీఐ ఖజానా నిండటమే గాక ఇటు ఆటగాళ్ల పైనా కాసుల వర్షం కురిసింది. భారత క్రికెట్ బోర్డుకు వచ్చే ఆదాయంలో మెజారిటీ పర్సెంటేజ్ ఈ లీగ్​ నుంచే వస్తోందని తెలుస్తోంది. అలాంటి ఈ లీగ్​లో బాగా క్రేజ్ ఉన్న జట్లలో ఒకటి చెన్నై సూపర్ కింగ్స్. ఐపీఎల్​ కప్​ను ఐదు సార్లు చేతపట్టిన సీఎస్​కేకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. దానికి గల కారణాల్లో ఒకటి మహేంద్ర సింగ్ ధోని సారథ్యం.

చెన్నై కప్స్ గెలవడంలోనూ, ఫ్యాన్ ఫాలోయింగ్​ను పెంచుకోవడంలోనూ ధోని పాత్ర ఎంతగానో ఉంది. జట్టులో పెద్దగా స్టార్ ప్లేయర్లు లేకపోయినా సీనియర్లు, జూనియర్లను కలుపుకొని టీమ్​ను ముందుకు తీసుకెళ్తున్నాడు ధోని. ఈ ఏడాది ఐపీఎల్ ట్రోఫీని సీఎస్​కే చేజిక్కించుకోవడంలో అతడు కీలకంగా వ్యవహరించాడు. అయితే మోకాలి గాయంతో బాధపడుతున్న ధోనీకి.. వయసు కూడా ఒక సమస్యగా మారింది. అతడు ఇంకెంత కాలం ఆడతాడో స్పష్టంగా చెప్పలేని పరిస్థితి. గాయానికి సర్జరీ చేయించుకున్న ధోని ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్నాడు. వచ్చే ఐపీఎల్​లో ధోని ఆడతాడో లేదో కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. దీంతో చెన్నై తదుపరి కెప్టెన్ ఎవరనేది చర్చనీయాంశంగా మారింది.

సీఎస్​కే కెప్టెన్సీ అంశంపై ఆ టీమ్ మాజీ బ్యాటర్ అంబటి రాయుడు జోస్యం చెప్పాడు. చెన్నై నెక్స్ట్ కెప్టెన్​ రుతురాజ్ గైక్వాడ్ అవుతాడని రాయుడు అన్నాడు. గైక్వాడ్ అద్భుతమైన ఆటగాడని.. అతడిలో గొప్ప నాయకత్వ లక్షణాలు ఉన్నాయని రాయుడు పేర్కొన్నాడు. ధోని మరో సీజన్ ఆడే ఛాన్స్ ఉందని.. కాబట్టి భవిష్యత్తులో రుతురాజ్​ కచ్చితంగా చెన్నై సారథి అవుతాడని చెప్పుకొచ్చాడు. రాబోయే 7 నుంచి 8 ఏళ్ల పాటు సీఎస్​కేకు కెప్టెన్​గా రుతురాజ్ ఉండే అవకాశం ఉందని.. అతడు ఇప్పటికే ధోని, హెడ్​ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ నేతృత్వంలో రాటుదేలాడని రాయుడు వివరించాడు. మరి.. చెన్నై నెక్స్ట్ కెప్టెన్ రుతురాజ్ అంటూ రాయుడు చేసిన వ్యాఖ్యలపై మీరు ఏమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి