iDreamPost

సుజనాను అడ్డుకున్న ఢిల్లీ ఎయిర్‌పోర్టు అధికారులు

సుజనాను అడ్డుకున్న ఢిల్లీ ఎయిర్‌పోర్టు అధికారులు

రాజ్యసభ సభ్యుడు, బీజేపీ నేత సుజనా చౌదరికి ఢిల్లీ ఎయిర్‌పోర్టులో చెదు అనుభవం ఎదురైంది. అమెరికా వెళ్లేందుకు సిద్ధమైన సుజనా చౌదరిని ఎయిర్‌పోర్టు అధికారులు అడ్డుకున్నారు. బ్యాంకులను మోసం చేసిన కేసులో ఆయనపై లుక్‌ అవుట్‌ నోటీసులు ఉన్న నేపథ్యంలో అమెరికా వెళ్లేందుకు ఢిల్లీ ఎయిర్‌పోర్టు ఇమ్మిగ్రేషన్‌ అధికారులు అనుమతించలేదు. సుజనాను ఎయిర్‌ పోర్టు నుంచి వెనక్కి పంపేశారు. దేశం విడిచి వెళ్లేందుకు అనుమతి లేదని స్పష్టం చేశారు. విదేశాలకు వెళ్లే ప్రయత్నాలు చేయవద్దని సుజనాకు సూచించారు.

ఊహించని పరిణామంతో ఖంగుతిన్న సుజనా చౌదరి కోర్టుకు ఎక్కారు. అమెరికా వెళ్లనీయకుండా తనను ఢిల్లీ ఎయిర్‌పోర్టు «అధికారులు అక్రమంగా అడ్డుకున్నారంటూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఉద్దేశపూర్వకంగానే వారు ఇలా ప్రవర్తిచారని సుజనా చౌదరి తన పిటిషన్‌లో ఆరోపించారు.

పారిశ్రామికవేత్త అయిన సుజనా చౌదరికి పలు వ్యాపారాలు ఉన్నాయి. పారిశ్రామికవేత్తలు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవడం సర్వసాధారణం. అందరిలాగే సుజనా చౌదరి కూడా వివిధ బ్యాంకుల నుంచి దాదాపు ఆరు వేల కోట్ల రూపాయలు తీసుకున్నారు. ఈ మొత్తం చెల్లించకుండా బ్యాంకులను మోసం చేశానే అభియోగాలు ఆయన టీడీపీలో ఉన్నప్పుడే వచ్చాయి. బ్యాంకుల ఫిర్యాదు మేరకు సీబీఐ కేసులు కూడా నమోదు చేసింది.

సుజనా చౌదిరి 2019 ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీలో చేరారు. అంతకు ముందు ఆయన ప్రస్తానం అంతా టీడీపీలోనే సాగింది. టీడీపీ తరఫున వరుసగా రెండు సార్లు రాజ్యసభ సభ్యునిగా ఎంపికయ్యారు. ప్రస్తుతం ఆయన బీజేపీలో ఉన్నా.. రాజ్యసభ పదవి మాత్రం టీడీపీలో ఉండగా వచ్చిందే.

పారిశ్రామిక వేత్త అయిన సుజనా చౌదరి టీడీపీకి ఆర్థికంగా అండగా ఉండేవారని చెబుతుంటారు. ముఖ్యంగా టీడీపీ ప్రతిపక్షంలో ఉన్న పదేళ్లు పార్టీ ఖర్చులు సుజనా చౌదరి భరించారనే టాక్‌ రాజకీయ వర్గాల్లో ఉంది. అందుకే ఆయనకు రాజ్యసభ సభ్యునిగా చంద్రబాబు అవకాశం ఇచ్చారని చెప్పుకుంటుంటారు.

సుజనాను అమెరికా వెళ్లకుండా అడ్డుకున్నారనే విషయం.. ఆయన తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ వేయడంతో వెలుగులోకి వచ్చింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి