iDreamPost

వీడియో: డీన్​తో ఆస్పత్రి మరుగుదొడ్లు శుభ్రం చేయించిన ఎంపీ.. ఎందుకంటే?

వీడియో: డీన్​తో ఆస్పత్రి మరుగుదొడ్లు శుభ్రం చేయించిన ఎంపీ.. ఎందుకంటే?

దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ప్రభుత్వ ఆస్పత్రుల్లో జరుగుతున్న దారుణాలపై ప్రజలు ఎన్ని విమర్శలు చేస్తున్నా ఇప్పటికీ తీరు మార్చుకోవడం లేదు. ఓ వైపు ప్రైవేట్ ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రులను తీర్చి దిద్దుతున్నామని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తుంటారు నేతలు. కానీ ఆస్పత్రుల్లో వీల్ చైర్ నుంచి అంబులెన్స్ వరకు రోగులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి.

మహారాష్ట్ర, నాందేడ్ లో ప్రభుత్వ ఆస్పత్రిలో రెండు రోజుల వ్యవధిలో 31 మంది మరణించిన విషయం తీవ్ర కలకలం రేపుతుంది. మహారాష్ట్రలో మరణ మృదంగం అంటూ ఆస్పత్రిలో మరణాలకు సంబంధించిన జాతీయస్థాయి లో వార్తలు రావడంతో శివసేన ఎంపీ హేమంత్ పాటిల్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ క్రమంలోనే మంగళవారం శంకర్ వావ్ చవాన్ ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించారు. అక్కడ మరుగుదొడ్లు దారుణమైన పరిస్థితితో కనిపించడంతో ఫైర్ అయిన ఎంపీ పక్కనే ఉన్న హాస్పిటల్ డీన్ శ్యామ్ రావ్ వాకోడ్ కు వాటిని శుభ్రం చేయాలని ఆదేశించారు.

ఎంపీ చెప్పడంతో వెంటనే హాస్పిటల్ డీన్ టాయి‌లెట్ ను శుభ్రం చేస్తుండగా ఎంపీ అక్కడే ఉండి పైప్ తో నీళ్లు పట్టారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని స్వచ్ఛభారత్ లాంటి కార్యక్రమాలు జరుగుతున్నా.. అధికారులకు నిర్లక్ష్య వైఖరి వల్లే ఇలాంటి పరిస్థితులు నెలకొంటున్నాయని ఎంపీ అసహనం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే మహారాష్ట్ర, నాందేడ్ లో కేవలం 24 గంటల్లోనే 24 మరణాలు సంభవించాయి. మంగళవారం అవి 31కి చేరాయి. మరో 75మంది రోగుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. అయితే వైద్యపరమైన నిర్లక్ష్యం అనడం సమంజసం కాదని డీన్ శ్యామ్ రావు అంటున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్​గా మారింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి