iDreamPost

CM జగన్‌ని కలిసిన విజయవాడ ఎంపీ కేశినేని నాని!

ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తరచూ వినిపిస్తోన్నపేరు విజయవాడ కేశినేని నాని. ఆయన టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బుధవారం ఏపీ సీఎం జగన్ ను కేశినేని నాని కలిశారు.

ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తరచూ వినిపిస్తోన్నపేరు విజయవాడ కేశినేని నాని. ఆయన టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బుధవారం ఏపీ సీఎం జగన్ ను కేశినేని నాని కలిశారు.

CM జగన్‌ని కలిసిన విజయవాడ ఎంపీ కేశినేని నాని!

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు చాలా హాట్ హాట్ గా ఉన్నాయి. మరికొద్ది నెలల్లో ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల జరగనున్న నేపథ్యంలో ఎన్నో ఆసక్తికరమైన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా విజయవాడ ఎంపీ కేశినేని నానికి సంబంధించి అనేక వార్తలు వచ్చాయి. ఆయన టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఆయన పయనం ఎటువైపు అనే అంశంపై అందరిలో ఆసక్తికి నెలకొంది. ఈ నేపథ్యంలోనే విజయవాడ ఎంపీ కేశినేని నాని..ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. బుధవారం సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ ను ఎంపీ కేశినేని నాని కలిశారు.

బుధవారం సీఎం క్యాంప్ ఆఫీస్ లో సీఎం జగన్ మోహన్ రెడ్డిని కేశినేని నాని కలిశారు.  అనంతరం  నాని మీడియాతో మాట్లాడుతూ .. “టీడీపీ కోసం నేను చాలా కష్టపడ్డాను. నేను టీడీపీ పార్టీ కోసం ఆస్తుల అమ్ముకున్నా, వ్యాపారాలు వదుకులుకున్నాను. నేను అమ్ముకున్న ఆస్తులు విలువ రూ.2 వేల కోట్లు. బాబు పాదయాత్ర, స్థానిక సంస్థల ఎన్నికలను నా భుజంపై మోశాను. పార్టీ కోసం, ప్రజల కోసం నిజాయితీగా కష్టపడ్డాను. 2013 నుంచి 2016 వరకు టీడీపీ కోసం ఎంతో కష్టపడ్డాను. టీడీపీ కోసం సమయం, డబ్బు వృథా చేసుకోవద్దని చాలా మందే చెప్పారు.  అయినా పార్టీ కోసం ఎంతో కష్టపడి పని చేశాను. అయితే వాళ్లు పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడితో ప్రెస్ మీట్ పెట్టించి నన్ను తిట్టించారు.

అంతేకాక నన్ను గొట్టంగాడు అన్నా భరించాను. నన్ను చెప్పు తీసుకుని కొడతానని ఓ క్యారెక్టర్ లెస్ వ్యక్తి తిట్టిన పార్టీ స్పందించలేదు. నన్ను చాలా రకాలుగా అవమానించారు. నన్ను ఎవరు ఎన్ని మాటలన్నా పార్టీ నుంచి కనీసం మద్దతు రాలేదు. నేను ఏం తప్పు చేశాను. నేను చేసిన తప్పు ఒక్కటి చూపించడి. చంద్రబాబు జైల్లో ఉంటే వాళ్ల కుటుంబానికి అండగా ఉన్నాను. ఇవ్వని చూస్తే.. చంద్రబాబు మోసగాడని అందరికి తెలుసు కానీ.. ఇలా కుటుంబాల మధ్య  చిచ్చు పెట్టిన పచ్చి మోసగాడు. విజయవాడకు సీఎం జగన్ నిధులు కేటాయించారు.

నేను అడిగిన ప్రతిసారి సీఎం జగన్ నిధులను కేటాయించడమే కాకుండా..నేను చెప్పిన సమస్యలపై సానుకూలంగా స్పందించారు. ఆయన పథకాలు నన్ను చాలా ఆకర్షించాయి. ఆయన ప్రవేశ పెట్టిన పథకాలను చూశాను. ఒక్కసారి నా ఎంపీ పదవికి రాజీనామా ఆమోదం వచ్చిన వెంటనే వైసీపీలో చేరుతాను. విజయవాడ పార్లమెంట్ పరిధిలో 60 శాతం టీడీపీని ఖాళీ చేస్తాను” అంటూ కేశినేని నాని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక కేశినేని నాని సీఎం జగన్ తో భేటీ అయిన సందర్భంలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, విజయవాడ వెస్ట్ వైసీపీ నేత దేవినేని అవినాశ్ లు కూడా ఉన్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి