iDreamPost

Saindhav: మహేష్ సినిమాకు ఎక్కువ థియేటర్స్.. వెంకటేష్ రియాక్షన్ ఇదే..!

ఈ ఏడాది సంక్రాంతి బరిలో బడా సినిమాలు సందడి చేయబోతున్నాయి. మహేష్ గుంటూరు కారం, వెంకటేశ్ సైంధవ్, తేజ సజ్జా హనుమాన్, నాగార్జున నా సామి రంగా, రవితేజ ఈగల్ అంటూ రాబోతున్నారు. ఈ సారి మాత్రం గట్టి పోటీ నెలకొంది. అయితే..

ఈ ఏడాది సంక్రాంతి బరిలో బడా సినిమాలు సందడి చేయబోతున్నాయి. మహేష్ గుంటూరు కారం, వెంకటేశ్ సైంధవ్, తేజ సజ్జా హనుమాన్, నాగార్జున నా సామి రంగా, రవితేజ ఈగల్ అంటూ రాబోతున్నారు. ఈ సారి మాత్రం గట్టి పోటీ నెలకొంది. అయితే..

Saindhav: మహేష్ సినిమాకు ఎక్కువ థియేటర్స్.. వెంకటేష్ రియాక్షన్ ఇదే..!

ఈ ఏడాది సంక్రాంతి బరిలో ఐదు బడా సినిమాలు విడుదల కాబోతున్నాయి. అందులో నలుగురు సూపర్ స్టార్ సమరానికి సై అంటున్నారు. ఒక యూత్ స్టార్ నుండి పాన్ ఇండియా మూవీ రాబోతుంది. ఎవరికీ వారే తమ సినిమా హిట్ కాబోతుందంటూ కాన్ఫిడెంట్‌గా ఉంటున్నారు. అయితే కేవలం గంటల వ్యవధిలోనే ఐదు సినిమాలు విడుదల కావడంతో టాలీవుడ్ ఇండస్ట్రీ పెద్దలు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారీ పోటీ నెలకొంది. ఈ సంక్రాంతికి గెలిచేదెవరు అన్న టెన్షన్ నెలకొంది. సీనియర్ హీరోస్ వెంకటేశ్.. సైంధవ్ మూవీతో వస్తుంటే.. నాగార్జున నా సామి రంగా అంటున్నారు. ఇక మోస్ట్ యాంటిసిపెడెట్ మూవీగా వస్తోంది గుంటూరు కారం. రవితేజ ఈగల్ అంటూ బరిలోకి దిగుతున్నాడు. అలాగే  యంగ్ హీరో తేజ పాన్ ఇండియా చిత్రం హనుమాన్  కూడా ఈ రేసులోనే పరుగెడుతోంది.

అయితే ఇక్కడ సినిమా విడుదల కన్నా ముఖ్యం..థియేటర్లు. ఎన్ని థియేటర్లలో మూవీ విడుదల అవుతుందో అంత రెవెన్యూ కొల్లగొడుతుంది. ఇప్పుడు ఫస్ట్ డే కలెక్షన్లు కీలకమైన నేపథ్యంలో భారీ కసర్తతులు చేస్తున్నారు చిత్ర దర్శక, నిర్మాతలు. ఈ సంక్రాంతికి ఐదు సినిమాలు రావడంతో బయ్యర్లు ఏ మూవీని కొనాలో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. దీంతో థియేటర్ల విషయంలో తీవ్ర పోటీ నెలకొంది. ఇదిలా ఉంటే.. త్రివిక్రమ్- మహేష్ కాంబోలో వస్తున్న గుంటూరు కారం మూవీకి ఇప్పటికే థియేటర్లను లాక్ చేసేశాడు నైజాం డిస్ట్రిబ్యూటర్ నిర్మాత దిల్ రాజు. తొలి రోజు అంటే జనవరి 12న 95 శాతం సింగిల్ స్క్రీన్లన్నీ గుంటూరు కారం కోసమే కేటాయించనున్నాడు. కేవలం హైదరాబాద్ లో మొత్తం 96 సింగిల్ స్క్రీన్లు ఉంటే.. వాటిల్లో 90 స్క్రీన్లలో మహేష్ చిత్రమే ఆడించనన్నారు థియేటర్ యాజమానులు.

కాగా, ఆ మరుసటి రోజే వెంకటేష్ 75వ మూవీ సైంధవ్ విడుదల కాబోతుంది. ఈ మూవీకి సంబంధించి ట్రైలర్ ఈ రోజు విడుదల అయ్యింది. ఈ సందర్భంగా పాత్రికేయుల సమావేశం ఏర్పాటు కాగా, థియేటర్ల ఇష్యూపై ప్రశ్న ఎదురైంది విక్టరీ వెంకటేష్‌కు. ఈ సందర్భంగా ఓ రిపోర్టర్ ‘ సంక్రాంతికి ఐదు సినిమాలున్నాయి. కోలీవుడ్ నుండి రెండు సినిమాలు వస్తున్నాయి. మీ చిన్నోడు మహేష్ బాబు.. మొత్తం ధియేటర్లు లాగేశాడు. మీకు అనుకున్నన్నీ థియేటర్లు దొరికాయా’అన్న ప్రశ్నకు వెంకటేష్ సమాధానం ఇచ్చారు. ‘నేనేమీ ఫీల్ కాను. నాకు దొరికిన థియేటర్లే తీసుకుంటాను. ఎక్కడ రిలీజ్ అయితే అక్కడే. అందరూ బాగుండాలి’ అని రిప్లై ఇచ్చారు.

అలాగే సంక్రాంతి బరిలో ఐదు సినిమాలు విడుదలవ్వడం హెల్తీ కాంపిటీషన్ అనుకుంటున్నారా.. దీన్ని ఆపేందుకు ఏమైనా ప్రయత్నాలు చేశారా అన్న ప్రశ్నకు.. ఇలాంటి విషయాల్లో జోక్యం చేసుకోనన్నారు. ఒక్కొక్కసారి ఇలా జరిగిపోతుంటాయి. రైట్, రాంగ్ అనే చెప్పే స్థితిలో లేనని పేర్కొన్నారు. ‘ఆడియన్స్ చాలా తెలివైన వాళ్లు.. వాళ్లు ఏ మూవీ చూడాలనుకుంటే అదే చూస్తారు. పాజిటివ్‌ థింక్‌లోనే వెళ్లాలి. సంక్రాంతి పండుగ కాబట్టి అన్ని సినిమాలు వెళ్లి చూసే అవకాశాలు కూడా ఉన్నాయి’ అంటూ పేర్కొన్నారు. మరీ ఈ సంక్రాంతి పందెం కోళ్లలో ఏ మూవీ విన్ అవుతుందని భావిస్తున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి