iDreamPost

Minnal Murali Report : మిన్నల్ మురళి రిపోర్ట్

Minnal Murali Report : మిన్నల్ మురళి రిపోర్ట్

నిన్న థియేటర్ కన్నా ఎక్కువగా ఓటిటి రిలీజులు ఉన్నాయి. అందులో ఎక్కువ దృష్టి ఆకర్షించిన సినిమా మిన్నల్ మురళి. ఇండియన్ సూపర్ హీరో స్టోరీగా మలయాళంలో రూపొందిన ఈ యాక్షన్ డ్రామా ఒకరకంగా హృతిక్ రోషన్ క్రిష్ నుంచి స్ఫూర్తి తీసుకున్నట్టు అనిపించినా స్పైడర్ మ్యాన్ తరహా కథలు మనమూ తీయాలన్న ఆలోచనలో నుంచి పుట్టింది. నెట్ ఫ్లిక్స్ దీన్ని భారీ మొత్తానికి హక్కులు సొంతం చేసుకుని ఒరిజినల్ వెర్షన్ తో పాటు తెలుగు తమిళం కన్నడ భాషలో అందించింది. మూడు నాలుగు నెలల నుంచి విస్తృతమైన ప్రమోషన్ చేసింది. మరి ఈ మిన్నల్ మురళి మేజిక్ చేశాడా లేదా రిపోర్ట్ లో చూద్దాం

టైలర్ షాప్ నడుపుకునే జేసన్(టోవినో థామస్) ఉరవకొండలో ఉంటాడు. అమెరికా వెళ్లే లక్ష్యంతో పాస్ పోర్ట్ కోసం ఎదురు చూస్తుంటాడు. అక్కడే ఓ చిన్న హోటల్లో పని చేసే శిబూ(గురు సోమసుందరం) పలురకాల ఇబ్బందులతో సతమతమవుతూ ఉంటాడు. ఈ ఇద్దరికీ ఓ అనూహ్య సందర్భంలో అతీత శక్తులు వస్తాయి. అక్కడి నుంచి ఆ ఊరిలో ఊహించని పరిణామాలు ఎదురవుతాయి. జేసన్ కు మిన్నల్ మురళి అనే పేరుకి ఉన్న కనెక్షన్ ఏంటి, శిబూ తన శక్తులను దేని కోసం ఉపయోగించాడు, ఫైనల్ గా ఈ ఇద్దరి ప్రయాణం ఎందరి జీవితాలను మార్చింది లాంటి ప్రశ్నలకు సమాధానం స్మార్ట్ స్క్రీన్ మీదే చూసి తెలుసుకోవాలి.

దర్శకుడు బాసిల్ జోసెఫ్ తనకు ఇచ్చిన బడ్జెట్ పరిమితుల్లోనే క్వాలిటీ అవుట్ ఫుట్ ఇచ్చేందుకు బాగా కష్టపడ్డాడు. అయితే డిటైల్డ్ గా కథను చెప్పాలన్న ఉద్దేశంతో రాసుకున్న స్క్రీన్ ప్లే కొంత నెమ్మదిగా సాగడంతో నిడివి బాగా పెరిగిపోయింది. ఓ ఇరవై నిముషాలు కత్తిరించినా వేగం పెరిగేది. పలు హాలీవుడ్ సినిమాల నుంచి స్ఫూర్తి తీసుకున్నప్పటికీ నేటివిటీకి చక్కగా సింక్ చేయగలిగారు. అనవసరమైన సన్నివేశాలు చాలా ఉన్నాయి. ఫార్వార్డ్ ఆప్షన్ ఉంది కాబట్టి ఎంజాయ్ చేయొచ్చు. టోవినో థామస్ మిన్నల్ మురళిగా పర్ఫెక్ట్ ఛాయస్ అనిపించాడు. పిల్లలతో కూర్చుకుని మంచి వీకెండ్ ఎంటర్ టైన్మెంట్ గా ట్రై చేయొచ్చు

Also Read :83 Movie Report : 83 సినిమా రిపోర్ట్

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి