iDreamPost

ఇంటర్ ఫెయిలైన పవన్ చదువు గురించి మాట్లాడటమా?: మంత్రి సురేష్

ఏపీ విద్యాశాఖలో కుంభకోణాలు జరుగుతున్నాయంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ కామెంట్స్ చేశారు. అయితే పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ మంత్రులు, నేతలు కౌంటర్లు ఇస్తున్నారు. తాజాగా రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్.. పవన్ పై ఫైర్ అయ్యారు.

ఏపీ విద్యాశాఖలో కుంభకోణాలు జరుగుతున్నాయంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ కామెంట్స్ చేశారు. అయితే పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ మంత్రులు, నేతలు కౌంటర్లు ఇస్తున్నారు. తాజాగా రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్.. పవన్ పై ఫైర్ అయ్యారు.

ఇంటర్ ఫెయిలైన పవన్ చదువు గురించి మాట్లాడటమా?: మంత్రి సురేష్

శుక్రవారం సాయంత్రం జనసేన అధినేత పవన్ కల్యాణ్ మంగళగిరి వారి పార్టీ కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడారు. ఏపీ విద్యాశాఖలో కుంభకోణాలు జరుగుతున్నాయంటూ కామెంట్స్ చేశారు. అయితే పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ మంత్రులు, నేతలు కౌంటర్లు ఇస్తున్నారు. రాజకీయంలో స్థిరత్వం లేని పవన్ కల్యాణ్ నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారని వైసీపీ నేతలు అంటున్నారు. తాజాగా విద్యవ్యవస్థపై పవన్ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మండిపడ్డారు. ఇంటర్‌ ఫెయిలైన పవన్‌ కల్యాణ్‌ చదువు గురించి మాట్లాడుతున్నారంటూ మంత్రి ఎద్దేవా చేశారు.

శనివారం మంత్రి ఆదిమూలపు సురేష్ మీడియాతో మాట్లాడతూ.. దమ్ముంటే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులతో పవన్‌ ఇంగ్లీష్‌లో మాట్లాడాలని సవాలు చేశారు. ఐరాస వేదికపై ఏపీకి చెందిన పేద విద్యార్థులు ఇంగ్లీష్‌లో మాట్లాడుతున్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. పవన్‌ కల్యాణ్‌ మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారని, ఇంగ్లీష్‌ మీడియంపై పవన్‌ ఆరోపణలు అజ్ఞానానికి నిదర్శనమంటూ మంత్రి సురేష్ దుయ్యబట్టారు. ఇదే సమయంలో నారా లోకేశ్ పై కూడా మంత్రి ఫైర్ అయ్యారు. టీడీపీకి, లోకేశ్ లకు భవిష్యత్ లేదని జోష్యం చెప్పారు.

అంతేకాక టీడీపీ కార్యకర్తలు కేసులు పెట్టించుకుంటే 48 గంటల్లో విడిపిస్తానన్న లోకేష్  చేసిన వ్యాఖ్యలను  ఈ సందర్భంగా గుర్తుచేస్తూ.. వాళ్ల నాన్న జైలుకి వెళ్లి ఇన్ని రోజులైనా ఎందుకు బెయిలు తేలేకపోయాడు అంటూ మంత్రి ప్రశ్నించారు.  చేసిన పాపాలు, అన్యాయాలు,మోసాలు పండిపోయి చంద్రబాబు జైలుకి వెళ్లారన్నారు. యువగళం యాత్ర ఎందుకు లోకేష్ ఆపేశాడని మంత్రి ప్రశ్నించారు. ఏ యాత్ర చేసిన టీడీపీ, లోకేశ్ లకు భవిష్యత్‌ లేదని తేలిపోయిందని, లోకేష్, పవన్‌లకే గ్యారంటీ లేదని మంత్రి సురేష్ అన్నారు. వాళ్లిద్దరూ ప్రజలకు ఏం గ్యారంటీ ఇస్తారంటూ మంత్రి ఆదిమూలపు సురేష్‌ విమర్శలు గుప్పించారు. పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి