iDreamPost

Kapila Theertham: మిచౌంగ్ ఎఫేక్ట్.. కపిల తీర్థంలో వరద బీభత్సం!

మిచౌంగ్ తుఫాన్ కారణంగా కోస్తా తీరంలోని జిల్లాలో భారీ వర్షాలు కురుస్తోన్నాయి. పలు కాలనీల్లోకి వరద నీరు వచ్చి చేరగా.. వేలాది ఎకరాల పంట నేలకొరిగింది. ఇక తిరుపతిలోని కపిల తీర్థానికి వరద నీరు పోటెత్తింది.

మిచౌంగ్ తుఫాన్ కారణంగా కోస్తా తీరంలోని జిల్లాలో భారీ వర్షాలు కురుస్తోన్నాయి. పలు కాలనీల్లోకి వరద నీరు వచ్చి చేరగా.. వేలాది ఎకరాల పంట నేలకొరిగింది. ఇక తిరుపతిలోని కపిల తీర్థానికి వరద నీరు పోటెత్తింది.

Kapila Theertham: మిచౌంగ్ ఎఫేక్ట్.. కపిల తీర్థంలో వరద బీభత్సం!

మిచౌంగ్‌ తుఫాను ప్రభావంతో ఇప్పుడు చెన్నై, ఏపీ చిగురుటాకుల వణుకుతోంది. ఈ తుఫాన్ ఎఫెక్ట్ తో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తుండడంతో రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ఇక కోస్తా తీరంలోని జిల్లాలు తుఫాన్ దెబ్బకు చిగురుటాకుల వణుకుతున్నాయి. నెల్లూరు, తిరుపతి, బాపట్ల, కృష్ణ, ఒంగోలు జిల్లాలో పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి.  ఇక ఈ తుపాన్ సృష్టించిన బీభత్సం కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి. ముఖ్యంగా తిరుపతి జిల్లాలోని కపిల తీర్ధానికి వరద నీరు పోటెత్తింది.

బంగాళఖాతంలో ఏర్పడిన మిచౌంగ్ తుఫాన్ మరో రెండు గంటల్లో తీరం దాటనుంది. ఈ నేపథ్యంలో  నెల్లూరుకు 20 కి.మీ బాపట్లకు 150 కి.మీ దూరంలో తీవ్ర తుఫాన్ ఉంది. అదే విధంగా మంచిలీపట్నానికి 210 కి.మీ దూరంలో ఈ తుఫాన్ ఉంది. కోస్తా తీరానికి సమాతారంగా ఈ మిచౌంగ్ తుఫాన్ కదులుతుంది. బాపట్ల సమీపంలో తీరం దాటనున్నట్లు ఐఎండి అధికారులు తెలిపారు. తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి 110 కి.మీ వేగంతో బలమైన ఈదురు గాలులు వీచనున్నాయి.

ఈ తుఫాన్ కారణంగా గత రెండు రోజుల నుంచి ఏపీలో విపరితమైన వానలు కురుస్తున్నాయి. తిరుపతి, నెల్లూరు, ఒంగోలు, కృష్ణా, బాపట్ల జిల్లాలో తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉంది. ఇప్పటికే తిరుపతి, నెల్లూరు జిల్లాలోనే పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి.  విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకోరిగాయి. వీధుల్లోకి వరద నీరు చేరి.. జన జీవనం స్తంభించింది. అలానే పలు కాలనీలు నీట మునిగాయి.  వేలాది ఎకరాలు నేలకొరిగాయి. ఈ తుఫాన్ రైతులకు గుండెకోతను మిగిల్చింది. ఇక తిరుపతి నగరంలో అయితే వరద బీభత్సం మూములుగా లేదు. నగరంలోని పలు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి.

ఇక ప్రముఖ పర్యటక ప్రాంతం కపిల తీర్థానికి వరద నీరు పోటెత్తింది. కపిల తీర్థం వద్ద వరద నీరు కలకలం రేపుతోంది. తిరుమల కొండపై నుంచి నీటి ప్రవాహం కొనసాగుతుంది. జలపాతం నుంచి భారీగా ఈదురు గాలులు కూడా వీస్తున్నాయి. కపిల తీర్థంలోని కోనేరు నిండ మునిగిపోయింది. ఆ ప్రాంతమంతా వరద నీటితో సముద్రాన్ని తలపిస్తుంది. ప్రస్తుతం కపిల తీర్థంలో వరద నీటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి. మరి..మిచౌంగ్ తుఫాన్ సృష్టిస్తున్న బీభత్సంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి