iDreamPost

MGNREGA Wages: కేంద్ర గుడ్ న్యూస్.. నేరుగా వారి ఖాతాల్లోకే డబ్బులు!

కేంద్రం ప్రవేశపెట్టిన పథకాల్లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఒకటి. ఈ స్కీమ్స్ విషయంలో కేంద్రం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో ఇక నుంచి లబ్ధిదారులకు నేరుగా అకౌంట్లలోనే డబ్బులు జమ చేయనున్నారు.

కేంద్రం ప్రవేశపెట్టిన పథకాల్లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఒకటి. ఈ స్కీమ్స్ విషయంలో కేంద్రం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో ఇక నుంచి లబ్ధిదారులకు నేరుగా అకౌంట్లలోనే డబ్బులు జమ చేయనున్నారు.

MGNREGA Wages: కేంద్ర గుడ్ న్యూస్.. నేరుగా వారి ఖాతాల్లోకే డబ్బులు!

కేంద్రప్రభుత్వం ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను తీసుకొస్తుంది. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో అనేక పథకాలను ప్రవేశపెట్టింది. అలానే కరువు ప్రాంతాల్లో ఉండే ప్రజలకు కూడా వివిధ రకాల స్కీమ్స్ ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇలా కేంద్రం ప్రవేశపెట్టిన పథకాల్లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఒకటి. దీనికి దేశ వ్యాప్తంగా ఎంతో ఆదరణ ఉంది. పథకం విషయంలో తరచూ కేంద్రం  పలు మార్పులు చేస్తూ ఉంటుంది. అలానే తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఈ పథకం ద్వారా కూలీలకు అందించే వేతనాలు ఇకపై నేరుగా వారి బ్యాంకు అకౌంట్లో జమకానున్నాయి.

కరువు ప్రాంతాల్లో ఉండే ప్రజలక కోసం కేంద్ర ప్రభుత్వం పలు పథకాలను ప్రవేశ పెట్టింది. అలానే యూపీఎ ప్రభుత్వ హాయంలో 2006లో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశ పెట్టారు. స్కీమ్ ద్వారా ఎంతో మందికి ఉపాధిని కల్పిస్తున్నారు. ఇప్పటికే ఈ పథకం విషయంలో కేంద్రాలు అనేక  మార్పులు తీసుకొచ్చాయి. ఇందులో అక్కడక్కడ జరిగే అవినీతిని నిర్మూలించడానికి  అనేక చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా ఈస్కీమ్ కింద  కూలీలకు అందాల్సిన వేతనం విషయంలో కూడ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఉపాధి హామీ పథకం ద్వారా కూలీలకు అందించే వేతనాలు ఇకపై నేరుగా వారి బ్యాంకు ఖాతాలకే జమ కానున్నాయని కేంద్రం తెలిపింది. కూలీల ఆధార్‌ నంబర్ కు అనుసంధానమైన బ్యాంకు ఖాతాలకు  ఆ డబ్బులు చేరుతాయని  కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వ వర్గాలు సోమవారం వెల్లడించాయి.

Deposit money directly into the account!

కేంద్ర ప్రభుత్వ తెలిపిన గణాంకాల ప్రకారం.. దేశ వ్యాప్తంగా 25.89 కోట్ల మంది పేర్లు ఉపాధి హామీ కూలీలుగా నమోదై ఉన్నాయి. వీరిలో క్రియాశీల శ్రామికులు 14.28 కోట్ల మంది ఉన్నారు. అంతేకాక జాబ్‌ కార్డుతో ఆధార్‌ సీడింగ్‌ పూర్తైన వారు 13.48 కోట్ల మంది ఉన్నారు. ఆధార్‌తో కనెక్ట్ అయి..ధ్రువీకరణ పొందిన వారు 12.90 కోట్లు మంది ఉన్నారు. ఇప్పటి వరకు ఏబీపీఎస్‌కు అర్హులైన ఉపాధి హామీ కూలీలు 12.49 కోట్లు మంది ఉన్నారు. ఆధార్‌ ఆధారిత చెల్లింపుల వ్యవస్థకు మారడాన్ని తప్పనిసరి చేస్తూ రాష్ట్రాలకు కేంద్రం ఇచ్చిన  తుది గడువు డిసెంబరు 31తో ముగిసింది. ఈ గడువును పెంచబోమని ఇదివరకే కేంద్రం స్పష్టం చేసింది.  ఉపాధి హామీ కూలీలకు జనవరి 1 నుంచి ఆధార్‌ ద్వారానే చెల్లింపులను తప్పనిసరి చేయడంపై వివిధ వర్గాల నుంచి వస్తున్న విమర్శలు వచ్చాయి.

ఈ నేపథ్యంలోనే కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ పై వివరణ ఇచ్చింది. ఏదైనా గ్రామ పంచాయతీలో ఆధార్‌ ఆధారిత చెల్లింపులు చేయడానికి టెక్నికల్ ఇష్యూ కానీ, ఆధార్‌ కి సంబంధించిన ఇబ్బందులు కానీ తలెత్తినప్పుడు మాత్రమే ఈ నిబంధన నుంచి మినహాయింపు ఇవ్వనున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది. అది కూడా ఆ సమస్య పరిష్కారమయ్యేంత వరకేనని పేర్కొంది. దీని బట్టి ఇక నుంచి ఎవరి ప్రమేయం లేకుండా ఉపాధి  కూలీలకు మధ్యవర్తి ఎవ్వరు లేకుండా నేరుగా కేంద్రం నుంచి  బ్యాంకు అకౌంట్లో డబ్బులు జమ కానున్నాయి. మరి.. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి