iDreamPost

Mega Princess: మెగా వారసురాలు రావడంపై చిరంజీవి ఎమోషనల్!

Mega Princess: మెగా వారసురాలు రావడంపై చిరంజీవి ఎమోషనల్!

మెగా పవర్ స్టార్ రాంచరణ్, మెగా కోడలు ఉపాసన తల్లిదండ్రులయ్యారు. జూన్ 20న తెల్లవారుజామున ఉపాసన జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ వార్త ఒక్క మెగా ఫ్యామిలీలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మెగా అభిమానుల్లో ఆనందాన్ని నింపింది. మెగా వారసురాలు వచ్చింది అంటూ అంతా సంబరాలు చేసుకుంటున్నారు. టాలీవుడ్ ప్రముఖులు, పెద్దలు, హీరోలు, హీరోయిన్లు, అభిమానులు అంతా రాంచరణ్- ఉపాసనలకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెబుతున్నారు. నాయనమ్మ, తాతయ్యలు అయిన మెగాస్టార్ దంపతులకు సైతం శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

మెగా వారసురాలు ఎంట్రీపై మెగాస్టార్ చిరంజీవి ఎమోషనల్ అయ్యారు. ఆయన ఆనందాన్ని, సంతోషాన్ని ట్విట్టర్ వేదికగా తన అభిమానులతో పంచుకున్నారు. “లిటిల్ మెగా ప్రిన్సెస్ కు స్వాగతం. నీ రాకతో కొన్ని కోట్ల మందిని కలిగి ఉన్న మెగా ఫ్యామిలీలో సంతోషాన్ని నింపావు. రాంచరణ్- ఉపాసనలను తల్లిదండ్రులను చేసావు. మమ్మల్ని నానమ్మ- తాతయ్యలను చేశావు. ఈ క్షణం ఆనందంగా, గర్వంగా ఉంది” అంటూ మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు.

మరోవైపు సోషల్ మీడియా వేదికగా మెగా ప్రిన్సెస్ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ లో ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మెగా అభిమానులు, తెలుగు ప్రేక్షకులు మెగా వారసురాలు రావడం ఎంతో సంతోషంగా ఉంది అంటూ రాంచరణ్- ఉపాసనలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ట్వీట్లు చేస్తున్నారు. భాషతో సంబంధం లేకుండా దేశవ్యాప్తంగా ఉన్న స్టార్ హీరోలు, హీరోయిన్లు సైతం రాంచరణ్ దంపతులకు బెస్ట్ విషెస్ ని తెలియజేస్తున్నారు. రాంచరణ్- ఉపాసన దంపతులు ఇటీవలే తమ 11వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్న విషయం తెలిసిందే. మెగా ఫ్యామిలీకి కామెంట్స్ రూపంలో మీ శుభాకాంక్షలను తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి