iDreamPost

అశోకా…ఎవరిది బాబూ బాకా?

అశోకా…ఎవరిది బాబూ బాకా?

కళింగ యుద్ధంలో తలలు తెగిపడి..రక్తపుటేరులుపారిన తర్వాత అశోక చక్రవర్తికి జ్ఞానోదయం అయినట్లు..మన అశోకుడికి హితోదయం అయినట్లుందా? .. ఏమో? లోగుట్టు పెరుమాళ్లకెరుక!

అసలు విషయానికి వస్తే.. చాలా కాలంగా మౌనంగా ఉన్న ఏపీఎన్జీవో మాజీ అధ్యక్షలు కాదు కాదు టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు ఉన్న ఫలంగా మీడియా మిత్రులను పిలిచి ఉద్యోగులకు హితబోధ చేశారు. ఏమని.. “ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి బాకా ఊదడం మానుకోవాలి. ఉద్యోగులు తమకు రావాల్సిన డీఆర్, పీఆర్సీల గురించి మాట్లాడాలి. ఎన్నికలు వద్దని మాట్లాడడం భావ్యం కాదు. ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయాలను అమలు పరచాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. కోర్టు ఆదేశాల మేరకు రెండు వ్యవస్థలు పరస్పర సహకారంతో.. ఎన్నికలను శాంతియుతంగా నిర్వహించాలి” అని ఎమ్మెల్సీ అశోక్ బాబు హితోక్తులు పలికారు. క్లుప్తంగా చెప్పాలంటే ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి బాకా ఊదడం మానుకోవాలి అంటూ హితోక్తులు పలుకుతున్నారన్నమాట !

హన్నన్నా ..అశోకన్నా..ఏం సెప్తిరి ఏం సెప్తిరి..మీరు సూపర్ బాసూ..అసలు బాకా అనే మాటకు ఆధ్యులు ఎవరన్నా? అయినా మీకు ఎమ్మెల్సీ పదవి ఎలా వచ్చిందన్నా? చంద్రబాబుకు బాకా ఊదితేనే కదా? అవును కాకా పట్టడంలో మీకు మీరే సాటి కదా? సమైక్య ఉద్యమంలో ఏపీ ఎన్జీవో నాయకునిగా ఉండి ..రాజకీయాలు ఒంట పట్టించుకుని, బాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత ..బాకాలు ఊదితేనేకదా మీకు పదవీ యోగం పట్టిందన్నది ఉద్యోగులెరుగని రహస్యమా? ఎమ్మెల్సీ పదవి రాగనే విషయం మరితిపోయావా స్వామి? హన్నన్నా ఎంత రాజకీయ పరిణతి బాబూ? ఇది చంద్రన్న సాంగత్యంలో వచ్చిందా? లేక స్వకృతమేనా? ఇప్పుడు ఆవిషయాలు ఎందుకులే గాని..విషయంలోకి వద్దాం.

ఉద్యోగులు ప్రభుత్వానికి లాయల్ గా ఉండాలి. ఇది ప్రాథమిక సూత్రం..అంతేకాదు ప్రభుత్వ జీతాలు తింటూ ప్రభుత్వాన్ని విమర్శించ కూడదు..ఇదీ ఉద్యోగ ధర్మమే.. కాని గుడ్డెద్ది చేలో పడినట్లు ప్రభుత్వాన్ని సమర్థించడం అనేది మాత్రం సరైంది కాదు. అందుకే కొందరు ఐఏఎస్,ఐపీఎస్ లు ఉద్యోగాలకు రాజీనామ చేస్తున్నసంఘటనలు కో కొల్లలు,..ఈవిషయం అందరికి తెలిసిందే. అలాంటిది ఇవేవీ పట్టించుకోకుండా చంద్రబాబు అవినీతి అక్రమాలను గుడ్డిగా సమర్థించి.. ఎమ్మెల్సీ పదవి పొందిన అకోక్ బాబు..ఉద్యోగులు ప్రభుత్వానికి బాగా ఊదొద్దని హితబోధ చేయడం చూస్తుంటే..దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లుంది.. అయినా ప్రస్తుతం ఎస్ఈసీ నిమ్మగడ్డ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్న తీరు అందరిని విస్మయానికి గురిచేస్తుంటే.. అకోక్ బాబుకు మాత్రం వీను ల విందుగా వినిపిస్తున్నట్లుంది..

గతంలో అశోక్ చంద్రబాబు సర్కార్ ను గుడ్డిగా సమర్దించినప్పుడు.. అది స్వార్థం కోసం అన్నది బహిరంగమే.. కాని ప్రస్తుతం ఏపీఉద్యోగులు ప్రభుత్వాన్ని సమర్థించడం సమర్థనీయం. ఎన్నికలు జరిగితే క్షత్రస్థాయిలో ముందుండాల్సింది ఉద్యోగులే..ప్రస్తుతం కరోనా పూర్తిగా పోలేదు.. దానికి తోడు స్ట్రెయిన్ కొత్త కరోనా దేశంలో ఎంటరైంది.. కేంద్రం రాష్ట్రాలను అప్రమత్తం చేసింది…మరోవైపు మరో వారం రోజుల్లో కరోనా వ్యాక్సిన్ డ్రైవ్ మొదలు కానుంది. మొదటి విడత వ్యాక్సిన్ కరోనా వారియర్స్ కే అని కేంద్రం స్పష్టం చేసింది. ఇలాంటి పరిస్థితిలో ఎన్నికల నిర్వహిస్తా.. అంటూ నిర్ణయించడమే గందరగోళానికి దారి తీస్తోంది. ఇలాంటి టైంలో తమ కోసం..కరోనా బారిన పడకుండా ఉండడం కోసం ఏపీ ఉద్యోగులు ఎన్నికల విధులు బహిష్కరిస్తాం అన్నారు తప్ప..నిమ్మగడ్డకు వ్యతిరేకంగా ఉద్యమిస్తామనలేదు.. తమ ప్రాణాలు కాపాడుకోవడానికి విధులు బహిష్కరిస్తా అనడం ప్రభుత్వానికి బాగా ఊదడం ఎలా అవుతుందో.. రాజకీయ స్వార్థంతో “చంద్రోదయం” అయిన ఏపీ అశోకు సెలవియ్యాలి మరి!

మరోవైపు… పంచాయతీ ఎన్నికలపై ఏపీ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. ప్రభుత్వం వేసిన హౌస్‌ మోషన్‌ పిటిషన్‌ను విచారణకు హైకోర్టు స్వీకరించింది. ఇవాళ సమయం ముగిసిపోవడంతో సోమవారం విచారిస్తామని కోర్టు పేర్కొంది. కరోనా వ్యాక్సినేషన్, ఉద్యోగుల భద్రత దృష్ట్యా ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని ప్రభుత్వం అంటోంది. అంటే ప్రభుత్వమూ ఉద్యోగులు ప్రాణాల గురించి ఆలోచిస్తుంటే..ఎమ్మెల్సీ పదవు కాలం పూర్తి కావస్తుందేమో..మరో సారి అవకాశం కోసం అశోకన్న ప్లాన్ బీ ప్రారంబించినట్లుంది..ఎందుకంటే ఇప్పుడు బాగా ఊదే ఛాన్స్ లేదుగా.. కాకా పట్టటమే!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి