iDreamPost

Marakkar : మరక్కార్ వస్తే డిజిటల్ రికార్డులు గల్లంతే

Marakkar : మరక్కార్ వస్తే డిజిటల్ రికార్డులు గల్లంతే

మోహన్ లాల్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొంది ఇటీవలే జాతీయ అవార్డు కూడా దక్కించుకున్న మరక్కార్ ది లయన్ అఫ్ అరేబియన్ సినిమా అమెజాన్ ప్రైమ్ ద్వారా డైరెక్ట్ ఓటిటి రిలీజ్ అందుకోబోతోందంటూ వచ్చిన వార్త మల్లువుడ్ లో ప్రకంపనలు రేపుతోంది. ఆరు నెలల తర్వాత కేరళలో ఎల్లుండి నుంచి థియేటర్లు తెరుచుకోబోతున్నాయి. అది కూడా 50 శాతం ఆక్యుపెన్సీతోనే. ఇలాంటి పరిస్థితిలో మరక్కార్ లాంటి మల్టీ స్టారర్ పెట్టుబడిని వెనక్కు తేవడం అంత సులభం కాదు. పైగా ఇది ఆ రాష్ట్రం కాకుండా బయట డబ్బింగ్ వెర్షన్ల రూపంలో అద్భుతాలు చేసే అవకాశం తక్కువ. ముఖ్యంగా తెలుగులో ఏం చేసినా దీనికి అంత బజ్ రాదు.

అందుకే నిర్మాత కం మోహన్ లాల్ అత్యంత ఆత్మీయుడైన ఆంటోనీ పెరువంబూర్ తన సన్నిహితుల వద్ద ఓటిటి డీల్ గురించి చెప్పేశారట. అగ్రిమెంట్ సైన్ చేయడం కూడా అయిపోయిందని ప్రకటన లాంఛనంగా చేయడం మాత్రమే మిగిలిందని ఆయన చెప్పినట్టుగా అక్కడి మీడియాలో పలు కథనాలు వచ్చాయి. అయితే ఆంటోనీ నుంచి ఎలాంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ లేదు. ఇప్పుడీ పరిణామం పట్ల డిస్ట్రిబ్యూటర్లు భగ్గుమంటున్నారు. అంత పెద్ద స్టారే డిజిటల్ కు వెళ్ళిపోతే ఇక చిన్న హీరోలు అసలు థియేటర్ ముఖం చూస్తారా అని నిలదీస్తున్నారు. ప్రభుత్వం కూడా ఓటిటి రిలీజులు వద్దనే అంటోంది.

త్వరలోనే దీనికి సంబంధించిన స్పష్టత రావొచ్చు. ఎవరు ఔనన్నా కాదన్న కరోనా వల్ల స్టార్ల ఆలోచనా తీరు మారిపోయింది. సూర్య ఇప్పటికే ఆకాశం నీ హద్దురా, జై భీంలను నేరుగా ఓటిటి ద్వారా రిలీజ్ చేశారు. నాని వి-టక్ జగదీశ్, వెంకటేష్ నారప్ప ఇవన్నీ పెట్టుబడుల భారం భరించలేకే డిజిటల్ బాట పట్టాయి. మోహన్ లాల్ దృశ్యం 2 సైతం ఇదే పని చేసింది. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ట్వేల్త్ మ్యాన్ కూడా ఓటిటికేనట. కానీ మలయాళం బాహుబలిగా అక్కడి మూవీ లవర్స్ భావిస్తున్న మరక్కార్ మాత్రం పెద్ద స్క్రీన్ మీద చూస్తేనే మజా. ప్రియదర్శన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అర్జున్, సునీల్ శెట్టి, కీర్తి సురేష్ ప్రధాన తారాగణం

Also Read : Balayya Unstoppable : అన్ స్టాపబుల్ లో సెలబ్రిటీల ప్రవాహం

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి