iDreamPost

మంజుమ్మెల్ బాయ్స్.. తెలుగు వెర్షన్ థియేటర్ రిలీజ్ ఆలస్యానికి కారణమిదే?

  • Published Mar 16, 2024 | 4:51 PMUpdated Mar 21, 2024 | 12:41 PM

Manjummel Boys Telugu version release date: మలయాళంలో సూపర్ హిట్ టాక్ సంపాదించుకున్న మంజుమ్మెల్‌బాయ్స్ సినిమా.. త్వరలో తెలుగు వెర్షన్ రాబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి, ఈ సినిమా తెలుగు వెర్షన్ అప్ డేట్ గురించి వివరాలు ఇలా ఉన్నాయి.

Manjummel Boys Telugu version release date: మలయాళంలో సూపర్ హిట్ టాక్ సంపాదించుకున్న మంజుమ్మెల్‌బాయ్స్ సినిమా.. త్వరలో తెలుగు వెర్షన్ రాబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి, ఈ సినిమా తెలుగు వెర్షన్ అప్ డేట్ గురించి వివరాలు ఇలా ఉన్నాయి.

  • Published Mar 16, 2024 | 4:51 PMUpdated Mar 21, 2024 | 12:41 PM
మంజుమ్మెల్ బాయ్స్.. తెలుగు వెర్షన్ థియేటర్ రిలీజ్ ఆలస్యానికి కారణమిదే?

మలయాళీ సినిమాలు తెలుగు ప్రేక్షకులను తెగ మెప్పించేస్తున్నాయి. ఇటీవల మలయాళీ రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్ “ప్రేమలు”.. ఒరిజినల్ లాంగ్వేజ్ తో సూపర్ హిట్ టాక్ సంపాదించుకోవడంతో.. ఆ సినిమాను తెలుగులో డబ్ చేసి విడుదల చేశారు. దీనితో తెలుగులో ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇక ఇప్పుడు ఈ బ్లాక్ బస్టర్ హిట్ టాక్ మంజుమ్మెల్ బాయ్స్ వంతు అవ్వబోతుంది. ఫిబ్రవరి 22న థియేటర్స్ లో విడుదలైన మలయాళీ సర్వైవల్ థ్రిల్లర్ “మంజుమ్మెల్ బాయ్స్”. ఈ సినిమా విడుదలైన మొదటి షో నుంచే హిట్ టాక్ సంపాదించుకుని.. బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ తన సొంతం చేసుకుంది. అయితే, ఇక ఇప్పుడు ఈ సూపర్ హిట్ సినిమాను.. తెలుగులో కూడా విడుదల చేయాలనుకుంటున్నారట మేకర్స్. దీనికి సంబంధించిన విషయాలు ఇలా ఉన్నాయి.

మలయాళీ సినిమా అయినా మంజుమ్మెల్ బాయ్స్.. తక్కువ బడ్జెట్ తో వచ్చి.. బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ కలెక్షన్స్ రాబట్టింది. 2006 లో తమిళనాడులో జరిగిన ఓ నిజ జీవిత సంఘటన ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా సంచలనం సృష్టించింది. మలయాళంలో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన మంజుమ్మెల్ బాయ్స్.. రూ.100 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టింది. ఈ క్రమంలోనే మలయాళీ సినిమాలకు తెలుగు ఆడియన్స్ మధ్య మంచి ఆదరణ లభిస్తోంది. ఇక ఇప్పుడు మంజుమ్మెల్ బాయ్స్ సినిమాను కూడా తెలుగులో డబ్బింగ్ చేయాలనుకుంటున్నారట మేకర్స్. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను తెలుగు వెర్షన్ ను విడుదల చేస్తోంది. ఈ క్రమంలో ఈ సినిమా డబ్బింగ్ పనులు వేగవంతంగా సాగిస్తున్నారు. అయితే, ముందుగా మంజుమ్మెల్ బాయ్స్ తెలుగు వెర్షన్ ను మార్చి 15 తేదీ విడుదల చేసేందుకు ప్లాన్ చేశారు మేకర్స్. కానీ, అనుకున్న సమయానికి ఈ మూవీ రిలీజ్ కాలేదు. డబ్బింగ్ పనులు ఇంకా పూర్తి కాకపోవడమే ఈ సినిమా రిలీజ్ కు ఆలస్యం అయిందని ప్రేక్షకులు భావిస్తున్నారు. ఒకవేళ డబ్బింగ్ పనులు ఇన్ టైమ్ లో పూర్తయితే .. మంజుమ్మెల్ బాయ్స్ తెలుగు వెర్షన్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుందని సమాచారం. కానీ, ఈ విషయమై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

మంజుమ్మెల్ బాయ్స్ సినిమా విషయానికొస్తే.. 2006 తమిళనాడు కొడైకెనాల్ లోని గుణ గుహల్లో జరిగిన ఒక వాస్తవ సంఘటన ఆధారంగా.. ఈ సినిమాను తెరకెక్కించారు. కొంతమంది ఫ్రెండ్స్ కలిసి గుణ గుహలను చూడడానికి వెళ్తారు. అందులో ఒకరు ప్రమాదవశాత్తు లోయలో పడిపోతాడు. దీనితో అతని ఫ్రెండ్స్ ఆ వ్యక్తిని కాపాడే ప్రయత్నం చేసే ప్రయాణమే.. ఈ సినిమా స్టోరీ. గుణ గుహల్లో తప్పిపోయిన స్నేహితుడి కోసం అతని స్నేహితులు చేసిని ప్రయత్నాలు.. అప్పట్లో సంచలనం సృష్టించింది. పోలీసులు సైతం కాపాడలేమని చెప్పినా.. అతడి స్నేహితులు మాత్రం విశ్వ ప్రయత్నాలు చేస్తారు. మలయాళంలో సూపర్ సక్సెస్ సాధించిన ఈ సినిమా తెలుగులో కూడా హిట్ టాక్ సంపాదించుకుంటుంది చెప్పడంలో.. ఏ సందేహం లేదు. మరి, మంజుమ్మెల్ బాయ్స్ తెలుగు రిలీజ్ అప్ డేట్ పై.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి