iDreamPost

Manisharma: మణిశర్మ ఆవేదన! పవన్‌, మహేష్‌ నాక్కూడా అవకాశం ఇవ్వాలి..

మణిశర్మ దాదాపు రెండు దశాబ్ధాలకు పైగా స్టార్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌గా వెలుగొందారు. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లోనూ చిత్రాలు చేశారు.

మణిశర్మ దాదాపు రెండు దశాబ్ధాలకు పైగా స్టార్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌గా వెలుగొందారు. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లోనూ చిత్రాలు చేశారు.

Manisharma: మణిశర్మ ఆవేదన! పవన్‌, మహేష్‌ నాక్కూడా అవకాశం ఇవ్వాలి..

మణిశర్మ.. ఈ పేరు గురించి ఇప్పటి జనరేషన్‌కు పెద్దగా తెలియకపోవచ్చు కానీ, 90 కిడ్స్‌కు మాత్రం ఈయన ఫేవరేట్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌. మణిశర్మ సంగీతం అందించిన ప్రతీ సినిమా పాటలు సూపర్‌ డూపర్‌ హిట్‌ అయ్యాయి. మూవీ పోయినా.. పాటలు మాత్రం అందరి మనసుల్లో నిలిచిపోయాయి. చిన్న హీరో.. పెద్ద హీరో అన్న తేడా లేకుండా అందరినీ ఆకట్టుకునే సంగీతాన్ని అందించారు. 2014 నుంచి ఆయనకు అవకాశాలు తగ్గుతూ వస్తున్నాయి.

స్టార్‌ హీరోలు ఆయన్ని పట్టించుకోవటం మానేశారని చెప్పొచ్చు. ఎక్కువగా చిన్న సినిమాలకు సంగీతం అందిస్తూ వస్తున్నారు. 2017, 2019 సంవత్సరాల్లో ఎక్కువ చిత్రాలకు సంగీతం అందించినా.. వాటిలో ఎక్కువ శాతం చిన్న సినిమాలే ఉన్నాయి. 2023లో ఆయన కేవలం ఒక్క మూవీకి మాత్రమే సంగీతం అందించారు. ప్రస్తుతం ఆయన రెండు చిత్రాలకు సంగీతం అందిస్తున్నారు. వాటిలో ఒకటి ‘‘ డబుల్‌ ఇస్మార్ట్‌’’ కాగా.. మరోటి ‘‘ కన్నప్ప’’. ఈ రెండు చిత్రాలు శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్నాయి.

manisharma comments pn pawan kalyan and mahesh babu

అవకాశాలు బాగా తగ్గిపోవటంతో మణిశర్మ కొంత మానసిక కుంగుబాటుకు గురవుతున్నారు. తాజాగా, టాలీవుడ్‌ స్టార్‌ హీరోలు పవన్‌ కళ్యాణ్‌, మహేష్‌ బాబులకు ఆయన ఓ విజ్ఞప్తి చేశారు. తనకు అవకాశం ఇవ్వాలని కోరారు. సంగీత దర్శకులను రిపిటీ చేస్తూ ఉండాలన్నారు. ఓ ఇంటర్వ్యూలో మణిశర్మ మాట్లాడుతూ.. ‘‘ మహేష్‌ నా చిన్న తమ్ముడిలాంటి వాడు. అతడు నన్ను చాలా బాగా నమ్మేవాడు. అతడి నమ్మకాన్ని ఇద్దరం కలిసి పని చేసిన లాస్ట్‌ సినిమా వరకు కొనసాగించాను.

అయితే, ఏం జరిగిందో నాకు తెలీదు. మేమిద్దరం కలిసి పని చేసిన చివరి సినిమా తర్వాత అతడు నాకు మళ్లీ ఫోన్‌ చేయలేదు. నేను పవన్‌ కళ్యాణ్‌ ఖుషీ సినిమాలోని ‘ చెలియ చెలియ ’ పాటను కలిసి కంపోజ్‌ చేశాం. కలిసి డ్యాన్సులు చేశాం. కలిసి పాడాం. ఈ పాటలు సిద్ధం చేసే సమయంలో చాలా ఎంజాయ్‌ చేశాం. మహేష్‌, పవన్‌ లాంటి స్టార్లు తమ మ్యూజిక్‌ డైరెక్టర్లను రొటేట్‌ చేయాలి. దేవీ, థమన్‌ల లాగా నాకు కూడా ఓ మంచి అవకాశం ఇవ్వాలి’’ అని అన్నారు.

కాగా, పవన్‌- మణిశర్మ.. మహేష్‌- మణిశర్మ కాంబినేష్‌లో ఎన్నో హిట్టు పాటలు వచ్చాయి. ఆ పాటల్ని ఇప్పటికూడా వింటూ ఎంజాయ్‌ చేస్తున్నారు జనం. ఏం జరిగిందో ఏమో కానీ, ఈ ఇద్దరు హీరోలు మణిశర్మను తమ సినిమాలకు తీసుకోవటాన్ని తగ్గించేశారు. ఇదే మణిశర్మను ఆవేదనకు గురయ్యేలా చేస్తోంది. మరి, పవన్‌- మహేష్‌లకు మణిశర్మ చేసిన రిక్వెస్ట్‌పై మీ అభిప్రాయాలను కామెం‍ట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి