iDreamPost

‘మంగళవారం’పై పాజిటివ్ బజ్.. అయినా అజయ్ భూపతి ఇలా ఎందుకు చేస్తున్నట్టు?

  • Author singhj Updated - 07:55 AM, Fri - 17 November 23

హీరోయిన్ పాయల్ రాజ్​పుత్ యాక్ట్ చేసిన ‘మంగళవారం’ సినిమా బిగ్​ స్క్రీన్స్​లోకి వచ్చేస్తోంది. విడుదలకు ముందే ఈ మూవీపై పాజిటివ్ బజ్ నెలకొంది.

హీరోయిన్ పాయల్ రాజ్​పుత్ యాక్ట్ చేసిన ‘మంగళవారం’ సినిమా బిగ్​ స్క్రీన్స్​లోకి వచ్చేస్తోంది. విడుదలకు ముందే ఈ మూవీపై పాజిటివ్ బజ్ నెలకొంది.

  • Author singhj Updated - 07:55 AM, Fri - 17 November 23
‘మంగళవారం’పై పాజిటివ్ బజ్.. అయినా అజయ్ భూపతి ఇలా ఎందుకు చేస్తున్నట్టు?

ఒకే సినిమాతో ఓవర్​నైట్ స్టార్​డమ్ తెచ్చుకున్న డైరెక్టర్​గా అజయ్ భూపతిని చెప్పుకోవచ్చు. ఆయన తీసిన ‘ఆర్ఎక్స్ 100’ ఫిల్మ్ సంచలన విజయాన్ని సాధించింది. యూత్​తో పాటు మాస్ ఆడియెన్స్ ఆదరించడంతో ఎక్స్​పెక్ట్ చేయని విధంగా కలెక్షన్స్ సాధించిందా సినిమా. ‘ఆర్ఎక్స్ 100’ సక్సెస్​తో పాయల్ రాజ్​పుత్, కార్తికేయలు లైమ్​లైట్​లోకి వచ్చారు. వీళ్లిద్దరికీ వరుస ఛాన్సులు క్యూ కట్టాయి. డైరెక్టర్ అజయ్ భూపతికి కూడా భారీ ఆఫర్లు వచ్చాయి. ఈ క్రమంలో శర్వానంద్, సిద్ధార్థ్​తో ‘మహాసముద్రం’ ప్రాజెక్ట్​ను మొదలుపెట్టారాయన. ఈ చిత్రంలో పెద్ద స్టార్లు నటిస్తారనే వార్తలు వచ్చినా.. ఆఖరికి శర్వా, సిద్ధూలతో మూవీ తెరకెక్కింది. అయితే ఈ ఫిల్మ్ రిజల్ట్ మాత్రం అజయ్ భూపతిని తీవ్రంగా నిరాశపర్చింది.

‘మహా సముద్రం’ ఇచ్చిన షాక్ నుంచి తేరుకున్న అజయ్ భూపతి తనను తాను ప్రూవ్ చేసుకునేందుకు మళ్లీ చిన్న సినిమా తీయాలని సెలెక్ట్ అయ్యారు. ఈసారి కూడా పాయల్ రాజ్​పుత్​నే ప్రధాన పాత్రకు తీసుకొని ‘మంగళవారం’ అనే మూవీని రూపొందించారు. ఈ నెల 17న థియేటర్లలోకి రానున్న ఈ ఫిల్మ్ డిజిటల్ ప్రీమియర్ రైట్స్ భారీ ధరకు అమ్ముడు పోయినట్లు సమాచారం. సినిమాపై పాజిటివ్ బజ్ ఉండటం, పాయల్-అజయ్ భూపతి కాంబో రిపీట్ కానుండటంతో ‘మంగళవారం’ రైట్స్​ను దక్కించుకునేందుకు ఓటీటీ కంపెనీలు పోటీపడ్డాయని టాక్. రిలీజ్​కు ముందే ఈ మూవీ సేఫ్ జోన్​లోకి వెళ్లిపోయిందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.

‘మంగళవారం’ మీద ఆడియెన్స్​లో మంచి ఎక్స్​పెక్టేషన్స్ ఉన్నాయి. అయితే డైరెక్టర్ అజయ్ భూపతి వ్యవహరిస్తున్న తీరు మాత్రం ఈ సినిమాకు నెగెటివ్​గా మారే ఛాన్స్ ఉందని సోషల్ మీడియాలో కొందరు నెటిజన్స్ అంటున్నారు. గత చిత్రం ‘మహాసముద్రం’ టైమ్​లో సినిమా మీద ఎక్స్​పెక్టేషన్స్​ను భారీగా పెంచేశారు అజయ్ భూపతి. బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నామని ప్రీ రిలీజ్ ఫంక్షన్​లో డైలాగులు కొట్టారు. తీరా సీన్​లోకి వస్తే సినిమాకు ఫ్లాప్ టాక్. ఇప్పుడు ‘మంగళవారం’ విషయంలోనైతే ఆయన మరింత అగ్రెసివ్​గా ప్రమోషన్స్ చేస్తున్నారు. సినిమా వేరే లెవల్​లో ఉంటుంది, ట్విస్టులు అదిరిపోతాయంటూ ప్రీ రిలీజ్ ఫంక్షన్​తో పాటు ఇంటర్వ్యూల్లో ఊదరగొడుతున్నారు.

‘మంగళవారం’ సినిమా​పై ప్రేక్షకులతో పాటు మూవీ గోయర్స్​లోనూ మంచి బజ్ ఉంది. కాబట్టి థియేటర్​కు వెళ్లాక ఫిల్మ్ బాగుంటే పాజిటివ్ టాక్, మౌత్ పబ్లిసిటీ వచ్చే ఛాన్స్ ఉంది. రిలీజ్ తర్వాత డైరెక్షన్, రైటింగ్ స్కిల్స్, టెక్నికల్ పాయింట్స్, యాక్టింగ్ గురించి గొప్పగా చెప్పుకుంటే పబ్లిసిటీ అవుతుంది. కానీ విడుదలకు ముందే ఇలా అంచనాలు పెంచేస్తే.. సినిమా ఆ రేంజ్​లో ఉండకపోతే మాత్రం మరో ‘మహా సముద్రం’ అయిపోద్దని నెటిజన్స్ హెచ్చరిస్తున్నారు. మరి.. ‘మంగళవారం’ ప్రమోషన్స్​ విషయంలో అజయ్ భూపతి వ్యవహరిస్తున్న తీరుపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: జైలర్ విలన్‌పై గౌతమ్ మీనన్ ఇంట్రస్టింగ్ కామెంట్స్.. పని చేయలేమంటూ..

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి