iDreamPost

నాన్న కోసం సింగర్స్ గా మారనున్న మంచు విష్ణు కుమార్తెలు..

నాన్న కోసం సింగర్స్ గా మారనున్న మంచు విష్ణు కుమార్తెలు..

మంచు విష్ణు హీరోగా నటిస్తున్న గాలి నాగేశ్వరరావు సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ‘గాలి నాగేశ్వరరావు’ అనే మాస్ క్యారెక్టర్ చేస్తున్నారు విష్ణు. పాయల్ రాజ్ ఫుత్, సన్నీలియోన్ లాంటి తారలు యాడ్ అవ్వడం సినిమాకి స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది. ఇండియన్ మైకేల్ జాక్సన్ ప్రభుదేవా ఈ సినిమాలోని ఓ పాటకు కొరియోగ్రఫీ చేస్తున్నారు.

తాజాగా ఈ సినిమాకి మరో హైలైట్ తోడవనుంది. మంచు విష్ణు కుమార్తెలు, కవలలు అయిన అరియానా, వివియానా ఈ సినిమా ద్వారా సింగర్స్ గా పరిచయం అవుతున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలోని ఓ పాటను అరియానా, వివియానా పాడనున్నారు. గేయ రచయిత భాస్కరభట్ల ఈ పాటకు సాహిత్యం అందించారు. సినిమాకి ఈ పాట చాలా స్పెషల్ గా ఉండబోతుంది అని సమాచారం.

చాల రోజులుగా సరైన హిట్ లేకపోవడం వల్ల మంచు విష్ణు ఈ సినిమాపై ప్రత్యేక శ్రద్ద తీసుకున్నట్టు తెలుస్తుంది. అందుకే ఈ సినిమాలో చాలా హైలేట్స్ యాడ్ అవనున్నాయి. ఓ పక్కన సినిమా షూటింగ్ జరుగుతుండగానే మరో పక్క మంచు విష్ణు వివిధ రకాలుగా ఈ సినిమాని ప్రమోట్ చేస్తున్నారు. మరి ఈ గాలి నాగేశ్వరరావు సినిమా మంచు విష్ణు గాలి హిట్ వైపుకి మళ్లిస్తుందేమో చూడాలి. ఈ సినిమాని మంచు విష్ణు స్వయంగా నిర్మిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి