iDreamPost

వీడియో: డ్రంక్ డ్రైవ్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగి మాటలింటే పొట్ట చక్కలవుతుంది!

వీడియో: డ్రంక్ డ్రైవ్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగి మాటలింటే పొట్ట చక్కలవుతుంది!

మద్యం తాగితే మనిషి ఆలోచనా శక్తి తగ్గిపోవడం, మెదడు మొద్దుబారిపోవడం జరుగుతుందని అందరికీ తెలుసు. మద్యం మత్తులో ఉంటే ఏం చేస్తున్నదీ తెలియకుండా నానా హంగామా చేస్తుంటారు. కొందరైతే బైకులు, కార్లు వేసుకుని రోడ్లపైకి వచ్చేస్తుంటారు. అలాంటి వారి వల్ల ఎన్నో ప్రమాదాలు జరిగాయి.. చాలా మంది ప్రాణాలు కూడా పోయాయి. అలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు డ్రంక్ డ్రైవ్ నిర్వహిస్తూ.. మందుబాబులపై చర్యలు తీసుకుంటున్నారు. అయినా కొందరు మాత్రం పూటుగా తాగేసి రోడ్లెక్కేస్తున్నారు.

సాధారణంగా వీకెండ్ వచ్చింది అంటే చాలానే ప్లానింగ్స్ వేసుకుంటారు. పబ్బుకు వెళ్లాలి, ఫ్రెండ్స్ తో సిట్టింగ్ వేయాలి అంటూ ప్లాన్ చేసుకుంటారు. ఎంత తిన్నా.. తాగినా ఎవరికీ ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ, అలా తాగి రోడ్డెక్కితేనే అసలు సమస్య మొదలవుతుంది. కొందరు ఏమాత్రం లెక్కచేయకుండా మద్యం సేవించి కార్లు, బైకులు తోలేస్తుంటారు. అలాంటి వారికి చెక్ పెట్టేందుకు పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తుంటారు. అలా మేడ్చల్ జిల్లా కండ్లకోయలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అల్వాల్ ప్రాంతానికి చెందిన సాఫ్ట్ వేర్ ఉద్యోగి కరుణాకర్ మద్యం సేవించి అటుగా వచ్చాడు. తనిఖీల్లో భాగంగా పోలీసులు ఊదమన్నారు. అతను ఊదగానే మీటరులో 94 రీడింగ్ వచ్చింది.

ఆ మీటరు చూసిన తర్వాత పోలీసులు కరుణాకర్ ను ఏం తీసుకున్నావ్ అని అడిగారు. అందుకు తను చాలా సీరియస్ గా నేను పాలు తాగినా సార్ అని చెప్పాడు. ఆ సమాధానం వినగానే పోలీసులు పగలబడి నవ్వారు. తన వివరాలు అడగ్గా తాను సాఫ్ట్ వేర్ ఉద్యోగని.. అల్వాల్ లో ఉంటానంటూ చెప్పుకొచ్చాడు. అతనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కరుణాకర్ చెప్పిన సమాధానం ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. మద్యం సేవించి వాహనాలు నడపకండి అంటూ పోలీసులు చెబుతూనే ఉన్నారు. కానీ, చాలా మంది ఆ మాటలను పెడ చెవిన పెడుతున్నారు. నా డ్రైవింగ్ మీద నాకు నమ్మకం ఉంది అనుకుంటూ మద్యం మత్తులో వచ్చి ప్రమాదాలు చేస్తున్నారు. వీళ్ల నిర్లక్ష్యం వల్ల అభం శుభం తెలియని వాళ్ల ప్రాణాలు పోతున్నాయి. మద్యం సేవించి వాహనం నడిపే వ్యక్తి ఉగ్రవాదితో సమానం అని సజ్జనార్ లాంటి వ్యక్తులు కామెంట్ చేసినా కూడా వీళ్ల తీరులో మాత్రం మార్పు రావడం లేదు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి