iDreamPost

రూ. 500 కోట్ల బడ్జెట్ సినిమాలైనా.. అలాంటి క్యారెక్టర్స్ చేయను: మాళవిక

  • Author ajaykrishna Updated - 03:06 PM, Tue - 1 August 23
  • Author ajaykrishna Updated - 03:06 PM, Tue - 1 August 23
రూ. 500 కోట్ల బడ్జెట్ సినిమాలైనా.. అలాంటి క్యారెక్టర్స్ చేయను: మాళవిక

ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్స్ గా ఎదగాలంటే ఈ ముద్దుగుమ్మకైనా ఓపిక చాలా ముఖ్యం. అలాగే కంటిన్యూగా బెస్ట్ సబ్జెక్టులు ఎంచుకోవడానికి ట్రై చేస్తుండాలి. ఒక స్టోరీని జడ్జిమెంట్ చేయగలిగే నాలెడ్జి ఉంటే.. హీరోయిన్స్ ఎక్కువగా ప్లాప్స్ బారిన పడకుండా ఉండే అవకాశం ఉంది. కెరీర్ ఆరంభంలో అలాంటి అవగాహన లేక ప్లాప్స్ మూటగట్టుకుంటారేమో గానీ.. తెలిసి తెలిసి ఏ హీరోయిన్స్ అంత గుడ్డిగా సినిమాలను ఓకే చేయరు. ఒకవేళ అలా జరిగిందంటే.. ఖచ్చితంగా రెమ్యూనరేషన్ టెంప్టింగ్ ఉండి ఉండాలి. ఇవేవి కాదనుకుంటే చేతిలో అవకాశాలు లేకపోవాలి. లేదా అప్పుడే అవకాశం దొరికిందని ఆనందంలో యాక్సెప్ట్ చేసుండాలి.

ఎవరు ఏం చేసినా.. తాను మాత్రం ఆ టైప్ కాదని.. రూ. 500 కోట్లు బడ్జెట్ పెట్టే సినిమాలు అయినా చేయనని అంటోంది మలయాళం బ్యూటీ మాళవిక మోహనన్. ఈ భామ గురించి చెప్పాలంటే.. తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేదు. కానీ.. దళపతి విజయ్ సరసన మాస్టర్ సినిమాలో మెరిసింది. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన టాలీవుడ్ డెబ్యూకి రెడీ అవుతోంది. ఇంతకీ ఏం సినిమా అనుకుంటున్నారా.. డైరెక్టర్ మారుతీ – ప్రభాస్ కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో ఈ అమ్మడు హీరోయిన్. అయితే.. మోడలింగ్ నుండి సినిమాల్లోకి వచ్చిన మాళవిక.. దక్షిణాది భాషలలో సినిమాలు చేస్తూనే.. బాలీవుడ్ లో తన అదృష్టం పరీక్షించుకుంటోంది.

ఇదిలా ఉండగా.. సినిమాల పరంగా పెద్ద బ్రేక్ రానప్పటికి.. గ్లామర్ పరంగా మాళవికకు మిలియన్స్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆమె సోషల్ మీడియాలో పెట్టే పోస్టులు చూస్తే ఇట్టే అర్ధమవుతుంది. అందాన్ని అయితే ప్రదర్శిస్తోంది. కానీ.. అభినయానికి స్కోప్ ఉన్న క్యారెక్టర్ ఇప్పటిదాకా చేయలేదు. కానీ.. పెద్ద పెద్ద స్టార్స్ సినిమాలు కూడా రిజెక్ట్ చేసేస్తోందట ఈ భామ. రీసెంట్ మాళవిక చేసిన వ్యాఖ్యలు నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి. రూ.500 కోట్ల భారీ బడ్జెట్ తో తీసే సినిమా అయినా.. అందులో తన క్యారెక్టర్ కి ప్రాధాన్యత లేకుంటే నో చెప్పేస్తానని తేల్చి చెబుతోంది. ఓహో ఇప్పటిదాకా మాళవిక గురించి చెప్పింది ఇదా అనుకుంటున్నారా.. అవును.. క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ లేకపోతే సినిమా హిట్ అయినా పెద్ద లాభం ఉండదు అనేది మాళవిక భావన. సో.. మాళవిక నిర్ణయం గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి