iDreamPost

జక్కన్న కంటే ముందు మరో డైరెక్టర్ తో మహేష్ సినిమా?

  • Author ajaykrishna Updated - 03:07 PM, Tue - 26 September 23
  • Author ajaykrishna Updated - 03:07 PM, Tue - 26 September 23
జక్కన్న కంటే ముందు మరో డైరెక్టర్ తో మహేష్ సినిమా?

సూపర్ స్టార్ మహేష్ బాబుని దర్శకధీరుడు రాజమౌళి సినిమాలో చూడాలని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు అభిమానులు. ఎంతో కాలంగా వెయిట్ చేస్తున్న ఈ కాంబినేషన్.. ఎట్టకేలకు ఆర్ఆర్ఆర్ తర్వాత అధికారికంగా కన్ఫర్మ్ అయిపోయింది. దీంతో ఫ్యాన్స్ అందరు డబుల్ హ్యాపీ. రాజమౌళి సినిమా ప్రస్తుతం స్క్రిప్ట్ దశలో ఉంది.. మరోవైపు ప్రీ ప్రొడక్షన్ వర్క్ సైతం జరుపుకుంటుందట. ఈ గ్యాప్ లో మహేష్.. దర్శకుడు త్రివిక్రమ్ తో గుంటూరు కారం చేస్తున్నాడు. ప్రెజెంట్ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా.. వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కాబోతుందని మేకర్స్ ప్రకటించారు.

ఇక త్రివిక్రమ్, మహేష్ కాంబినేషన్ పై కూడా ఫ్యాన్స్ లో చాలా అంచనాలు నెలకొన్నాయి. వీరి కాంబోలో ఇదివరకు అతడు, ఖలేజా లాంటి ఆల్ టైమ్ ఎంటర్టైనర్స్ వచ్చాయి. ఇప్పటికి ప్రేక్షకులను అలరిస్తున్నాయి. అదిగాక మహేష్ ని చాలా కొత్తగా మాస్ లుక్ లో ప్రెజెంట్ చేస్తున్నాడు త్రివిక్రమ్. ఈ సినిమా రిలీజ్ అయ్యాక మహేష్.. రాజమౌళి సినిమాలో జాయిన్ అవుతాడని ఫ్యాన్స్ అంతా భావిస్తున్నారు. రాజమౌళి సినిమా అంటే.. మినిమమ్ రెండేళ్లు పైనే టైమ్ పడుతుందని.. అప్పటిదాకా మహేష్ వేరే సినిమాలు కూడా ఓకే చేసే అవకాశం ఉండదు. సో.. రాజమౌళి అడిగినన్ని డేట్స్ మహేష్ కేటాయించాల్సి ఉంటుంది.

ఈ క్రమంలో రాజమౌళితో సినిమా స్టార్ట్ అయితే.. మహేష్ వేరే సినిమాలకు ఆప్షన్ ఉండదు. అంటే.. బాహుబలి కోసం ప్రభాస్ ఐదేళ్లు, ఆర్ఆర్ఆర్ కోసం రామ్ చరణ్, ఎన్టీఆర్ మూడేళ్లు కేటాయించారు. కానీ.. రావాల్సిన హిట్స్, గ్లోబల్ ఫేమ్ అయితే పక్కాగా వస్తుంది. సో.. రాజమౌళి సినిమాకు అంత టైమ్ పడుతుంది కాబట్టి.. మహేష్ ఈ గ్యాప్ లో.. మరో సినిమా చేసే ఆలోచనలో ఉన్నట్లు టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం చేస్తున్న గుంటూరు కారం కాకుండా.. మరో డైరెక్టర్ తో చిన్న సినిమా చేసేద్దాం అని ఫిక్స్ అయినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇందులో నిజమెంత ఉందనేది తెలియాల్సి ఉంది. ఓవైపు అనిల్ రావిపూడితో అని రూమర్స్ వస్తున్నాయి. చూడాలి మరి మహేష్ బాబు ఏం కన్ఫర్మ్ చేస్తారో!

 

View this post on Instagram

 

A post shared by Skyupsmedia (@skyupsmedia)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి