iDreamPost

Mahesh Babu :మహేష్ బాబు సినిమాలో చియాన్ విక్రమ్ ?

Mahesh Babu :మహేష్ బాబు సినిమాలో చియాన్ విక్రమ్ ?

ఆలూ లేదు చూలు లేదు సామెత తరహాలో అసలు ఇంకా షూటింగే మొదలు కానీ సినిమాల గురించిన లీకులు కూడా ఫిలిం నగర్లో చక్కర్లు కొడుతున్నాయి. ఆర్ఆర్ఆర్ తర్వాత రాజమౌళి చేయబోయే మహేష్ బాబు మూవీలో విలన్ గా విక్రమ్ ని అనుకుంటున్నట్టు, ప్రాథమికంగా ఫోన్ లోనే ఒక దఫా చర్చలు కూడా జరిగినట్టు వాటి సారాంశం. మహేష్ విక్రమ్ కాంబో అంటే ఎక్స్ పెక్టేషన్స్ ఓ రేంజ్ లో ఉంటాయి. అందులోనూ విక్రమ్ ని ప్రతినాయకుడిగా అంటే తెరమీద జరిగే రచ్చ ఊహించుకోవచ్చు. గతంలో మణిరత్నం విలన్ లో విక్రమ్ పూర్తి నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో అద్భుతంగా నటించి మెప్పించాడు. ఆ సినిమాలో అదొక్కటే మెచ్చుకునే అంశం.

ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత చియాన్ స్ట్రెయిట్ తెలుగు సినిమా చేయడం కంటే కావలసింది ఏముంటుంది. అయితే ఇదంతా నిజమా కదా తెలియడానికి చాలా టైం పడుతుంది. ఎందుకంటే మహేష్ బిజీగా ఉన్నాడు. ముందు సర్కారు వారి పాట పూర్తవ్వాలి. ఆ తర్వాత త్రివిక్రమ్ ప్రాజెక్ట్ పట్టాలు ఎక్కుతుంది. దీనికి ఎంత లేదన్నా ఆరు నెలల కనీస సమయం అవసరం. ఇంకా ఎక్కువే పట్టినా ఆశ్చర్యం లేదు. ఈలోగా 2022 చివరికి వెళ్ళిపోతాం. జక్కన్న 2023లో ప్రిన్స్ మూవీని మొదలుపెడితే ఏ 2025లోనో రిలీజ్ అవుతుంది. మరి అంతేసి సమయాన్ని తారక్ చరణ్ లాగా మహేష్ త్యాగం చేయగలడా అనేదే వేచి చూడాలి

మల్టీ స్టారర్ సంస్కృతి సౌత్ లో పెరుగుతున్న తరుణంలో ఇలాంటి కాంబినేషన్లు చాలా అవసరం. విక్రమ్ లాంటి ఆర్టిస్టులు ఉంటే తమిళంలో సినిమాను మార్కెట్ చేసుకోవడానికి ఇంకా సులభం అవుతుంది. ఆర్ఆర్ఆర్ కోసం అజయ్ దేవగనే ఒప్పించిన రాజమౌళికి విక్రమ్ ని కన్విన్స్ చేయడం కష్టం కాదు కానీ నిజమా కాదా తెలియాలంటే మాత్రం ఇంకొంత కాలం ఆగక తప్పదు. ఏప్రిల్ 1 కి సర్కారు వారి పాటను వాయిదా వేశాక మహేష్ మీద ఒత్తిడి తగ్గింది. ఆలా అని షూటింగ్ ఆపలేదు కానీ ఉరుకులు పరుగులు లేకుండా కూల్ గా చేసుకుంటున్నారు. ట్రైలర్ ని జనవరి సంక్రాంతి పండక్కు విడుదల చేయొచ్చని ఇన్ సైడ్ న్యూస్.

Also Read : F3 Movie : 30 ఏళ్ళ క్రితం కమెడియన్ చేసిన పాత్రలో హీరో

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి