iDreamPost

రాత్రి 10 గంటల సమయంలో దారుణం! పెళ్లైన ఏడాదికే!

ఏడాది క్రితమే గౌతమికి పెళ్లైంది. ఆదివారం కావడంతో భర్తను తీసుకుని పుట్టింటికి వెళ్లింది. అక్కడ సరదాగా గడిపింది. సోమవారం రాత్రి 10 గంటలకు తిరిగి బయలు దేరగా..

ఏడాది క్రితమే గౌతమికి పెళ్లైంది. ఆదివారం కావడంతో భర్తను తీసుకుని పుట్టింటికి వెళ్లింది. అక్కడ సరదాగా గడిపింది. సోమవారం రాత్రి 10 గంటలకు తిరిగి బయలు దేరగా..

రాత్రి 10 గంటల సమయంలో దారుణం! పెళ్లైన ఏడాదికే!

కొన్ని కొన్ని సార్లు.. చిన్న చిన్న కారణాలే పెను విషాదాన్ని నింపుతాయి. కుటుంబ సభ్యులకు ప్రియమైన వారిని దూరం చేసేందుకు కారణమౌతున్నాయి. అవే ఊహించని ప్రమాదాలను తెచ్చిపెట్టడంతో పాటు జీవితాంతం బాధపడేలా చేస్తాయి. ఆ కారణాలే అలసత్వం, నిర్లక్ష్యం. చూసి చూడనట్టు, పట్టించుకోనటువంటి ఈ ధోరణులు.. కొన్ని సార్లు ఆయుధాలై ప్రాణాలు తీసేస్తున్నాయి. నిండు ప్రాణాలను బలితీసుకుంటున్నాయి. అప్పటి వరకు హ్యాపీగా ఉన్న జీవితాన్ని.. మలుపు తిప్పడమే కాదు, లైఫ్ లేకుండా చేస్తున్నాయి. అకాల మృత్యువు పొంచి ఉంటోంది. హాయిగా సాగిపోతున్న ఓ మహిళకు చున్నీ రూపంలో మృత్యువు కబళించింది. ఈ ఘటన మహబూబ్ నగర్ జిల్లాలో చోటుచేసుకుంది.

కొత్తకోట వీవర్స్ కాలనీకి చెందిన యాదగిరికి.. చిన్న చింతకుంటలో ప్రాంత వాసి అయిన పోతు గౌతమికి గత ఏడాది పెళ్లైంది. కొత్త కాపురం.. హాయిగా సాగిపోతున్న సంసారం.. ఆదివారం పుట్టింటికి వెళ్లింది గౌతమి. అక్కడి నుండి కురుమూర్తి అనే గ్రామానికి వెళ్లి అక్కడి బంధువులను పలకరించింది. అందరితో సరదాగా గడిపింది. తిరిగి అత్తారింటికి బయలు దేరింది. సోమవారం రాత్రి 10 గంటలకు దంపతులు బైక్ పై తమ ఊరుకు తిరుగు ప్రయాణం అయ్యారు. ఇంటికి వెళ్లిపోవాలన్న తొందరలో ఉన్నారు. మదనాపురం మండలంలోని దంతనూర్ సమీపానికి రాగానే..అక్కడ వీచే గాలులకు గౌతమి చున్నీ ఒక్కసారిగా ఎగిరి బైక్ వెనుక చక్రాల్లో ఇరుక్కుంది. ఈ విషయాన్ని ఇద్దరు గమనించలేదు. గౌతమి చున్నీ మెడకు వేసుకోవడంతో ఆమె రోడ్డుపై పడిపోయింది.

వెంటనే గమనించిన భర్త.. బండి ఆపి.. గౌతమిని పైకి లేపి చూడగా.. తీవ్ర గాయాలతో రక్తమోడుతోంది. వెంటనే ఆమెను కొత్త కోట ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా..ప్రథమ చికిత్స అందించి.. హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించింది. పెళ్లైన ఏడాది కాకుండానే గౌతమిని కోల్పోవడంతో భర్త యాదగిరితో పాటు కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. అప్పటి వరకు తమ వద్ద గడిపిన అమ్మాయి.. ఇక లేదంటూ నమ్మలేకపోతున్నారు. చున్నీ కారణంగా ఆమె ప్రాణాలు కోల్పోవడం విచారకరం. కాగా, మహిళలు వాహనాలపై వెళుతుండగా.. జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.  చున్నీలు, చీరలు ఊహించని విధంగా చట్రాల్లోకి ఇరుక్కుపోయి ప్రమాదాల బారిన పడిన అనేక ఘటనలు ఉన్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి