iDreamPost

ఓటీటీలోకి యూత్ ఫుల్ కామెడీ మూవీ ‘MAD’.. స్ట్రీమింగ్ అప్పటినుంచే!

  • Author Soma Sekhar Updated - 11:36 PM, Thu - 2 November 23

మ్యాడ్ మూవీని థియేటర్లలో చూడటం మిస్ అయిన ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా? అని ఎదురుచూస్తున్నారు. తాజాగా వారి ఎదురుచూపులకు తెరదించుతూ.. మ్యాడ్ ఓటీటీలోకి రాబోతుంది. మరి ఏ ఓటీటీలో ఎప్పటి నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుందో ఇప్పుడు చూద్దాం.

ఈ మధ్య కాలంలో వచ్చిన యూత్ ఫుల్ కామెడీ మూవీ ఏదంటే? చాలా మంది నోటి నుంచి వచ్చే పేరు’మ్యాడ్’. కొత్త నటులతో, కొత్త దర్శకుడు తెరకెక్కించిన ఈ మూవీ యూత్ కు బాగా కనెక్ట్ అయ్యింది. కథలో కొత్తదనం లేకపోయినప్పటికీ.. చూస్తున్నంతసేపు నవ్వుకునేలా తీర్చిదిద్దాడు దర్శకుడు. ఇక ఈ మూవీ హిట్ టాక్ తో పాటుగా మంచి వసూళ్లను కూడా సాధించింది. ఇక ఈ మూవీని థియేటర్లలో చూడటం మిస్ అయిన ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా? అని ఎదురుచూస్తున్నారు. తాజాగా వారి ఎదురుచూపులకు తెరదించుతూ.. మ్యాడ్ ఓటీటీలోకి రాబోతుందన్న వార్త వినిపిస్తోంది. మరి ఏ ఓటీటీలో ఎప్పటి నుంచి మ్యాడ్ స్ట్రీమింగ్ అవుతుందో ఇప్పుడు చూద్దాం.

‘మ్యాడ్’.. కొత్త నటీ, నటులతో కొత్త దర్శకుడు కళ్యాణ్ శంకర్ తెరకెక్కించిన యూత్ ఫుల్ కామెడీ చిత్రం. అక్టోబర్ 6వ తేదీనా థియేటర్లలోకి వచ్చింది. మార్నింగ్ షో నుంచే ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ రావడంతో.. తొలి రోజే భారీ ఓపెనింగ్స్ ను రాబట్టింది మ్యాడ్. యూత్ ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం.. యూత్ కు బాగా కనెక్ట్ అయ్యింది. జాతిరత్నాలు రేంజ్ కామెడీ వర్కౌట్ కావడంతో.. హిట్ టాక్ తో పాటుగా భారీ వసూళ్లను రాబట్టినట్లు ఇండస్ట్రీ టాక్. కథలో కొత్తదనం లేకపోయినప్పటికీ.. చూస్తున్నంత సేపు నవ్వుకునే ఈ మూవీని తీర్చిదిద్దాడు దర్శకుడు.

ఇక థియేటర్లలో మ్యాడ్ మూవీని మిస్ అయిన ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. తాజాగా మ్యాడ్ ఓటీటీకి సంబంధించిన ఓ వార్త వైరల్ గా మారింది. మ్యాడ్ ఓటీటీ హక్కులను ప్రముఖ సంస్థ అయిన నెట్ ఫ్లిక్స్ దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని నవంబర్ 3 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై అటు మేకర్స్ నుంచి ఇటు చిత్ర బృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇక సినిమా కథ విషయానికి వస్తే.. ముగ్గురు ఫ్రెండ్స్, మూడు లవ్ స్టోరీస్, ర్యాగింగ్స్ నేపథ్యంలో ఈ సినిమా సరదాగా.. నవ్వులతో సాగిపోతుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి