iDreamPost

Maa Oori Polimera : మా ఊరి పొలిమేర రిపోర్ట్

Maa Oori Polimera : మా ఊరి పొలిమేర రిపోర్ట్

ఇటీవలి కాలంలో కేవలం ఓటిటి కోసమే ప్రత్యేకంగా సినిమాలు తీసే దర్శక నిర్మాతల సంఖ్య పెరిగిపోతోంది. ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా ఇంట్లోనే చూసే వెసులుబాటు కావడం వల్ల వీటికి ఆదరణ కూడా పెరుగుతోంది. స్టార్ క్యాస్టింగ్ అవసరం లేకుండా కాస్త గుర్తింపు ఉన్న ఆర్టిస్టులతో కాన్సెప్ట్ కనక సరిగ్గా ప్రెజెంట్ చేయగలిగితే మంచి ఫలితాలు దక్కుతాయి. సోనీ లివ్, ఆహా తరహాలో డిస్నీ హాట్ స్టార్ ఇటీవలి కాలంలో ఇలాంటి కంటెంట్ మీద గట్టి ఫోకస్ పెడుతోంది. అందులో భాగంగా ఇటీవలే డైరెక్ట్ డిజిటిల్ రిలీజ్ అందుకున్న చిత్రం మా ఊరి పొలిమేర. ట్రైలర్ ఆసక్తికరంగానే అనిపించడంతో కాసిన్ని అంచనాలు ఏర్పడ్డాయి.

తెలంగాణలోని ఓ పల్లెటూళ్ళో ఆటో నడుపుకుంటూ భార్యతో జీవనం సాగిస్తూ ఉంటాడు కొమరయ్య(సత్యం రాజేష్). తమ్ముడు (బాలాదిత్య) పోలీసు పరీక్షలు రాసి కానిస్టేబుల్ గా ఎంపికవుతాడు. పక్కింట్లో ఉండే కొమరయ్య స్నేహితుడు(గెటప్ శీను) పచ్చి తాగుబోతు. ఆ ఊరి సర్పంచ్(రవివర్మ) ఆగడాలకు వీళ్ళు ముగ్గురు లోలోపల రగిలిపోతూ ఉంటాడు. ఓ యాక్సిడెంట్ లో సర్పంచ్ చనిపోతాడు. మరో సంఘటనలో ఓ అమ్మాయి శవం దొరుకుతుంది. అది కొమరయ్య చేసిన చేతబడి వల్లే జరిగిందని నమ్మిన ఆమె కుటుంబ సభ్యులు ప్రతీకారాన్ని సిద్ధపడతారు. ఊహించని మలుపులు ఎదురవుతాయి. ఆ తర్వాత జరిగేదే అసలు కథ

దర్శకుడు డాక్టర్ అనిల్ విశ్వనాథ్ తీసుకున్న పాయింట్ లో కొత్తదనం ఉంది. బడ్జెట్ పరిమితుల వల్ల బాగా రాజీ పడినట్టు కనిపించినా అనుభవం ఉన్న ఆర్టిస్టుల సహాయంతో మంచి అవుట్ ఫుట్ నే ఇచ్చారు. కాకపోతే అవసరానికి మించి అడల్ట్ సీన్లు జొప్పించడం ఫ్యామిలీ ఆడియన్స్ ని దూరం చేస్తుంది. బూతులు కూడా మొదట్లో గట్టిగా వాడారు. సత్యం రాజేష్ అందరికంటే ఎక్కువ మార్కులు కొట్టేయగా గెటప్ శీను, బాలాదిత్యలకు పెర్ఫార్మన్స్ పరంగా స్కోప్ దక్కింది. క్లైమాక్స్ లో ట్విస్ట్ ఇచ్చి రెండో భాగంపై ఆసక్తి రేపడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యారు. ఓటిటి ఛాయస్ కాబట్టి ఎక్కువ ఇబ్బంది పడకుండా సోలోగా చూసుకోవచ్చు

Also Read : OTT Subscription Prices : ఓటిటిల మధ్య ధరల పోటీ

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి