iDreamPost

వీడియో: లులు మాల్‌లో కుల్ఫీ కొన్న కస్టమర్.. కదులుతున్న పురుగులు చూసి..

Worms in Lulu Mal Kulfi: లులు మాల్ ఇటీవల ఎంత ఫేమస్ అయ్యిందో.. అదే స్థాయిలో వివాదాలకు కేంద్ర బిందువుగా నిలుస్తుంది.

Worms in Lulu Mal Kulfi: లులు మాల్ ఇటీవల ఎంత ఫేమస్ అయ్యిందో.. అదే స్థాయిలో వివాదాలకు కేంద్ర బిందువుగా నిలుస్తుంది.

వీడియో: లులు మాల్‌లో కుల్ఫీ కొన్న కస్టమర్.. కదులుతున్న పురుగులు చూసి..

దేశ వ్యాప్తంగా లులు మాల్ కి ఎంతో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఇక్కడ అన్ని రకాల వస్తువులు, తినుబండారాలు లభించడంతో కస్టమర్లు ఎగబడుతుంటారు. ఇటీవల లులు మాల్ కి వచ్చే కస్టమర్లు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారని.. ఆహార విషయంలో సరైన నాణ్యత పాటించడం లేదని పలు ఆరోపణలు వచ్చాయి.   పిల్లల నుంచి పెద్దల వరకు రక రకాల ఐటమ్స్ కొని తింటుంటారు. ఈ క్రమంలో ఓ కస్టమర్ ఐస్ క్రీమ్ కొని తినే ప్రయత్నం చేయగా ఒక్కసారిగా షాక్ తిన్నాడు. ఇంతకీ ఆ ఐస్ క్రీమ్ లో ఏముంది? కస్టమర్ ఎందుకు ఖంగు తిన్నాడు. ఈ ఘటనకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.

దేశంలో ఎండలు మండిపోతున్నాయి. దీంతో చిన్నా పెద్ద తేడా లేకుండా చల్లని పానియాల వైపు పరుగులు తీస్తున్నారు. సమ్మర్ సీజన్ వచ్చిందంటే పిల్లలకు సెలవులు ఉంటాయి.. దీంతో తల్లిదండ్రులతో కలిసి సినిమాలు, పార్కులు, షాపింగ్ మాల్స్ కి వెళ్లి ఎంజాయ్ చేస్తుంటారు. తాజాగా యూపీలోని లక్నోలో లులు మాల్ లో ‘ఫలుదా నేషన్’ లో ఓ కస్టమర్ కుల్ఫీ కొన్నాడు. కుల్ఫీ విప్పి తినాలనే సరికి అందులో కదులుతున్న పురుగులు చూసి ఒక్కసారే షాక్ తిన్నాడు. తాజాగా దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సదరు కస్టమర్ కుల్ఫీలో ఉన్న పురుగులు దుకాణదారుడికి చూపిస్తున్నాడు.

ఇదిలా ఉంటే దుకాణదారుడు ఆ వీడియో చూసి కంగారు పడ్డాడు. వెంటనే కస్టమర్ కి వేరే కుల్ఫీ ఇస్తామని అన్నాడు. కానీ కస్టమర్ మాత్రం తనకు వద్దని తిరస్కరించాడు. తర్వాత ఆ కుల్ఫీ ధర చెల్లించాడు దుకాణదారుడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో నెటిజన్లు సీరియ్ అవుతున్నారు. గతంలో కూడా లులు మాల్ లో నాణ్యత లేని ఆహారం సప్లై చేస్తారన్న ఆరోపణలు ఎన్నో వచ్చాయి. తాజాగా ఈ వీడియో చూసి ఇప్పటికీ లులు తీరు మార్చుకోవడం లేదని ఫైర్ అవతుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి