iDreamPost

మద్యపాన నిషేధానికి కలిసొస్తున్న లాక్ డౌన్

మద్యపాన నిషేధానికి కలిసొస్తున్న లాక్ డౌన్

లాక్ డౌన్తో అందరూ ఇబ్బంది పడుతుంటే జరిగే మేలు ఏంటి అనుకుంటున్నారా..?. అది కూడా ప్రజల కోసమేనండి. ముఖ్యంగా మందుబాబుల కోసం. గత ప్రభుత్వాలు మద్యాన్ని ఆదాయ వనరుగా చూడడంతో రాష్ట్రం మొత్తం విచ్చలవిడిగా మద్యపానం చేసే వారి సంఖ్య పెరిగింది. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కు మద్యం ఎంత అమ్మాలి వంటి కండిషన్లు పెట్టి మరి గత ప్రభుత్వాలు మద్యం ద్వారా ప్రజల సొమ్మును కొల్లగొట్టాయి.

ముఖ్యంగా ఉత్పాదక వయసులో ఉన్న యువత ఈ మహమ్మారి కి బానిస గా మారి ఉక్కు శరీరాలను గుల్ల చేసుకుంటున్నారు.

ఈ పరిస్థితులను గమనించి,ఇతర ప్రభుత్వాలకు భిన్నంగా దశలవారీగా మద్యపాన నిషేధం హామీని ఎన్నికల్లో ఇచ్చి ప్రజల ఆశీసులతో సీఎంగా పదవి చేపట్టిన వైఎస్ జగన్.. పదవి చేపట్టిన రోజు నుంచే ఆ దిశగా చర్యలు చేపట్టారు. మద్యం షాపుల టైమింగ్ మార్చేశారు. దీంతో శాంతిభద్రతల విషయంలో ఈ మార్పు స్పష్టమైన ముద్ర వేసింది. రాత్రి 8 గంటలకు షాపులు మూసి వేయడంతో రోడ్లమీద ఆకతాయిల అల్లర్లు తగ్గిపోయాయని పోలీసులు చెబుతున్నారు. లేకపోతే పీకలదాకా తాగి, అది దిగేవరకు ఏదో ఒక గొడవ తో పోలీసులకు తలనొప్పి తెచ్చిన ఘటనలు అనేకం ఉన్నాయి. షాపులో సమయాలు మార్చడం తోనే సరిపెట్టకుండా, బెల్ట్ చెప్పులు కూడా లేకుండా చేశారు. దీంతో మద్యపాన ప్రియులు దానిపై మోజు తగ్గించుకుంటూ వస్తున్నారు.

అదేసమయంలో ఈ లాక్ డౌన్ పుణ్యమా అని మద్యం దుకాణాలు బంద్ అయ్యాయి. దీంతో ప్రైవేటు గా ఉన్న నిల్వలు గత 20 రోజులుగా అయిపోవడంతో మందుబాబుల స్వయం ప్రకటిత మద్యపాన ఉపవాసాన్ని పాటిస్తున్నారు. ఇంటిపట్టున కుటుంబ సభ్యులతో గడుపుతుండటం తో మందు తాగాలనే ఆలోచన రావడం లేదని పలువురు చెప్పడం హర్షించదగ్గ పరిణామం. ఇటువంటి ఆలోచనలో ఉన్న వారిని పూర్తిగా మధ్య మాన్పించేందుకు చర్యలు చేపడితే సీఎం జగన్ మద్యపాన నిషేధం హామీ వైపు విజయవంతంగా అడుగులు వేయగలుగుతారు. డి అడిక్షన్ సెంటర్లు, కౌన్సిలింగ్ తదితర చర్యలను ఆన్లైన్ ద్వారా నైనా అందుబాటులోకి తీసుకురావాలి. ప్రాణాలు హరించే చేస్తోందన్న ఆందోళన ఒకవైపు ఉన్న కరోనా కారణంగా మద్యం బానిసలు గా మారిన వారు దాని నుంచి బయటపడేందుకు ఒక అవకాశం వచ్చిందని ఆనందపడొచ్చు కూడా.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి