iDreamPost

‘లవ్ స్టోరీ’కి లాక్ డౌన్ బెనిఫిట్

‘లవ్ స్టోరీ’కి లాక్ డౌన్ బెనిఫిట్

అదేంటి సినిమాకు వైరస్ నష్టం చేస్తుంది కానీ బెనిఫిట్ కావడం ఏమిటనే సందేహం రావడం సహజం. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య సాయి పల్లవి జంటగా రూపొందుతున్న లవ్ స్టోరీ షూటింగ్ చివరి దశలో ఉండగా లాక్ డౌన్ బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. అప్పటికే ఓ రెండు సార్లు రిలీజ్ డేట్ విషయంలో వెనుకడుగు వేసిన యూనిట్ ఆ తర్వాత మే లేదా జులైలో వస్తామని చూచాయగా మార్చ్ లోనే చెప్పింది. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. పనులన్నీ ఆగిపోయాయి.

కానీ దీన్ని కూడా అవకాశం వాడుకుని ఇప్పటిదాకా పూర్తయిన సినిమా రషెస్ ని శేఖర్ కమ్ముల బాగా లోతుగా విశ్లేషిస్తూ పార్ట్ టైం ఎడిటర్ లాగా తగిన జాగ్రత్తలతో ఎక్కడెక్కడ కటింగ్స్ ఉండాలి, మార్పులు జరగాలి అనేదాని మీద ఫుల్ వర్క్ చేస్తున్నారట. ఇప్పటికే వచ్చేసిన ఆడియో సింగల్ హిట్ అయ్యింది.మ్యూజిక్ విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకునే శేఖర్ లవ్ స్టొరీకి సైతం మంచి మెలోడీస్ చేయించారట. ఇందులో ఫిదా తరహాలో హీరో పాత్ర కంటే సాయి పల్లవి రోల్ కే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారని చైతు ఈ విషయంగా అసంతృప్తితో ఉన్నారని గత రెండు మూడు రోజులుగా ప్రచారం జరుగుతోంది.

ఈ కామెంట్ టీం దాకా వెళ్ళింది. వాళ్లు ఖండిస్తున్నారు కాని శేఖర్ కమ్ముల ఇలాంటివి విడుదలయ్యాక కూడా రిపీట్ కాకుండా ఫైనల్ కట్ ని ఒకటికి రెండుసార్లు పక్కాగా చెక్ చేసుకుని డిసైడ్ చేయాలని ఫిక్స్ అయ్యారట. ఫిదా టైంలో వరుణ్ తేజ్ ఇమేజ్ కి ఇప్పుడు చైతు మార్కెట్ కి చాలా తేడా ఉంది. కేవలం సాయి పల్లవి మీదే సినిమా నడపడం కష్టం. ఇబ్బంది కుడా. అందుకే అలాంటి ఫీడ్ బ్యాక్ వచ్చే అవకాశం లేకుండా స్క్రిప్ట్ స్టేజిలోనే శేఖర్ కమ్ముల తీసుకున్న కేర్ తెరమీద మంచి అవుట్ పుట్ వచ్చేలా చేస్తుందని ఇన్ సైడ్ టాక్. అటుఇటుగా దసరాకు లేదా ఆపై మాత్రమే లవ్ స్టొరీ విడుదలయ్యే ఛాన్స్ ఉంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి