iDreamPost

లాక్ డౌన్ తో ఇబ్బంది పడుతున్నవారి కోసం …అన్నదాత పెద్ద మనసు

లాక్ డౌన్ తో ఇబ్బంది పడుతున్నవారి కోసం …అన్నదాత పెద్ద మనసు

దేశానికి వెన్నెముక రైతులే.. దేశం ఆకలి తీర్చేది రైతులే.. ప్రజల కడుపు నింపే రైతుకు ఆకలి విలువ తెలుసు. కరోనా వైరస్ కారణంగా దేశంలో లాక్ డౌన్ విధించిన కారణంగా అనేకమంది పేదవారికి ఇబ్బందులు మొదలయ్యాయి. అలాంటి పేదల ఆకలిని తీర్చడానికి ఆదిలాబాద్ రైతు ముందుకొచ్చి విరాళం ప్రకటించి తన ఉదారతను చాటుకున్నాడు.

వివరాల్లోకి వెళితే దేశంలో కరోనా వైరస్ వ్యాపిస్తున్న కారణంగా ప్రధాని మోడీ దేశం మొత్తం లాక్ డౌన్ చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో కొందరు పేదలకు కష్టకాలం మొదలైంది. డైలీ పనికి వెళ్తే తప్ప పూట గడవని పేదల పరిస్థితి మరీ అద్వాన్నంగా ఉంది. అలాంటి పేదల ఆకలిని గుర్తించి ఒక రైతు 50,000 విరాళం అందించడానికి ముందుకు రావడం విశేషం.. ఆదిలాబాద్ కి చెందిన మోర హన్మాండ్లు అనే రైతు కొందరు పేదలకు దేశంలో లాక్ డౌన్ విధించిన కారణంగా తినడానికి తిండి లభించడం లేదని వార్తల ద్వారా తెలుసుకుని 50,000 చెక్ అందజేశాడు.

తనకున్న నాలుగున్నర ఎకరాలలో పంట బాగా పండిందని, ఇటీవలే పంట డబ్బులు చేతికి వచ్చాయని వార్తల ద్వారా పేదలకు తిండి దొరకడం లేదన్న సంగతి తెలుసుకున్నానని అందుకే నాకు పంట ద్వారా వచ్చిన డబ్బులో కొద్దిమొత్తం విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నాను అని మోర హన్మాండ్లు తెలిపారు.

ఒక రైతు తనకున్న కొద్దిమొత్తంతో పేదల ఆకలి తీర్చడానికి ముందుకురావడంతో పలువురు ప్రశంసిస్తున్నారు.. ఇప్పటికే పలువురు హీరోలు, దర్శకులు, రాజకీయ నాయకులు కరోనాపై పోరాటానికి భారీగా విరాళాలు ఇస్తున్న విషయం తెలిసిందే…ఏది ఏమైనా రైతు ఇచ్చిన స్పూర్తితో మరికొందరు సాయం చేయడానికి ముందుకొస్తారు అనడంలో ఎలాంటి సందేహం లేదు..

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి