iDreamPost

ఇండియా పేరు భారత్ గా మారబోతుందా? ప్రపంచంలో పేరు మార్చుకున్న దేశాలు ఇవే!

  • Published Sep 08, 2023 | 10:56 AMUpdated Sep 08, 2023 | 11:09 AM
  • Published Sep 08, 2023 | 10:56 AMUpdated Sep 08, 2023 | 11:09 AM
ఇండియా పేరు భారత్ గా మారబోతుందా? ప్రపంచంలో పేరు మార్చుకున్న దేశాలు ఇవే!

దేశ వ్యాప్తంగా గత కొంత కాలంగా ఒకే విషయంపై చర్చలు జరుగుతున్నాయి. త్వరలో ఇండియా పేరు భారత్ గా మార్చబోతున్నారా? అనే విషయం. దీనికి కారణం దేశ రాజధాని వేధికగా రేపు జరగబోయే జీ – 20 సదస్సు కోసం రాష్ట్రపతి పేరిట విడుదలైన ఇన్విటేషన్ లో ‘ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా’కు బదులుగా ‘ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’ అని ఉండటంతో త్వరలో ఇండియా పేరు భారత్ గా మారుస్తారని చర్చలు ప్రపంచ వ్యాప్తంగా చర్చలు జరుగుతున్నాయి. అయితే మొదటి సారిగా అధికారిక ఆహ్వాన పత్రంపై ఇండియాకు బదులుగా భారత్ అని రాయడం ఇదే మొదటి సారి కావడంతో రక రకాల ఊహాగానాలు మొదలయ్యాయి. ఇక ప్రపంచంలో పేరు మార్చుకున్న దేశాల గురించి తెలుసుకుందాం.

ప్రపంచంలో కొన్ని దేశాలు కొన్ని దేశాలు జాతీయ, రాజకీయ, బ్రాండింగ్ కారణాల వల్ల పేర్లు మార్చుకున్నాయి. ఇండియా పేరు ను భారత్ గా మార్చే అంశంపై అధికార, విపక్షాల మధ్య పెద్ద యుద్దమే నడుస్తుంది. మరోవైపు సామాన్య ప్రజల నుంచి కూడా ఈ అంశంపై మిశ్రమ స్పందన వస్తుంది. వాస్తవానికి ఇండియా పేరు ను భారత్ గా మార్చాలన్న విషయం ఇప్పటిది కాదు.. గత కొన్ని సంవత్సాల నుంచి ఈ అంశంపై తర్జన భర్జన జరుగుతూనే ఉంది. గతంలో ఆర్​ఎస్​ఎస్​ చీఫ్​ మోహన్​ భగవత్​.. దేశ పేరును మార్చాలని తన అభిప్రాయాలను పలుమార్లు వెల్లడించారు. 2022లో ఆగస్టు 15న ఎర్రకోటపై జాతీయ జెండా ఎగురవేసిన ప్రధాని మోదీ తన ప్రసంగంలో ఇండియాను భారత్ గా మార్చాలని పరోక్షంగా వ్యాఖ్యానించారు.

శ్రీలంక పాత పేరు సిలోన్ :
దక్షిణ ఆసియాలో ఒక చిన్న ద్వీపం. బ్రిటీష్, పోర్చుగీస్ పాలనలో శ్రీలంకను సిలోన్ గా పిలిచేవారు. తమ దేశంలో వలసలను పోగొట్టాలని.. తమది స్వతంత్ర దేశం అని చాటి చెప్పేందుకు సిలోన్ పేరుని 1971 తర్వాత శ్రీలంకగా పేరు మార్చారు. ఈ దేశం గణతంత్ర రాజ్యంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందుతూ వచ్చింది. శ్రీలంక గా పేరు మార్చిన తర్వాత ఆ పేరు బాగా పాపులర్ అయ్యింది.

మయన్మార్ పాత పేరు సియామ్:
1939లో సియామ్ పేరు థాయ్‌లాండ్ గా మార్చారు. ఇక్కడ సంస్కృతి, సంప్రదాయాల ప్రకారం సియామ్ పేరు మార్చాలని డిమాండ్ పెరగడంతో థాయ్‌లాండ్‌ మార్చినప్పటికీ 1946 నుంచి 48 వరకు సియామ్ అనే పిలిచారు. కానీ అధికారికంగా ‘కిండ్ డమ్ ఆఫ్ థాయ్‌లాండ్’ అనే పేర్చమార్చడం గమనార్హం. అయితే ఇప్పటికీ అక్కడ అదే పేరుతో పిలుస్తున్నారు. సియామ్ అంటే బంగారుభూమి అని అర్థం.

మయన్మార్ పాత పేరు బర్మా:
బర్మా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ప్రపంచ వ్యాప్తంగా బర్మా పేరు ఎక్కువగా వాడుకలో ఉన్నప్పటికీ.. భాషాపరమైన అవసరం కోసం దీన్ని మయన్మార్ గా మార్చారు. ప్రస్తుతం అధికారికంగా బర్మాను మయన్మార్ అంటున్నారు.

ఇరాన్ పాత పేరు పర్షియా:
ఒకప్పుడు ప్రపంచ దేశాల్లో పర్షియా పేరు మారుమోగింది. పర్షియా పేరు ఎక్కువగా భారత చరిత్ర పుస్తకాల్లో, గ్రంథాల్లో ఎక్కువగా వినిపిస్తుంది. మన భారత దేశంలో చాలా వరకు కట్టడాలు ఇండో-పర్షియన్ శైలి ఉంటాయి. అయితే పర్షియా పేరు ని 1935లో ఇరాన్ గా మార్చారు.

కంబోడియా :
ఈ దేశం పేరు చరిత్రలో అనేక మార్లు మార్చడం జరిగింది. డొమొక్రటిక్ ఆఫ్ కంపూచియా, ఖేర్మ్ రిపబ్లిక్, స్టేట్ ఆఫ్ కాంబోడియా, కింగ్ డమ్ ఆఫ్ కాంబోడియా అంటూ ఎన్నో పేర్లు మార్చారు. ఈ దేశంలో అంగ్‌కోర్‌వాట్ అనే హిందూ దేవాలయం ఉంది.. ఇది ప్రపంచంలోకెల్లా పెద్దది.

తుర్కియే పాత పేరు టర్కీ:
టర్కీ దేశం గురించి అందరికీ తెలిసిందే. ఈ దేశ అధ్యక్షుడు రెసెపే ఎర్డోగాన్ తమ దేశ నాగరికత, సంస్కృతి విలువలు మరింత ప్రతిబింభించేలా ఉండాలని టర్కీ పేరును తుర్కియేగా మారుస్తున్నట్లు ప్రకటించారు. ఇక టర్కీ అనేగానే వెంటనే టర్కీ కోడి గుర్తుకు వస్తుంది.

రిపబ్లిక్ ఆఫ్ కెబో వెర్డే పాత పేరు కెప్ వెర్డే :
ఈ దేశం అట్లాంటిక్ మహాసముద్రంలో ఉన్న ద్వీపాల సమూహం. 2013 లో తమ అధికారిక భాష పోర్చుగీస్ ని గౌరవించే నేపథ్యంలో కెప్ వెర్డే కాస్త పోర్చుగీస్ స్పెల్లింగ్ తో రిబ్లిక్ ఆఫ్ కెబో వెర్డేగా మార్చారు. దీంతో అక్కడ ఉన్న భాషా వైరుద్యాలను తొలగించారు.

డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో :
ఈ దేశం పేరు కూడా పలుమార్లు మార్చడం జరిగింది. కాంగో లియోపోల్డివిల్లు, రిపబ్లిక్ ఆఫ్ జైర్, కాంగో ఫ్రీ స్టేట్ నుంచి బెల్చియన్ కాంగ్ అంటూ పేర్లు మారాయి. మొత్తానికి 1997 లో డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ ది కాంగో గా పేరు మార్చి ప్రస్తుతం అదే కంటిన్యూ చేస్తున్నారు.

చెఖియా పాత పేరు చెక్ రిపబ్లిక్ :
చెక్ రిపబ్లిక్ పేరును 2016లో ఏప్రిల్ చెఖియా మార్చారు. ఇక్కడ క్రీడా వేదికల్లో ప్రపంచ దేశాలు గుర్తించాలని, అంతర్జాతీయంగా మార్కెటింగ్ లో గుర్తింపు రావాలని చెక్ రిపబ్లిక్ పేరును కాస్త చెఖియాగా మారాడం జరిగింది.

ది నెదర్లాండ్స్ పాత పేరు హాలండ్:
హాలండ్ దేశం పేరు 2020 జనవరిలో ది నెదర్లాండ్స్ గా మార్చారు. దేశ ప్రచార ప్రయోజనాలు, అంతర్జాతీయ మార్కెటింగ్ వ్యవహారాల విషయంలో గొప్ప పేరు రావాలని, ప్రపంచ వ్యాప్తంగా తమ గుర్తింపు మరింత పెరగాలని ఈ దేశం ది నెదర్లాండ్ గా మార్చారు.

ఎస్వటినీ పాత పేరు స్వాజిలాండ్:
ఆఫ్రికా దేశం స్వాజిలాడ్ ను వారసత్వానికి అద్దం పట్టే విధంగా ఎస్వటినిగా పేరు మార్చడం జరిగింది. ఇక ఎస్వటిని అంటే ‘ది ల్యాండ్ ఆఫ్ స్వాజీస్ ’అర్థం. అయితే స్వాజీలాండ్ పేరు స్విట్జర్లాండ్ పేరు పొలి ఉండటం కొంత కన్ఫ్యూజ్ గా ఉంటుంది. ఏది ఏమైనా తమ భాష పదమైన ఎస్వటిగా స్వాజిలాండ్ ని పేరు మార్చారు.

ఐర్లాండ్ పాత పేరు ఐరీష్ ఫ్రీ స్టేట్ :
1937లో ఐర్లాండ్ కొత్త రాజ్యాంగాన్ని అమలు చేసింది. ఈ క్రమంలోనే ఐరీష్ ఫ్రీ స్టేట్ ప్లేస్ లో కొత్తగా ఐర్లాండ్ అని చేర్చారు.

రిపబ్లిక్ ఆఫ్ నార్త్ మెసిడోనియా పాత పేరు మెసిడోనియా:
2019 ఫిబ్రవరిలో మెసిడోనియా దేశం పేరును రిపబ్లిక్ ఆఫ్ నార్త్ మెసిడోనియా‌గా మార్చుకుంది. నాటోలో చేరడం కోసం గ్రీస్ లో మెసిడోనియా ప్రాంతం ఇప్పుడు రిపబ్లిక్ ఆఫ్ నార్త్ మెసిడోనియా కొనసాగుతుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి