iDreamPost

గుజరాత్‌ లో అకాల వర్షం.. పిడుగుపాటుకు 20 మంది దుర్మరణం!

  • Published Nov 27, 2023 | 12:44 PMUpdated Nov 27, 2023 | 12:44 PM

ప్రస్తుతం బంగాళాకాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉరుములు, మెరుపులు, వడగండ్ల వానతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

ప్రస్తుతం బంగాళాకాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉరుములు, మెరుపులు, వడగండ్ల వానతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

  • Published Nov 27, 2023 | 12:44 PMUpdated Nov 27, 2023 | 12:44 PM
గుజరాత్‌ లో అకాల వర్షం.. పిడుగుపాటుకు 20 మంది దుర్మరణం!

దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వాతావరణంలో మార్పులు సంభవించాయి. పలు చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతం, అరెబియా సంద్రంలో ఏర్పడుతున్న అల్పపీడనం, అవర్తనాల ప్రభావం దేశంలోని పలు రాష్ట్రాల చూపుతుంది. ఈ క్రమంలోనే పలు ప్రాంతాల్లో వానలు పడుతున్నాయి. ఆదివారం గుజరాత్ రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వర్షం బీభత్సం కొనసాగించింది. అకాల వర్షంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా వరి సాగు చేస్తున్న రైతులు పంట కోతకు వచ్చే సమయంలో ఇలా అకాల వర్షం పడటంతో భయాందోళన వ్యక్తం చేస్తున్నార. కొన్ని చోట్ల వరి కోతలు అయ్యాయి.. ఈ సమయంలో వర్షాలు పడితే భారీ నష్టం తప్పదని కన్నీరు పెట్టుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల ఉరుములు, మెరుపులుతో పాటు పిడుగులు పడ్డాయి. వివరాల్లోకి వెళితే..

గుజరాత్ లో అకాల వర్షం బీభత్సం సృష్టించాయి. ఆదివారం కురిసిన వర్షాల కారణంగ జనజీవనం అతలాకుతలం అయ్యింది. లోతట్టు ప్రాంతాలన్నీ చెరువులను తలపించాయి. ప్రధాన రహదారుల్లో తీవ్ర ట్రాఫిక్ అంతరాయం ఏర్పడి ప్రజలు ఇబ్బందులు పడ్డారు.  గంటల కొద్ది కురిసిన వడగండ్ల వానతో రాష్ట్రంలో రైతులు భారీగా పంటనష్టపోయారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో పిడుగుపాటుతో దాదాపు 20 మంది వరకు ప్రాణాలు కోల్పోయాయినట్లు గుజరాత్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ అధికారులు తెలిపారు. గుజరాత్ రాష్ట్ర వ్యాప్తంగా 254 తాలూకాల్లోని 234 చోట్ల ఉరుములు, మెరుపులతో కూడి భారీ వర్షాలు పడ్డాయని అధికారులు తెలిపారు. భారీ వర్షాల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా అలర్ట్ జారీ చేసినట్లు అధికారులు వెల్లడించారు. సురేంద్రనగర్, ఖేడా, సూరత్, తాపీ, భరూచ్ ప్రాంతాల్లో ఏకంగా 16 గంటలు రికార్డు స్థాయిలో 50 – 117 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యిందని.. మోర్బీ, రాజ్ కోట్ జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో వడగండ్ల వర్షం పడిందని రాష్ట్ర ఎమర్జెన్సీ ఆపరేషన్‌ సెంటర్‌ అధికారులు తెలిపారు.

దాహూద్ జిల్లాలో పిడుగుపాటుకు నలుగురు, తాపీలో ఇద్దరు, భరూచ్ లో ముగ్గురు, అమ్రేలీ, సూరత్, అహ్మదాబాద్, సురేంద్రనగర్ తదితర ప్రాంతాల్లో పిడుగు పడి 11 మంది మరణించారు. పిడుగుల కారణంగా పలువురు మరణించడం అందరినీ కలచివేసింది. పిడుగుపాటు వల్ల తమవారిని కోల్పోవడంతో బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. గాయపడిన వారిని హాస్పిటల్ లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. వర్షాలతో పలువురు మృతి చెందడంపై కేంద్ర హూంశాఖామంత్రి అమిత్ షా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.. చనిపోయిన వారికి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధించారు. వారి కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటించారు. పిడుగుపాటులో గాయపడ్డవారికి మెరుగైన చికిత్స అందించే విధంగా చూస్తామని హామీ ఇచ్చారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి