iDreamPost

రిస్కుల్లో పడుతున్న పూరి విజయ్ సినిమా

రిస్కుల్లో పడుతున్న పూరి విజయ్ సినిమా

మొదటివారం పూర్తయ్యేలోపే బాక్సాఫీస్ రన్ ని చివరికి తెచ్చేసుకున్న లైగర్ దెబ్బ మాములుగా లేదు. సుమారు అరవై కోట్ల దాకా నష్టం తేవడం దాదాపు కన్ఫర్మ్ అయినట్టే. చాలా చోట్ల జీరో షేర్లు వస్తున్నట్టు ట్రేడ్ రిపోర్ట్. 9న బ్రహ్మాస్త్ర వచ్చే టైంకి కంప్లీట్ వాష్ అవుట్ ఖాయమని అంచనా. ఇదిలా ఉండగా దీని ప్రభావం నేరుగా ఇదే కాంబోలో రూపొందుతున్న జనగణమన మీద పడుతోంది. ఈ ప్రాజెక్టులో నిర్మాణ భాగస్వామిగా ఉన్న మైహోమ్ సంస్థ ఇందులో నుంచి తప్పుకున్నట్టుగా ఫిలిం నగర్ టాక్. ఇప్పటికే పూర్తయిన కొంత భాగంతో పాటు ప్రీ ప్రొడక్షన్ పనులకు గాను ఇరవై కోట్ల దాకా ఆల్రెడీ ఖర్చు పెట్టేశారు. కారణాలు తెలియదు కానీ డ్రాప్ అయ్యారనే మాట వినిపిస్తోంది

దీనికి సంబంధించిన అఫీషియల్ అప్డేట్ ఇంకా రాలేదు కానీ ప్రచారమైతే జోరుగా ఉంది. ఇది లీకయ్యాక ఖండిస్తూ ఎలాంటి ప్రకటన రాకపోవడం పలు అనుమానాలు రేకెత్తిస్తోంది. లైగర్ బ్లాక్ బస్టర్ అవుతుందనే నమ్మకంతో పూరి జనగణమణని భారీ ఎత్తున ప్లాన్ చేసుకున్నారు. బడ్జెట్ కూడా అమాంతం పెంచేశారు. మిలిటరీ బ్యాక్ డ్రాప్ ఎవరూ టచ్ చేయని పాయింట్ తో రూపొందుతోందని గతంలోనే ప్రచారం జరిగింది. పూజా హెగ్డే హీరోయిన్ గా ఎంపిక చేసుకుని వచ్చే ఏడాది వేసవి లోగా షూటింగ్ పూర్తి చేసేలా షెడ్యూల్స్ సెట్ చేసుకున్నారు. తీరా చూస్తే ఇప్పుడీ న్యూస్ చక్కర్లు కొడుతున్నాయి. ఇది నిజమా కదా అనేది కూడా ప్రొడక్షన్ హౌస్ తేల్చేస్తే బెటర్.

మొత్తానికి ఒక డిజాస్టర్ ఎందరి ప్లానింగ్స్ ని దెబ్బ తీస్తుందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఆ మధ్య ఆచార్య ఇలాంటి ఫలితమే అందుకుంటే దాని తాలూకు నష్టాల సెటిల్ మెంట్ల కోసం కొరటాల శివ నెలల తరబడి విలువైన సమయాన్ని ఖర్చు పెట్టాల్సి వచ్చింది. దీని వల్లే జూనియర్ ఎన్టీఆర్ తో మొదలుపెట్టాల్సిన సినిమాని ఆలస్యం చేస్తూ వచ్చారు. మెగా ఫ్లాప్ తర్వాత స్క్రిప్ట్ ని మరోసారి మొత్తం చెక్ చేసుకోవాల్సిన అవసరం తలెత్తింది. ఇదే పరిస్థితి రవితేజ, నితిన్ దర్శకులకు సైతం అనుభవమే. పూరి జగన్నాధ్ సైతం మినహాయింపుగా నిలవలేకపోయారు. ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ తాలూకు కిక్ మరీ ఈ స్థాయిలో దిగిపోతుందని ఎవరు మాత్రం ఊహించారు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి