iDreamPost

LIC: మహిళల కోసం అదిరిపోయే పాలసీ.. రోజుకు రూ.87 కడితే రూ.11 లక్షలు రాబడి!

  • Published Feb 15, 2024 | 12:10 PMUpdated Feb 15, 2024 | 12:10 PM

మహిళల కోసం ఒక అదిరిపోయే పాలసీని ఎల్​ఐసీ తీసుకొచ్చింది. అసలు ఏంటా పాలసీ, దాని స్పెషాలిటీ ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం..

మహిళల కోసం ఒక అదిరిపోయే పాలసీని ఎల్​ఐసీ తీసుకొచ్చింది. అసలు ఏంటా పాలసీ, దాని స్పెషాలిటీ ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published Feb 15, 2024 | 12:10 PMUpdated Feb 15, 2024 | 12:10 PM
LIC: మహిళల కోసం అదిరిపోయే పాలసీ.. రోజుకు రూ.87 కడితే రూ.11 లక్షలు రాబడి!

దేశంలో అతిపెద్ద ప్రభుత్వ బీమా కంపెనీగా లైఫ్​ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ)ను చెప్పొచ్చు. ఈ సంస్థ ప్రజల కోసం ఎన్నో రకాల పాలసీలను తీసుకొస్తోంది. ముఖ్యంగా మహిళల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త ప్లాన్స్​ను ప్రవేశపెడుతోంది. కానీ వాటి గురించి ఎక్కువ మంది కస్టమర్లకు తెలియదు. ఎల్​ఐసీలో డబ్బులు పెడితే భారీగా రాబడి వస్తుందని, ఇది ఎంతో ఉపయోగకరమని చాలా మందికి తెలియదు. అయితే ఎల్ఐసీ మాత్రం కొత్త పాలసీలను తీసుకొస్తూ.. వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తూనే ఉంది. తాజాగా స్త్రీల కోసం ఒక ప్లాన్​ను ప్రవేశపెట్టింది. ఆ ప్లాన్ పేరు ఎల్​ఐసీ ఆధార్ శిలా ప్లాన్. దీని గురించిన పూర్తి సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం..

పిల్లలు, వృద్ధుల కోసం ఎక్కువగా పాలసీలను తీసుకొచ్చే ఎల్​ఐసీ.. తాజాగా మహిళల కోసం ప్రత్యేకంగా ఓ ప్లాన్​ను రూపొందించింది. దీని పేరు ఎల్​ఐసీ ఆధార్ శిలా. స్త్రీలు, బాలికల కోసం ఈ స్కీమ్​ను తీసుకొచ్చింది. ఇది నాన్ లింక్డ్ పర్సనల్ ఇన్సూరెన్స్ ప్లాన్. ఇందులో గనుక పెట్టుబడి పెడితే దీర్ఘకాలంలో పాలసీదారులు మంచి లాభాలు పొందొచ్చు. ఈ ప్లాన్​లో 8 సంవత్సరాల బాలికల నుంచి 55 సంవత్సరాల వరకు వయసు ఉన్న మహిళలు పెట్టుబడి పెట్టొచ్చు. ఇందులో 10 నుంచి 20 ఏళ్ల వరకు ఇన్వెస్ట్​ చేయొచ్చు. పాలసీ మెచ్యూరిటీ కోసం బీమా చేసిన వారి గరిష్ట వయసు 70 ఏళ్లలోపు ఉండాలి. ఒక మహిళ తనకు 55 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఈ ప్లాన్​లో పెట్టుబడి మొదలుపెడితే ఆమె 15 సంవత్సరాలు మాత్రమే ఇందులో డబ్బులు పెట్టొచ్చు.

ఎల్​ఐసీ ఆధార్ శిలా ప్లాన్​లో ప్రీమియం వార్షిక, అర్థ వార్షిక, త్రైమాసిక లేదా నెలవారీ ప్రాతిపదికన డబ్బులు చెల్లించొచ్చు. అధిక రాబడులు రావాలంటే ఈ పాలసీలో డబ్బులు ఇన్వెస్ట్ చేయడం బెటర్ అని ఎక్స్​పర్ట్స్ అంటున్నారు. ఇందులో ఒక మహిళ రోజుకు రూ.87 డిపాజిట్ చేస్తే ఫ్యూచర్​లో ఆమెకు భారీ రాబడి వస్తుంది. రోజుకు రూ.87 చొప్పున నెలకు రూ.2,610, ఏడాదిలో మొత్తం రూ.31,320 కట్టాల్సి ఉంటుంది. అలా ఈ పాలసీలో 10 సంవత్సరాలు డబ్బుల్ని డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. పది సంవత్సరాల్లో మీరు ఈ పాలసీలో రూ.3.13 లక్షలు డిపాజిట్ చేస్తారు. మీకు 75 సంవత్సరాల వయసులో ఈ పాలసీ మెచ్యూరిటీ మీద రూ.11 లక్షల కంటే ఎక్కువ మొత్తాన్ని అందుకుంటారు. మరి.. ఎల్​ఐసీ ఆధార్ శిలా ప్లాన్ మీకెలా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి