iDreamPost

LIC శుభవార్త. రోజు రూ.87 కడితే.. ఒకేసారి రూ.11 లక్షల రాబడి!

ప్రపంచంలో మహిళలు ఇప్పుడు అన్ని రంగాల్లో మగవారితో సమానంగా పోటీ పడుతున్నారు. మహిళల ఆర్థికంగా ఎదగడానికి ప్రభుత్వాలు ఎన్నో స్కీములు అమలు చేస్తున్నారు. ఇక ప్రైవేట్ వ్యవస్థలు సైతం మహిళా సాధికారత కోసం పలు స్కీములు తీసుకువస్తున్నారు.

ప్రపంచంలో మహిళలు ఇప్పుడు అన్ని రంగాల్లో మగవారితో సమానంగా పోటీ పడుతున్నారు. మహిళల ఆర్థికంగా ఎదగడానికి ప్రభుత్వాలు ఎన్నో స్కీములు అమలు చేస్తున్నారు. ఇక ప్రైవేట్ వ్యవస్థలు సైతం మహిళా సాధికారత కోసం పలు స్కీములు తీసుకువస్తున్నారు.

LIC శుభవార్త. రోజు రూ.87 కడితే.. ఒకేసారి రూ.11 లక్షల రాబడి!

దేశంలో ఇప్పుడు మహిళలు అన్ని రంగాల్లో మగవారితో సమానంగా ముందుకు సాగుతున్నారు. విద్య, వైద్య, సాంకేతిక, రాజకీయ రంగాల్లో తమ సత్తా చాటుతున్నారు. మహిళల ఆర్థిక లక్ష్యాలు, అవసరాలు తీర్చడానికి కొన్ని సంస్థలు కూడా ముందుకు వస్తున్నాయి. అలాంటి వాటిలో ఎల్ఐసీ ఒకటి. మహిళల ఆర్థిక అవసరాల కోసం ప్రత్యేకంగా రూపొందించిన అద్భుతమైన లైఫ్ సెక్యూరిటీ ప్లాన్ ‘ఆధార్ శిలా పాలసీ’ ఒకటి ప్రవేశ పెట్టింది. ఎల్ఐసీ ఆధార్ శిలా ప్లాన్ అనేది నాన్ లింక్ చేసిన వ్యక్తిగత భీమా పథకం. ఇది ప్రత్యేకంగా మహిళల పాలసీదారుల కోసం మాత్రమే రూపొందించడం పథకం. పూర్తి వివరాల్లోకి వెళితే..

దేశంలోని ప్రముఖ బీమా కంపెనీలో ఒకటి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ). పురుషులు, మహిళలు, చిన్నారుల కోసం ఇప్పటి వరకు ఎన్నో రకాల బీమా పాలసీలు, ప్లాన్ శ్రేణిని అందిస్తు వస్తుంది. ఈ క్రమంలోనే మహిళలకు ఆర్థిక అవసరాలు తీర్చడానికి ఆధార్ శిలా ప్లాన్ ప్రవేశ పెట్టింది. ఇది నాన్ లింక్ చేసిన వ్యక్తిగత జీవిత బీమా పథకం. ఈ బీమా పథకం లైఫ్ ఇన్స్ రెన్స్ ప్లాన్ మార్కెట్ ఎలాంటి రిస్క్ లకు గురి కాకుండా ఆర్థిక రక్షణను అందించడానికి రూపొందించబడింది. ఇది స్టాక్ మార్కెట్ పనితీరు లేదా ఇతర పెట్టుబడులపై ఆధారపడి ఉండదు. ఈ ప్లాన్ లో భాగంగా బీమా చేసిన వ్యక్తికి మెచ్యూర్ అయినపుడు పాలసీ దారులకు, లేదా పాలసీదారు నామినీకి నిర్ణీత మొత్తం అందజేయబడుతుంది. ఈ పథకంలో రోజుకు కేవలం రూ.87 పెట్టుబడి పెడితే.. పాలసీదారు రూ.11 లక్షల వరకు మెచక్యూరిటీ బెనిఫిట్ పొందే అవకాశం ఉంటుంది. చక్రవడ్డీ కారణంగా ఇంత మొత్తంలో ఈజీగా సంపాదించే అవకాశం ఉంటుందని అంటున్నారు.

ఆధార్ శిలా ప్లాన్ గురించి తెలుసుకుందాం.. ఓ 55 ఏళ్ల వయసు గల మహిళ ఆధార్ శిలా ప్లాన్ లో చేరింది అనుకుందాం. 15 ఏళ్ల పాటు పాలసీ కాలానికి రోజువారీగా రూ.87 ప్రీమియం చెల్లిస్తే, సంవత్సరాలనికి రూ.31,755 అవుతుంది. 15 ఏళ్లలో సదరు మహిళ మొత్తం రూ.4,76,325 ప్రీమియంగా చెల్లిస్తుంది. పాలసీ మెచ్యూర్ అయినపుడు బెనిఫిట్ గా రూ.11 లక్షలు అందుకుంటుంది. అంటే ఆమె పెట్టుబడి కంటే రెండింతలు ఎక్కువ అందుకుంటుంది. ఈ స్కీమ్ కి కనీస ప్రవేశ వయసు 8 సంవత్సరాలు ఉంది. గరిష్ట వయోపరిమితి 55 సంవత్సరాలు. పెట్టుబడిదారులు కనీష్ట కాల వ్యవధి పది సంవత్సరాలు. గరిష్టంగా 20 ఏళ్ల పాలసీ కాలవ్యవధిని ఎంచుకోవొచ్చు.. గరిష్ఠ మెచ్యూరిటీ వయసు 70 సంవత్సరాలు. ఇందులో కనిష్ట పెట్టుబడి మొత్తం రూ.75 వేలు, గరిష్టంగా రూ.3 లక్షల పెట్టుబడి వరకు పెట్టవొచ్చు. లాభదాయకమైన ఆదాయాన్ని ఆందించే పథకం అంటున్నారు.

ఈ పాలసీ సరెండర్ విలువను సాధించిన తర్వాత అవసరాలకు లోన్ పొందే అవకాశం ఉంటుంది. ఆ డబ్బును ఏదైనా వ్యక్తిగత లేదా అత్యవసర అవసరాలకు వాడుకునే అవకాశం ఉంటుంది. ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 80 సి, సెక్షన్ 10 (10 డి) కింద మెచ్యూరిటీ బెనిఫిట్ క్లయిమ్ చేసుకునే అవకాశం ఉంటుంది. వార్షిక, నెలవారి, త్రైమాసిక లేదా అర్థ-వార్షిక రీతుల్లో ప్రీమియం చెల్లించే సదుపాయం ఉంది. మెచ్యూరిటీ తర్వాత పాలసీదారుడు కొత్త పాలసీలో ఏక మొత్తంలో మళ్లీ పెట్టుబడి పెట్టే అవకాశం కూడా ఉంటుంది. మహిళలు ఆర్థిక అవసరాలు తీర్చుకోవడానికి ఆధార్ శిలా ప్లాన్ గొప్ప సువర్ణావకాశం అంటున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి