iDreamPost

అదిరిపోయే బిజినెస్.. రూ. 20 వేల పెట్టుబడితో రూ. లక్షల్లో ఆదాయం!

చాలా మందికి వ్యాపారం చేయాలనే కొరిక ఉంటుంది. అయితే పెట్టుబడి విషయంలో భయపడి వెనుకడుగు వేస్తుంటారు. కానీ తక్కువ పెట్టుబడితే ఎక్కువ లాభాలు పొందే బిజినెస్ లు కూడా చాలానే ఉన్నాయి. అలాంటి వాటిల్లో ఒకటి మీ కోసం...

చాలా మందికి వ్యాపారం చేయాలనే కొరిక ఉంటుంది. అయితే పెట్టుబడి విషయంలో భయపడి వెనుకడుగు వేస్తుంటారు. కానీ తక్కువ పెట్టుబడితే ఎక్కువ లాభాలు పొందే బిజినెస్ లు కూడా చాలానే ఉన్నాయి. అలాంటి వాటిల్లో ఒకటి మీ కోసం...

అదిరిపోయే బిజినెస్.. రూ. 20 వేల పెట్టుబడితో రూ. లక్షల్లో ఆదాయం!

నేటికాలంలో వ్యాపారం చేయాలని అనే అనుకునే వారి సంఖ్య బాగా పెరిగి పోయింది. అందుకు అనేక రకాల కారణాలు ఉంటాయి. కొందరు ఉద్యోగాల్లో సరైన జీతం లేకపోవడం,  తీవ్ర ఒత్తిడి ఉండటం వంటి ఇతర కారణాలతో వ్యాపారం వైపు మొగ్గు చూపుతుంటారు. మరికొందరు సొంతంగా బిజినెస్ చేసి నలుగురికి ఉపాధి ఇవ్వాలనే ఆశతో ఉంటారు. అయితే పెట్టుబడికి భయపడి చాలా మంది తమ బిజినేస్ ఆలోచనలకు బ్రేక్ లు వేస్తుంటారు. అయితే సరైన ఆలోచన ఉండాలే కానీ తక్కువ పెట్టుబడితో మంచి లాభాలను పొందే వ్యాపారం చేయొచ్చు. అలాంటి ఓ ఉత్తమ బిజినెస్‌ ఐడియా గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

ఆలోచన ఉండాలే కానీ తక్కువ పెట్టుబడితో కూడా భారీ లాభాలు అర్జించవచ్చని మార్కెట్ నిపుణులు చెబుతుంటారు. అలాంటి వాటిల్లో నిమ్మగడ్డి పెంపక ఒకటి. దీని ద్వారా భారీగా లాభాలను అర్జించవచ్చు. గడ్డితో లక్షల్లో ఆదాయం ఎలా అనే సందేహం మీకు రావచ్చు. కానీ ఆ నిమ్మగడ్డి విలువ, దాని ఉత్పత్తులకు మార్కెట్లో ఉన్న డిమాండ్ లు తెలిస్తే అసలు వదిలి పెట్టారు. నిమ్మగడ్డి సాదాసీదా గడ్డి  అనుకుంటే పొరపాటే. ఇందులో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. అలానే దీని నుంచి సువాసన ఉత్పత్తులు తయారు చేస్తుంటారు. అందుకే నిమ్మగడ్డికి మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. అలానే వివిధ రకాల మెడిసిన్ తయారీలోనూ ఈ గడ్డిని వినియోగిస్తుంటారు.

ఇక ఈ నిమ్మగడ్డి పంట వేసినట్లు అయితే అతి  తక్కువ సమయంలోనే కోతకు వస్తుంది. ఇంకా చెప్పాలంటే.. నాటిని నాలుగు నెలల్లోనే కోతకి వస్తుంది. ఈ గడ్డిని పండించేందుకు ఖాళీ స్థలం అవసరం ఉంటుంది. ఈ నిమ్మగడ్డిని పండించేందుకు కేవలం రూ. 20 వేలు మాత్రమే పెట్టుబడిగా అవుతుంది. ఇక ఈ పంటల్లో ప్రత్యేకత ఏంటంటే ఒకసారి పంట వేస్తే.. 4 నుంచి 6 ఏళ్ల వరకు ఉత్పత్తి వస్తూనే ఉంటుంది. కాబట్టి భూమిని బాగా లోతుగా పలుమార్లు ఇరువైపుల దున్ని బాగా తయారుచేసుకోవాలి. ఒక ఎకర పొలంలో నాటడానికి 15 వేల పిలకలు అవసరం ఉంటాయి. ఇక ఈ నిమ్మగడ్డి నుంచి తీసే నూనెకు అంతర్జాతీయంగా డిమాండ్ ఉంది.

 

Business idea

మనమే సొంతం నూనెను తీసి విక్రయిస్తే మరింత ఎక్కువ లాభం పొందొచ్చు. 100కేజీల నిమ్మ గడ్డి నుంచి ఒక లీటరు నూనె తీయొచ్చు.  ఆ నూనె ధర మార్కెట్‌లో రూ. 1000 నుంచి రూ. 1500 వరకు ఉంటుంది.  అలా చూసినట్ల అయితే ఐదు టన్నుల నిమ్మగడ్డి ద్వారా సుమారు రూ. 3 లక్షల వరకు లాభం పొందొచ్చు. మొత్తంగా ఈ నిమ్మగడ్డి పంట ద్వారా రూ.20వేల పెట్టుబడితో లక్షల్లో ఆదాయం పొందొచ్చని మార్కెట్ నిపుణలు చెబుతున్నారు. అయితే ఏదైనా బిజినెస్ ప్రారంభించే ముందు మార్కెట్ నిపుణుల సలహాలు తీసుకోవడం ఉత్తమం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి