iDreamPost

సెలవు తీసుకున్న మేటినటి జమున

జమున గారి స్వస్థలం కర్ణాటక రాష్ట్రం హంపి. 1936 ఆగస్ట్ 30న నిప్పుని శ్రీనివాసరావు, కౌసల్యదేవిలకు జన్మించారు. వీరిది కులాంతర వివాహం. వ్యాపార రిత్యా వీరి కుటుంబంలో తొలినాళ్ళలోనే గుంటూరు జిల్లా దుగ్గిరాలకు వలస వచ్చేసింది.

జమున గారి స్వస్థలం కర్ణాటక రాష్ట్రం హంపి. 1936 ఆగస్ట్ 30న నిప్పుని శ్రీనివాసరావు, కౌసల్యదేవిలకు జన్మించారు. వీరిది కులాంతర వివాహం. వ్యాపార రిత్యా వీరి కుటుంబంలో తొలినాళ్ళలోనే గుంటూరు జిల్లా దుగ్గిరాలకు వలస వచ్చేసింది.

సెలవు తీసుకున్న మేటినటి జమున

అలనాటి మేటి నటీమణుల్లో ఒకరైన జమున గారు ఇక లేరు. ఇవాళ హైదరాబాద్ లో తన స్వగృహంలో చివరి శ్వాస తీసుకున్నారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆవిడ శివైక్యం చెందటం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. జమున గారి స్వస్థలం కర్ణాటక రాష్ట్రం హంపి. 1936 ఆగస్ట్ 30న నిప్పుని శ్రీనివాసరావు, కౌసల్యదేవిలకు జన్మించారు. వీరిది కులాంతర వివాహం. వ్యాపార రిత్యా వీరి కుటుంబంలో తొలినాళ్ళలోనే గుంటూరు జిల్లా దుగ్గిరాలకు వలస వచ్చేసింది. ఆ సమయంలో అక్కడ వీధి నాటకాలలో ప్రదర్శనలు ఇస్తున్న మహానటి సావిత్రి వీరి ఇంట్లోనే ఆశ్రయం పొందారు. అప్పటి నుంచే ఇద్దరి మధ్య స్నేహం బలపడి దశాబ్దాల పాటు కొనసాగింది

తల్లి ఇచ్చిన సంగీత శిక్షణ జమునకు స్కూల్ లో స్టేజి ఆర్టిస్ట్ గా అనుభవం గడించడానికి ఉపయోగపడింది. 16 ఏళ్ళ వయసుకే డాక్టర్ గరికపాటి రాజారావు తీసిన పుట్టిల్లు ద్వారా మొదటి అవకాశం దక్కింది. మా భూమి నాటకంలో జమున నటన చూసిన ఆయన 1952లో మొదటి ఆఫర్ ఇచ్చారు. అసలు పేరు జానా బాయ్ ని మార్చుకుంది అప్పుడే. అసలు బ్రేక్ 1955 మిస్సమ్మ రూపంలో వచ్చింది. ఎల్వి ప్రసాద్ తీసిన ఈ అద్భుత కళాఖండంలో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ లాంటి హేమాహేమీల మధ్య నటించి మెప్పించారు. అక్కడి నుంచి వెనుదిరిగి చూడాల్సిన అవసరం పడలేదు. తెలుగుతో పాటు తమిళం, కన్నడం, హిందీలో ఎన్నో మంచి సినిమాల్లో జమున హీరోయిన్ గా నటించారు. శ్రీ కృష్ణ తులాభారంలో సత్యభామగా చేసిన నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. గుండమ్మ కథలో గారాబం తలకెక్కిన క్యారెక్టర్ లో జీవించేశారు

జమునగారి భర్త పేరు జూలూరి రమణరావు. ఎస్వి యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా పని చేస్తూ 2014లో కాలం చేశారు. ఇద్దరు సంతానం. అబ్బాయి వంశీ, అమ్మాయి స్రవంతి. 1989లో కాంగ్రెస్ పార్టీ నుంచి రాజమండ్రి ఎంపిగా రాజకీయ ప్రవేశం చేశారు. ఎక్కువ కాలం నిలదొక్కుకోలేకపోయారు. దొంగరాముడు, తెనాలి రామకృష్ణ, దొరికితే దొంగలు, మురళీకృష్ణ, రాముడు భీముడు, ఇల్లరికం, బొబ్బిలియుద్ధ, పూజా ఫలం, తోడు నీడ, రాము, ఉండమ్మా బొట్టు పెడతా, ఏకవీర, మట్టిలో మాణిక్యం, కురుక్షేత్రం జమున గారు నటించిన సూపర్ హిట్స్ లో కొన్ని. చివరిసారిగా అన్నపూర్ణమ్మ గారి మనవడులో కనిపించారు. సుమారు రెండు వందల సినిమాలు ఆవిడ కీర్తిని శాశ్వతం చేశాయి. భౌతికంగా లేకపోయినా జమున లాంటి లెజెండరీ నటీమణులకు మరణం ఉండదు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి