iDreamPost

భారీ ఎమోషన్ల మీద వందల కోట్ల పెట్టుబడి

ముఖ్యంగా బిసి సెంటర్స్ లో ఇవి ఏ మేరకు వర్కౌట్ అవుతాయో చూడాలి. రెండింటి మీద సుమారు రెండు వందల యాభై కోట్ల దాకా థియేట్రికల్ బిజినెస్ ఆధారపడి ఉంది. భూల్ భులయ్య 2 తర్వాత హిట్టు లేక కొట్టుమిట్టాడుతున్న నార్త్ ఇవి ఎలాంటి ఫలితాన్ని ఇస్తాయో

ముఖ్యంగా బిసి సెంటర్స్ లో ఇవి ఏ మేరకు వర్కౌట్ అవుతాయో చూడాలి. రెండింటి మీద సుమారు రెండు వందల యాభై కోట్ల దాకా థియేట్రికల్ బిజినెస్ ఆధారపడి ఉంది. భూల్ భులయ్య 2 తర్వాత హిట్టు లేక కొట్టుమిట్టాడుతున్న నార్త్ ఇవి ఎలాంటి ఫలితాన్ని ఇస్తాయో

భారీ ఎమోషన్ల మీద వందల కోట్ల పెట్టుబడి

ఇంకో రెండు రోజుల్లో బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద బిగ్ క్లాష్ జరగనుంది. అమీర్ ఖాన్ లాల్ సింగ్ చడ్డా, అక్షయ్ కుమార్ రక్షా బంధన్ నువ్వా నేనా అని ఢీ కొనబోతున్నాయి. అయితే అనూహ్యంగా రెండింటి మీద ఆశించిన స్థాయిలో బజ్ లేకపోవడం ట్రేడ్ ని కలవరపెడుతోంది. లాల్ సింగ్ నిన్నటి దాకా అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో కేవలం 25 వేల టికెట్లు అమ్మితే రక్షా బంధన్ దానిలో సగం కనీసం 15 వేలను దాటలేకపోయింది. ఈ రోజు రేపు టైం ఉంది కాబట్టి ఈ నెంబర్స్ లో మార్పులు ఉంటాయి కానీ మొత్తంగా చూసుకుంటే ఆయా హీరోల రేంజ్ కు తగ్గట్టు జనం ఎగబడి టికెట్లు కొనడం లేదని అర్థమైపోయింది. టాక్ రివ్యూస్ చూశాకే వెళ్లాలని డిసైడ్ అవుతున్నారు
Investment of hundreds of crores on huge emotions
రెండూ కలిపి మొదటి రోజు 30 కోట్లు వసూలు చేసినా గొప్పే అనేలా ఉన్నాయి డిస్ట్రిబ్యూటర్ల ముందస్తు అంచనాలు. నిజానికి కెజిఎఫ్ 2, ఆర్ఆర్ఆర్ కన్నా చాలా తక్కువ. ఒకవేళ దేనికైనా పాజిటివ్ టాక్ వస్తే థియేటర్లలో పికప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లేదూ అటుఇటు అయ్యిందంటే మాత్రం మళ్ళీ నిరాశ తప్పదు. హాలీవుడ్ క్లాసిక్ ఫారెస్ట్ గంప్ రీమేక్ గా రూపొందిన లాల్ సింగ్ చడ్డాని హిందీలో కంటే ఎక్కువ అమీర్ తెలుగులోనే ప్రమోట్ చేస్తున్నాడు. చిరంజీవి సమర్పకుడిగా వ్యవహరించడంతో పాటు పబ్లిసిటీ పనుల్లో భాగమవ్వడం, ప్రీమియర్లు వేయిస్తే అక్కడికీ వెళ్లడం లాంటివన్నీ చూసుకుంటున్నారు. మరి ఇది ఏ మేరకు హెల్ప్ అవుతుందో చూడాలి.

ఇక ఫుల్ సిస్టర్ సెంటిమెంట్ తో రూపొందిన రక్షా బంధన్ లో చెల్లెళ్ళకు పెళ్లిళ్లు చేయడమే జీవిత లక్ష్యంగా మారిన ఓ మిఠాయి వ్యాపారి కథగా దీన్ని రూపొందించారు. నిడివి కేవలం 1 గంట 50 నిమిషాలకే పరిమితం చేయడం లెన్త్ పరంగా అడ్వాంటేజ్ అయ్యేలా ఉంది. కాకపోతే ఈ రెండు సినిమాలు హెవీ ఎమోషన్లను ఆధారంగా చేసుకున్నావే. మాస్ కోరుకునే మసాలాలు మచ్చుకు కూడా ఉండవు. ముఖ్యంగా బిసి సెంటర్స్ లో ఇవి ఏ మేరకు వర్కౌట్ అవుతాయో చూడాలి. రెండింటి మీద సుమారు రెండు వందల యాభై కోట్ల దాకా థియేట్రికల్ బిజినెస్ ఆధారపడి ఉంది. భూల్ భులయ్య 2 తర్వాత హిట్టు లేక కొట్టుమిట్టాడుతున్న నార్త్ ఇవి ఎలాంటి ఫలితాన్ని ఇస్తాయో

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి