iDreamPost

లాల్ సింగ్ ని నిషేధించాలి – సోషల్ మీడియా స్టోరీ

లాల్ సింగ్ ని నిషేధించాలి – సోషల్ మీడియా స్టోరీ

ఉన్నట్టుండి సోషల్ మీడియాలో బాయ్ కాట్ లాల్ సింగ్ చద్దా ట్రెండింగ్ ఊపందుకుంది. అదేంటి ఇంకో రెండు నెలల్లో రిలీజ్ పెట్టుకుని అమీర్ ఖాన్ కోరిమరీ వివాదాల్లో ఎందుకు ఇరుక్కున్నాడనుకుంటున్నారా. అలా ఏమి లేదు. ఎప్పుడో కొన్నేళ్ల క్రితం ఇతను చేసిన వ్యాఖ్యలను ఇప్పుడు బయటికి తీసి వైరల్ చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు. ఇండియా ఇన్ టాలరెంట్ (భారతదేశంలో జీవించడం కష్టం)అనేలా చేసిన కామెంట్స్ కి నిరసనగా ఇప్పుడీ ఉద్యమం లేవనెత్తుతున్నారు. అమీర్ ఖాన్ సినిమాలు ఎవరూ చూడొద్దంటూ కావాలంటే ఆ టికెట్ సొమ్మును ఏదైనా చారిటీకో లేదా అనాథలకో పంచమని పిలుపు ఇస్తున్నారు.

అంత పాత వివాదం ఇప్పుడు తవ్వడం ఎందుకనే సందేహం కలగడం సహజం. ఆ టైంలో అమీర్ ఖాన్ అన్న పై మాటలకు నిరసన వ్యక్తం చేసేందుకు ఏ సినిమా రిలీజ్ కాలేదు. 2018లో థగ్స్ అఫ్ హిందుస్థాన్ తర్వాత మళ్ళీ అతను తెరమీద కనిపించలేదు. ఈ లాల్ సింగ్ చద్దా కరోనా వల్ల వాయిదా పడుతూ ఆఖరికి ఆగస్ట్ 11కి లాక్ అయ్యింది. తీరా చూస్తే ఇప్పుడీ లేనిపోని అల్లరి చుట్టుముట్టింది. దీనివల్ల కలిగే నష్టం తీవ్రంగా ఉంటుందని చెప్పలేం కానీ ఒకవేళ అధిక శాతం నెటిజెన్లు పర్సనల్ గా తీసుకుంటే మాత్రం ఎంతో కొంత డ్యామేజ్ జరుగుతుంది. దీన్ని అమీర్ ఖాన్ సీరియస్ గా తీసుకున్నట్టు కనిపించడం లేదు. ప్రస్తుతానికి మౌనంగా ఉన్నారు.

దేశాన్ని వదిలివెళ్లాలని అమీర్ మాజీ భార్య కిరణ్ రావు చేసిన కామెంట్స్ కూడా ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ లాల్ సింగ్ ని ప్రోత్సహించే సమస్యే లేదని అంటున్నారు. 1994లో వచ్చిన హాలీవుడ్ మూవీ ఫారెస్ట్ గంప్ కి రీమేకైన ఈ సినిమాలో నాగ చైతన్య ఓ కీలక పాత్ర చేసిన సంగతి తెలిసిందే. ట్రైలర్ వచ్చి ఇరవై నాలుగు గంటలు కాకముందే ఈ స్థాయిలో నెగిటివిటీ స్ప్రెడ్ కావడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఒకవేళ రిలీజయ్యాక ఒరిజినల్ వెర్షన్ లో సీన్లను లాల్ సింగ్ లో సన్నివేశాలతో పోల్చి ఇంకా ట్రోలింగ్ చేసే అవకాశం ఉంది. అన్నట్టు ఫారెస్ట్ గంప్ ని ఓటిటిలో చూసేవాళ్ల సంఖ్య ఉన్నటుండి పెరిగిందని రిపోర్ట్.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి