iDreamPost

lal singh chaddha అమీర్ ఖాన్ సినిమా మార్నింగ్ షోలకు 15-20% ఆక్యుపెన్సీ; షాక్‌లో బాలీవుడ్

lal singh chaddha అమీర్ ఖాన్ సినిమా మార్నింగ్ షోలకు 15-20% ఆక్యుపెన్సీ; షాక్‌లో బాలీవుడ్

అమీర్ ఖాన్ , కరీనా కపూర్ సినిమాల‌కు ఢిల్లీ, NCR ప్రాంతాల్లో ఫ్యాన్స్ ఎక్కువ‌. అడ్వాన్స్ బుకింగ్ రాకెట్ లా దూసుకెళ్తుంది. ఆ త‌ర్వాతే సౌత్, ఈస్ట్ పంజాబ్, ముంబై ఉంటాయి. అలాంటిది లాల్ సింగ్ చద్దా 1వ రోజు బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన దాని కంటే తక్కువ ఓపెనింగ్స్ వ‌చ్చాయి. అస‌లు అడ్వాన్స్ బుకింగ్ ఓపెనింగ్ లో హుషారులేదు. దీనికితోడు మార్నింగ్ షోల నుంచే ఆసక్తి లేదు. మొత్తంమీద‌ అమీర్ ఖాన్ సినిమా దేశవ్యాప్తంగా 15-20% ఆక్యుపెన్సీని మాత్ర‌మే రికార్డు చేసింది. అమీర్ ఖాన్ సినిమాకు ఇంత త‌క్కువ ఓపెనింగ్‌? ట‌్రేడ్, బాలీవుడ్ రెండింటికి షాక్.

బాలీవుడ్ లోని కొంద‌రు కొందరు ₹16-18 కోట్ల నికర రేంజ్‌లో ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్ ను అంచ‌నావేస్తున్నారు. నిజానికి బ‌జ్ ఉంటే మొద‌టిరోజే 60-70కోట్లతో ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్ రావాల్సిన సినిమా ఇది. భూల్ భూలయ్యా 2 ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్ రూ.14.11 కోట్లు. అలాంటిది లాల్ సింగ్ చ‌ద్దా లాంటి భారీ సినిమాకు ₹12-13 కోట్ల నికర క‌లెక్ష‌న్స్ అంటే చాలా తక్కువ. ఒక‌వేళ ప‌దికోట్ల క‌న్నా త‌క్కువ క‌లెక్ష‌న్స్ అంటే డిజాస్ట‌ర్ కిందే లెక్క‌.

లాల్ సింగ్ చ‌ద్దాకు క‌లెక్ష‌న్స్ లేవంటే ఎలా చెప్పాలో బాలీవుడ్ కి అర్ధంకావ‌డంలేదు. ఎక్క‌డ లోపం? సినిమా బాగాలేదా? ఆ విష‌యం తేలాలంటే ఫ‌స్ట్ షోకైనా టిక్కెట్లు తెగాలి క‌దా! అస‌లు ఓపెనింగ్స్ లేవు. అడ్వాన్స్ బుకింగ్ అంత‌క‌న్నా లేవు. మాస్ , యూత్ లో ప్రీ-రిలీజ్‌తో ఆసక్తి లేకపోవడంతో విష‌యం అమీర్ ఖాన్ కి అర్ధ‌మైంది. కాని లాల్ సింగ్ ఒక పెద్ద ఆశ మిగిలిఉంది. 15వ తేదీ సోమవారం వరకు వీకెండ్ ఉంది. ఫ్యామిలీ ఆడియ‌న్స కి కంటెంట్ క్లిక్ అయితే క‌లెక్ష‌న్స్ వంద‌కోట్లు ఈజీగా దాటొచ్చు. ఆగ‌స్ట్ 15 బిగ్ హాలీడే. తర్వాత ఆగస్టు 16వ తేదీ మంగళవారం చాలామంది సెల‌వుల్లో ఉన్నారు. అందుకే వీకెండ్ కి లాల్ సింగ్ క‌లెక్ష‌న్స్ క‌ళ్ల‌జూడొచ్చ‌న్న‌ది ట్రేడ్ అంచ‌నా.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి